Showing posts with label శుభాకాంక్షలు. Show all posts
Showing posts with label శుభాకాంక్షలు. Show all posts

Thursday, August 26, 2021

దశ దిశోత్సవం... శిరాకదంబం పత్రిక ప్రత్యేక సంచిక

*

శిరాకదంబం ’ అంతర్జాల పత్రిక ప్రస్థానం లో దశాబ్ద కాలం పూర్తి అయింది. పదకొండవ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ ప్రయాణం సాఫీగా సాగడానికి తమవంతు సహకారాన్ని అందిస్తున్న రచయితలు, రచయిత్రులకు, చందాదారులకు, శ్రేయోభిలాషులకు, ప్రకటనదారులకు, ఇంకా అనేక రూపాల్లో ప్రోత్సాహాన్ని అందిస్తున్న .... అందరికీ కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటూ.... 🙏 🙏 🙏

' దశ దిశోత్సవం '  పేరిట పదవ వార్షికోత్సవ సంచిక ను భవిష్యత్తు మార్పులకు సూచికగా రెండు భాగాలుగా రూపొందించడం జరిగింది. అందులో ఒకటి మామూలు పద్దతిలోని అక్షర రూపంలో అయితే మరొకటి దృశ్య శ్రవణ ( AV ) రూపంలో వెలువడింది. 

ఇప్పటి వరకు ప్రతి నెల వెలువడుతున్న రెండు సంచికల్లో ఇకపైన ఒకటి అక్షర రూప సంచికగా, మరొకటి దృశ్య శ్రవణ సంచికగా వెలువడుతాయి. రచయితలు, పాఠకులు, ప్రకటన దారులు, శ్రేయోభిలాషులు గమనించ ప్రార్ధన. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అంశాలపై ప్రసంగాలు, కథా కవితా పఠనాలు, శాస్త్రీయ... లలిత... జానపద... వంటి పాటలు, పద్యాలు, ఏక పాత్రాభినయం, నాటిక, నృత్యం వంటి ప్రదర్శనా కళలు, చిత్రలేఖనం, చేతి వృత్తులు, వంటలు వంటి ఏ అంశం మీదనైనా దృశ్య ( వీడియో ) లేదా శ్రవణ ( ఆడియో ) మాధ్యమాల ద్వారా పంపించవచ్చు. వివరాలకు editorsirakadambam@gmail.com గాని, editor@sirakadambam.com గాని సంప్రదించవచ్చు. 

' దశ దిశోత్సవం ' ప్రత్యేక సంచిక..... ఈ క్రింది లింక్ లో..... 

శిరాకదంబం 11_001 

 

Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 13 Pub. No. 001


Wednesday, April 7, 2021

ప్లవ నామ ఉగాది ప్రత్యేక సంచిక....

ప్లవ నామ ఉగాది శుభాకాంక్షలతో....... 

  1. వేదార్థం – అగ్నిసూక్తం 01
  2. రమ్యమైనది రామనామం
  3. నాకు తెలిసిన మహానుభావులు – స్పూర్తిదాతలు
  4. గౌహతి లో ఉగాది పండుగ
  5. ఋషిమండలం
  6. లలిత సంగీతం నాడు – నేడు
  7. ఆంధ్ర జానపద, సంగీత, సాహిత్యాలు
  8. దైనందిన జీవితంలో సంస్కృతం
  9. సినీ సంగీతఝరి
  10. అయిగిరి నందిని…
  11. తెలుగు వారి క్రీడా సంస్కృతి
  12. తెలుగు ఉగాది
  13. జ్ఞాపకాల మధురిమలు
  14. తెలుగువారి జానపద కళలు
  15. మహర్నవమి గడలు
  16. తెలుగువారి భోజనం
  17. ప్రవాసంలో తెలుగు అక్షరం
  18. తెలుగు ఉగాది వెలుగు
  19. తెలుగింట కళాభ్యాసం
  20. అంతర్జాతీయంగా తెలుగు వికాసం
  21. గురజాడ తెలుగుజాడ
  22. తెలుగు సాహిత్యంలో వర్ణనలు

తెలుగు భాష, సంస్కృతి సుగంధాలను వెదజల్లుతున్న రచనలతో నిండిన... నిండైన... " శిరాకదంబం " ప్లవ నామ ఉగాది ప్రత్యేక సంచిక.... ఈ క్రింది లింక్ లో...... 

శిరాకదంబం 10_016



Visit web magazine at https://sirakadambam.com/ 

 Vol. No. 12 Pub. No. 015

Sunday, January 24, 2021

జయదేవకవి... అదిగో మన జెండా... గతకాలము మేలు.... ఇంకా చాలా...

