మహానుభావులు కొందరే వుంటారు. మహత్తర కార్యాలు చెయ్యడానికే వారు పుడతారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. మన భారతదేశానికి స్వేచ్చావాయువులు అందించడంలో ఎనలేని కృషి చేసి, బ్రిటిష్ అధికారుల్ని గడగడలాడించి, తెలుగుజాతికే గర్వకారణంగా నిలిచి ' ఆంధ్రకేసరి ' గా పిలిపించుకున్న మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. దేశాభిమానంతో బాటు ఆత్మాభిమానం ఆయన సొత్తు. ఆయనలోని ఈ లక్షణాల్ని తెలియజేసే ఓ సంఘటన......
ప్రకాశంగారు వృత్తి రీత్యా న్యాయవాది. కొంతకాలం రాజమండ్రిలో ప్రాక్టీసు చేసారు. ఒకసారి అక్కడి మునసబు కోర్టులో ఓ కేసు విషయంలో వ్యాజ్యం జరుగుతోంది. ఆ సమయంలో ప్రకాశం పంతులుగారు అక్కడే వున్నారు. ఆ కేసులో నిందితుడిగా వున్న వ్యక్తిని మునసబుగారు అతని తరఫున వకీలెవరని అడిగారు. తాను పేదవాడినని, వకీలును పెట్టుకునే స్థోమత లేదని విన్నవించుకున్నాడు ఆ వ్యక్తి. దానికా మునసబు హేళనగా ....
" అదేమిటయ్యా ! ఇంత పెద్ద రాజమండ్రి పట్టణంలో వకీళ్ళకేమి కొరత ? వీధికి ముగ్గురు వకీళ్ళున్నారు. రెండు మూడు రూపాయలిస్తే ఏ వకీలైనా నీ తరఫున వాదించడానికి వస్తాడు " అన్నారు.
ఇది విన్న ప్రకాశంగారికి ఆత్మాభిమానం పొంగివచ్చింది. రాజమండ్రి వకీళ్ళను హేళన చేసిన మునసబు మీద కోపం వచ్చింది. ఆయనకు బుద్ధి చెప్పాలని వెంటనే లేచి నిలబడి.....
" అయ్యా ! మీరు చెప్పింది గతంలో సంగతి. ఇప్పుడు రెండు, మూడు రూపాయలకు వాదించే వకీళ్ళు ఎవరూ రాజమండ్రిలో లేరు. అలాంటి వాళ్ళందరూ మునసబులైపోయారు " అన్నారు. దాంతో ఒకప్పుడు వకీలుగా పనిచేసిన ఆ మునసబు ఖంగు తిన్నాడు.
' ఆంధ్రకేసరి ' టంగుటూరి ప్రకాశం పంతులుగారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ.....
Vol. No. 03 Pub. No. 009
8 comments:
:-D
చప్పట్లు చప్పట్లు ఆంధ్రకేసరిగారికి!
aa munasabu ki kevvvvvv...
super! :))
ఆంధ్ర కేసరి గారికి ఎంత కోపం వచ్చిందో కానీ నాకు మాత్రం రక్తం ఉడికింది ః(
కోర్టుల్లో పని చేసే వాళ్ళందరూ పెద్ద మనుషులు కారని తెలుసు కానీ ఇది ఆనాడె జరగటం కొంత ఆశ్చర్యమే...
* Indian Minerva గారూ !
* ఆ. సౌమ్య గారూ !
* అజ్ఞాత గారూ !
* మధురవాణి గారూ !
* జనార్ధన్ గారూ !
ధన్యవాదాలు
I echo Sowmya and Madhuravani.
madhuri.
మాధురి గారూ !
ధన్యవాదాలు
Post a Comment