 * ఈ రూపకంలో రాధ అష్టపదులను నేను పాడగా, శ్రీకృష్ణుని  పాటలను కీ.శే. రామకృష్ణ చందేశ్రీ, సూత్రధారిగా కీ.శే. శ్రీ జగదీశ్ సింగ్ ఠాకూర్, సఖియలుగా శ్రీమతులు సురేఖా కోర్డే, జయశ్రీ తట్టే, కుసుమ్ బడోద్కర్ ఆలపించారు. దీనికి సంగీతాన్ని సమకూర్చింది నేను ( అసిస్టెంట్ ప్రొడ్యూసర్/సంగీత రచన ),  కీ. శే.  బిరాజ్ భూషణ్ బసు, శ్రీ రామకృష్ణ చందెశ్రీ. ఈ సంగీత రూపకాన్ని గురించి అన్ని ఇంగ్లీష్ వార్తా పత్రికలూ ఎంతో కొనియాడాయి. దీని విజయం తరువాత, ఏటా జరిగే కాళిదాస్ మహా సమారోహ్ లో కూడా ఇది ఆకాశవాణి కళాకారులచే మళ్ళీ ప్రదర్శించబడింది.... వాగ్గేయకారులు శీర్షికనజయదేవకవి

 

* భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో.....

మనభారతజాతికి నీతికి

ప్రతీకగా నిలిచినజెండా !

మనధ్యానం మనప్రాణం

మనసర్వం ఈ జెండా ! .... బాలభారతం నుంచి " అదిగో మన జెండా "

 

* అప్పట్లో ఎంత బాగుండేది !! పిల్లలు తమిద్దర్ని వాళ్ళ దగ్గర కి పిలిపించుకుని విదేశాల్లో వింతలన్ని చూపించి పంపారు ఆ విశేషాలు అన్నీ తను టీ కొట్టు వద్ద, జిలేబీ సెంటర్ వద్ద, పునుకుల బండి వద్ద ఎక్కడ పడితే అక్కడ తన కాలనీ ఫ్రెండ్స్ తో చెబుతుంటే వాళ్ల ముఖాల్లో మెరుపులు, అవీ చూసి తాను కొనిచ్చిన జిలేబీ లూ బజ్జీలు తింటూ ఆనందించే వారితో ఎంత హాయిగా ఉండేది .. అలాంటి జీవితం లో ఒక్కసారిగా ఈ మార్పు...

... " గతకాలము మేలు " ఇంకా చాలా ... ఈ క్రింది లింక్ లో.....

 శిరాకదంబం10_011 

Visit web magazine at https://sirakadambam.com/

Vol. No. 12 Pub. No. 010

Saturday, January 2, 2021

గొబ్బియళ్ళో.... గొబ్బియళ్ళో.... పురందరదాసు... నిజాయితీ ఎవరికోసమో కాదు, నీకోసమే.... ఇంకా....

New Year ( 2021 ) & సంక్రాంతి శుభాకాంక్షలతో....  

* మన పండుగలన్నిటిలో చెప్పుకోదగ్గ పండుగ సంక్రాంతి.

పంటల పండుగగా దీన్ని చెప్పుకుంటారు.

భోగభాగ్యాలతో బాటు అనేక విశేషాలు ఈ పండుగ మనకి అందిస్తుంది.

ఆ విశేషాలన్నిటినీ గుది గుచ్చి అందించిన సంక్రాంతి పాట.... గొబ్బియళ్ళో.... గొబ్బియళ్ళో....   

 * ఈయన ఒక గొప్ప భారతీయ తత్వవేత్త, హరిదాసు, వాగ్గేయకారుడు. ఆపై ముఖ్యంగా ఒక సమాజోద్ధారకుడు. ఒక కృష్ణ భక్తునిగా, ఒక వైష్ణవ కవిగా వీరు ద్వైత సాధువైన వ్యాసతీర్థుని శిష్యులు. ఆ విధంగా పండరినాథుని కొలవటం జరిగింది. అంతేకాక వీరి గురువు వీరిని గురించి తమ గేయాలలో ఇలా పేర్కొన్నారు కూడా:దాసరేంద్రరే పురందర దాసరాయ ". వీరు కర్ణాటక సంగీతానికి అందచేసిన అపూర్వ సంపద దృష్ట్యా వీరిని సాక్షాత్తూ నారదముని అవతారంగా భావిస్తారు.  వాగ్గేయకారులు శీర్షికన పురందరదాసు  

 * " కెరటం నాకు ఆదర్శం.

లేచి పడుతున్నందుకు కాదు,

పడినా లేస్తున్నందుకు "

జాతీయ యువజన దినోత్సవం ( స్వామి వివేకానంద జయంతి ) సందర్భంగా ప్రత్యేక వ్యాసం...  నిజాయితీ ఎవరికోసమో కాదు, నీకోసమే.... ” 

 ఇంకా చాలా... ఈ క్రింది లింక్ లో.....

శిరాకదంబం 10_010

Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 12 Pub. No. 009

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం