Showing posts with label వర్తమానం. Show all posts
Showing posts with label వర్తమానం. Show all posts

Thursday, January 31, 2013

తెలుగు పరిరక్షణకు ఏం చేయాలి ?

 ' తెలుగుని పరిరక్షించాలి ' .....
ఇది సర్వత్రా వినిపిస్తున్న మాట.
అసలు తెలుగు భాష ప్రస్తుత పరిస్థితి ఏమిటి ? దానిని పరిరక్షించడానికి కావాల్సిన ఉపశమన మార్గాలు ఏమిటి అన్నది ఈ నెల 27 వ తేదీన ' సూర్య ' దినపత్రికలో వచ్చిన ప్రముఖ రచయిత్రి ముప్పాళ రంగనాయకమ్మ గారి వ్యాసం లో చదవండి..... 
ఆ లింక్....
http://news.suryaa.com/opinion/edit-page/article-119910

 - ' సూర్య ' దినపత్రిక సౌజన్యంతో....

Visit web magazine at www.sirakadambam.com


Vol. No. 04 Pub. No. 066

Tuesday, September 11, 2012

పిల్లలతో.... ఇల్లాలే ఈ జగతికి.....

ఏదేని ఉత్సవానికో, ప్రసంగానికో వెళ్ళినపుడు చంటి పిల్లలు ఉన్న తల్లులు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తటవర్తి జ్ఞానప్రసూన గారు సోదాహరణం గా వివరించారు ..... ఈ క్రింది లింకులో ...........

పిల్లలతో...... - తటవర్తి జ్ఞానప్రసూన



' ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి ' అంటూ స్త్రీ ని బాధ్యతలనే చట్రంలో ఎలా కట్టేసారో వివరిస్తున్నారు ఉషారాణి కందాళ గారు.....
 ఈ క్రింది లింకులో ......... 

భావ ఉషస్సు 09 - ఉషారాణి కందాళ




Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 009

Wednesday, July 13, 2011

మళ్ళీ ఉగ్రవాద ఉన్మాదం

మళ్ళీ ఉగ్రవాదం పంజా విసిరింది
మళ్ళీ ఉన్మాదం హద్దులు దాటింది

ఈ యుద్ధం ఎవరి మీద ?
ఈ విధ్వంసం దేని కోసం ?

ఈ ఉగ్రవాదులకు కావాల్సిందేమిటి ?
ఈ ఉగ్రవాదులు సాధించేదేమిటి ?

వాళ్ళకు కావాల్సింది అమాయకుల ప్రాణాలా ?
వాళ్ళు తీర్చుకునేది పైశాచిక రక్త దాహమా ?

ఈ ఉన్మాదం ఆగేదెప్పుడు ?
మనిషి మనిషిగా మారేదెపుడు ?

 ఈరోజు జరిగిన ముంబై పేలుళ్లకు బలైన అమాయకులకు  శ్రద్ధాంజలి ఘటిస్తూ.... క్షతగాత్రులైన వారికి సానుభూతి తెలుపుతూ..... ఇప్పటికైనా ఉగ్రవాదులు ఉన్మాదానికి ముగింపు పలకాలనే ఆలోచన రావాలని కోరుకుంటూ.......

Vol. No. 02 Pub. No. 279

Saturday, June 25, 2011

ప్రజల నెత్తిన పిడుగు

 ఉరుములేని పిడుగు... ప్రజల నెత్తిన పడ్డ పేద్ద గ్యాస్ బండ  
 అంతులేని అవినీతికి అంగుడెక్కడ రాజకీయ వ్యాపారంలో....
దోచుకోవడం... దాచుకోవడం... 
ప్రజల బ్రతుకు బండలు చెయ్యడం ప్రభుత్వాల వంతు..... 
బండబారిన.... మోడువారిన...
బ్రతుకును నిస్సహాయంగా, నిస్తేజంగా వెళ్లదియ్యడం ప్రజల వంతు.....  


డీజిల్ ధర మూడు రూపాయిలు పెరిగింది ..... ప్రభుత్వం 
అందువలన మేము కూడా ధరలు పెంచక తప్పలేదు.... వ్యాపారులు 
మీరెంతైనా పెంచుకోండి కానీ మా ఆస్తులు మాత్రం పెంచండి.....నాయకులు, అధికారులు 
కష్టార్జితమంతా మీ యెదాన పోసి మేమేం తిని బ్రతకాలి ? ......... ప్రజలు  



 అగ్ని ప్రమాదాలు లేవు.. ఆడపడుచుల వరకట్నఆత్మహత్యలు లేవు.....
ఎంత హాయి....ఇది నిజం... ఇది భారతదేశమే ! నమ్మండి.
ఎందుకంటే కిరోసిన్ ధర పెరిగింది... చావు కూడా ఖరీదయింది...... 
పేదల బ్రతుకు చీకటయ్యింది..... ప్రజల గుండె మండింది......

పెరిగింది స్వల్పమే..... పెరగాల్సింది చాలా వుంది..... అని సెలవిచ్చారు మంత్రివర్యులు 
ఇక ప్రజలు భోంచేయాల్సింది గాలి.... చీకటిని తరమాల్సింది తమ కడుపులోని మంటతో..... 




ఒప్పుకుంటే కుక్క మేకవుతుంది.... తలూపితే తల తాకట్టుకు వెడుతుంది....
దెబ్బకు దెయ్యం ఝడుస్తుంది... ప్రజలు కన్నెర్రజేస్తే ప్రభుత్వం కూలుతుంది....
ఆ సత్యం గ్రహిస్తే నల్లధనమూ బయిటకొస్తుంది... ఈ తత్త్వం ఒంటబడితే అవినీతీ అంతమవుతుంది.... 
అప్పడిక ధరలూ పెరగవు...... జీవన ప్రమాణాలూ తరగవు..... స్వార్థశక్తుల పెత్తనాలూ చెల్లవు.....  

ఇక మనకు కూడా ప్రజా విప్లవాలు తప్పవేమో ! శిశుపాలుర శిరస్సులు ఖండించే రోజు దగ్గరలోనే ఉందేమో !

గ్యాస్ సిలండర్ పై సుమారు 50 రూపాయిలు, డీజిల్ లీటర్ పై సుమారు 3 రూపాయిలు, కిరోసేన్ లీటర్ పై సుమారు 2 రూపాయిలు ఈ అర్థరాత్రి నుండే ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రజల నెత్తిన పిడుగులాంటి వార్త.

Vol. No. 02 Pub. No. 264

Saturday, June 18, 2011

నక్షత్ర వృక్షాలు

 పర్యావరణ పరిరక్షణకు, ముఖ్యంగా మన ఆరోగ్యం కాపాడుకోవడానికి తప్పనిసరిగా మొక్కల్ని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. మన జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఏ వృక్షాన్ని పెంచితే మంచిదన్న విషయం ఈరోజు మిత్రులు డిప్యూటీ కలెక్టర్ శ్రీ రహమతుల్లా గారు మెయిల్ లో పంపిన సందేశం..... అందరికోసం.............

జన్మ నక్షత్రం  పెంచవలసిన వృక్షము
అశ్వని అడ్డసరము ,విషముష్టి ,జీడిమామిడి
భరణి దేవదారు ,ఉసిరిక
కృత్తిక అత్తి ,మేడి
రోహిణి నేరేడు 
మృగశిర చండ్ర ,మారేడు
ఆరుద్ర రేల ,చింత
పునర్వసు వెదురు ,గన్నేరు
పుష్యమి పిప్పలి
ఆశ్లేష నాగకేసరి ,సంపంగి
మఖ మర్రి
పుబ్బ మోదుగ
ఉత్తర జువ్వి
హస్త కుంకుడు ,సన్నజాజి
చిత్త తాటిచెట్టు ,మారేడు
స్వాతి మద్ది
విశాఖ నాగకేసరి ,వెలగ ,మొగలి
అనూరాధ పొగడ
జ్యేష్ట విష్టి
మూల వేగిస
పూర్వాషాఢ నిమ్మ ,అశోక
ఉత్తరాషాఢ పనస
శ్రవణం జిల్లేడు
ధనిష్ట జమ్మి
శతభిషం అరటి ,కడిమి
పూర్వాభాద్ర మామిడి
ఉత్తరాభాద్ర వేప
రేవతి విప్ప

Vol. No. 02 Pub. No. 259

Thursday, April 7, 2011

ప్రపంచ ఆరోగ్యం

ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజల ఆరోగ్య రక్షణకై తీసుకోవాల్సిన చర్యలను ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం ఆరోగ్య దినోత్సవ థీమ్ గా ' ఔషధ నిరోధంపై పోరాటం ' ప్రకటించింది. ఈరోజు చర్య తీసుకోకుంటే రేపు నివారణ ఉండదని కూడా తమ ప్రకటనలో చేర్చింది. అంతేకాదు. సూక్ష్మజీవుల నిర్మూలన,  నిరోధం కోసం పోరాటం చెయ్యాలని.... తద్వారా మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పూనుకుంది. దానికోసం ఓ షట్ సూత్ర ప్రణాళికను రూపొందించింది. ఆ ప్రణాళికలోని అంశాలు ......

1 . ప్రజల భాగస్వామ్యంతో జవాబుదారీతనంతో ఒక సమగ్ర ఆర్ధిక ప్రణాళికను రూపొందించి అమలు చెయ్యాలి.  
2 . పరిశోధనశాలలను అభివృద్ధి చెయ్యడంతో బాటు పర్యవేక్షణను కూడా బలోపేతం చెయ్యాలి. 
3 . అవసరమైన పరిమాణంలో అత్యవసర మందుల పంపిణీని నిరంతరాయంగా ఖచ్చితంగా జరిగేటట్లు  చూడాలి. 
4 . పాడి పరిశ్రమతోబాటుగా అన్ని రంగాల్లోనూ విచ్చలవిడిగా జరుగుతున్న మందుల వాడకాన్ని నియత్రించడం, హేతుబద్ధమైన వాడకాన్ని మాత్రమే ప్రోత్సహించడం చెయ్యాలి. రోగుల విషయంలో సరైన శ్రద్ధ తీసుకోవాలి.
5 . అంటువ్యాధుల వ్యాప్తిని నియత్రించడం, నిరోధించడం కట్టుదిట్టంగా అమలు చెయ్యాలి. 
6 . కొత్త విధానాల పరిశోధనను అభివృద్ధి చెయ్యాలి. 

ఔషధ నిరోధంపై పోరాటం
ఈరోజు చర్య లేకుంటే రేపు నివారణ లేదు

Vol. No. 02 Pub. No. 193

Sunday, March 20, 2011

చందమామ వచ్చే

 చందమామ వచ్చే 
జాబిల్లి వచ్చే 
కొండెక్కి వచ్చే
వెలుగు పూలు తెచ్చే 

నిన్న ( 19 -03 -2011 ) అర్థరాత్రి దివినుండి దిగి వచ్చి కనువిందు చేసిన చందమామను వీక్షించండి........

ఫోటోగ్రఫీ : ఎస్. ఉదయ్, బి. ఎస్సీ. - విస్కాం ( ద్వితీయ ) 




Vol. No. 02 Pub. No. 177

Sunday, March 13, 2011

విధ్వంసం - విలయం

 గతవారం వెంట వెంటనే జరిగిన సంఘటనలు గమనించాక ఓ రకమైన స్తబ్దత ఏర్పడింది. ఏమని స్పందించాలో తెలియని పరిస్థితి. స్పందించకుండా ఉండలేని పరిస్థితి. ఒకటి ప్రకృతి సృష్టించిన విలయమైతే మరొకటి మనకి మనమే సృష్టించుకున్న విధ్వంసం.                                     

  ఆత్మహత్యా సదృశము
                 
 
ఠీవిగా నిలబడ్డ తెలుగు తేజం నేలకొరిగింది 
తెలుగుజాతి ఆత్మగౌరవం వీధిపాలయింది   

విగ్రహాలను కేవలం రాతిబోమ్మలుగా చూస్తే
అరాచకమైన పనులు రాతిమనుషుల్లా చేస్తే

అనుకున్నది నెరవేరుతుందా ? ఆశయం సిద్ధిస్తుందా ?
మన గౌరవాన్ని మనమే నేలపాలు చేసుకోవడం తప్ప  

 రాష్ట్రం సమైక్యంగా వున్నా, రెండుగా చీలినా
మనమందరం తెలుగువారం..మనది తెలుగు జాతి

అది గమనించి స్వార్థ రాజకీయాల ముసుగు మనమే తొలగించాలి
లేకుంటే ఇలాంటి సంఘటనలు మనకు ఆత్మహత్యా సదృశాలవుతాయి

  ప్రకృతి విలయ తాండవం  

ప్రకృతి మళ్ళీ కన్నెర్ర చేసింది 
అన్నిటా మిన్న అనిపించుకున్న దేశం 
అంతులేని విషాదంలో మునిగిపోయింది.
నిన్నటి వరకూ ప్రపంచ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసిన దేశం.. నేడు కనీ వినీ ఎరుగని నష్టాన్ని చవి చూసింది. వారి సాంకేతిక పురోగతి ఇప్పుడు వారి మనుగడకే సవాల్ విసిరింది. అణువిస్పోటనం వారినే కాదు ప్రపంచాన్నే వణికిస్తోంది. జపాన్ ప్రజల కడగండ్లు తీరేదేప్పుడో.... మళ్ళీ జపాన్ కు పూర్వ వైభవమెన్నడో.... 

Vol. No. 02 Pub. No. 171

Wednesday, February 23, 2011

విదేశీ మోజు


మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో
మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం 



...... అలాగే మనకు విదేశాల మీద, వారి అలవాట్లు, ఆచార వ్యవహారాల మీద ఎంత ఆసక్తి, మోజు ఉంటాయో విదేశీయులకు కూడా మన సాంప్రదాయాల మీద మోజు వుండడం సహజం. మనమెప్పుడో మన వివాహ పద్ధతుల్లో విదేశీ పద్ధతుల్ని చాపక్రింద నీరులా కలిపెయ్యడం ప్రారంభించాం. మన వివాహ వ్యవస్థలో వున్న తంతులకి, మంత్రాలకి ఎప్పుడో మంగళం పాడేశాం. ఐదురోజుల తతంగాన్ని ఐదు గంటలకు ఇంకా వీలయితే గంటలోకి కుదించడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే ఆర్భాటాలు మాత్రం పెంచుకుంటూ పోతున్నాం. చక్కగా పలకరింపులతో పంక్తి భోజనం చెయ్యడం దగ్గర్నుంచి హడావిడిగా మన ప్రక్కన ఎవరున్నారో గమనించే తీరిక కూడా లేకుండా బఫే భోజనంతో నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని తెచ్చిన బహుమతిని వదూవరులకిచ్చేసి అభినందనలు చెప్పేసి వీలయితే మన హాజరుకు సాక్ష్యంగా వాళ్ళతో ఒక ఫోటో లాగించేసి ' బెస్ట్ అఫ్ లక్ ' తో బాటే బై కూడా చెప్పేస్తున్నాం. పెళ్ళివారు కూడా మండప అలంకారానికి, వాళ్ళ అలంకారానికి ఇచ్చిన ప్రాధాన్యత పెళ్లి తంతుకి ఇవ్వడం లేదు. 

మన వివాహ వ్యవస్థలో పాశ్చాత్య పోకడలు పెరిగిపోతుంటే విదేశీయులను  మన వివాహ వ్యవస్థ ఎంతగా ఆకర్షిస్తోందో ప్రపంచ ప్రసిద్ధ నటుడు చార్లీ చాప్లిన్ మనవడి పెళ్లి గురించి చదివితే అర్థమవుతుంది.  

ఈనాటి ( ఫిబ్రవరి 23 ) ఈనాడు పత్రికలోని ఈ వార్త లింక్ ఇదిగో.........

 Vol. No. 02 Pub. No. 153

Saturday, December 18, 2010

సినిమాల గురించి శ్రీశ్రీ

 ఇప్పుడు తెలుగు చలనచిత్ర రంగం ఒక రకమైన స్తబ్దతలో వుంది. నిర్మాతలు ఆత్మ పరిశీలనలో  పడ్డారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం అప్పటి చిత్ర నిర్మాణ పరిస్థితి గురించి మహాకవి శ్రీశ్రీ రాసిన ఓ వ్యాసంలోని కొన్ని భాగాలు ఇక్కడ ఇస్తున్నాను. పరిస్థితిలో ఇప్పటికి కూడా పెద్ద మార్పు లేదని ఈ వ్యాసం చదివిన వారందరూ సులువుగా గ్రహించవచ్చు. ఆ విషయాన్ని నిర్మాతలు కూడా గ్రహించి తమ ఆత్మ పరిశీలనలో శ్రీశ్రీ గారు స్పృశించిన అంశాలను కూడా పరిశీలనలోకి తీసుకుంటే బాగుంటుంది. ఇక చదవండి.......

 సినిమా అనేది ఒక బ్రహ్మాండమైన ఆయుధం.  దానిని వినియోగించగల బ్రహ్మాండమైన కళాస్రష్ట మనలో ఇంకా బయిలుదేరలేదు. ప్రస్తుతం ఆది చిటికెన వేలంతటి మనుషుల చేతిలోనే వున్నది. వారు కూడా దానిని తమ అల్ప ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారు. బిర్లా, టాటాలు 501 సబ్బును, సిమ్మెంటు బస్తాలను ఉత్పత్తి చేస్తున్నట్లుగానే మన ప్రొడ్యూసర్లు ఈనాడు చిత్ర నిర్మాణం చేస్తున్నారు.

సలు ఉత్తమ చిత్రాలు నిర్మిస్తే మన ప్రజలు చూడరని చెప్పడం కూడా మన ప్రొడ్యూసర్లకు పరిపాటి అయింది. ఇది ఎంత అసందర్భంగా ఉన్నదో చెబుతాను వినండి. ఆహారాన్ని విక్రయించడం ఒక వ్యాపారంగా నడపడం 20 వ శతాబ్దంలోనే ప్రారంభమయింది. ప్రతివాడూ తిండికోసం హోటలుకు వెళ్ళాలి. అతడికి ప్రతీసారీ ఆహారం ( మంచిది ) లభించకపోవచ్చు. అయినా రోజూ హోటలుకు వెళ్లక తప్పదు.

హారం వలెనే ఈనాడు మానవునికి సినిమాకూడా ఒక అవసరం. అందువల్ల ఏ చిత్రం వచ్చినా ప్రేక్షకుడు చూస్తున్నాడు. కానీ కంపుకొట్టే వేరుశనగ నూనెతో చేసే వంటకాలను కాని ప్రజలు ముట్టరని, వాటికి వారు అలవాటు పడ్డారని యజమాని చెబితే ఎంత అసందర్భంగా ఉంటుందో ఉత్తమ చిత్రాలను నిర్మిస్తే ప్రజలు చూడరని చెప్పడం కూడా అలాగే వున్నది.

నాటకానుభవంలేని కవులు సినిమా రచయితలుగా వస్తే, యతిప్రాసలు రానివారు కవిత్వం చెప్పడానికి పూనుకున్నట్లే ఉంటుంది. సినిమా రచయితలకు నాటకానుభవం ఉండి తీరాలి.  శ్రీ పింగళి నాగేంద్రరావుగారికి అట్టి అనుభవం వున్నందువల్లే " పాతాళభైరవి '' వంటి కాకమ్మ పిచికమ్మ కథలో అంత ' డ్రమెటిక్ ఎఫెక్ట్ ' తీసుకురాగలిగారు.

సాధ్యమైనంత ఎక్కువ యాక్షన్ తోనూ, సాధ్యమైనన్ని తక్కువ సంభాషణలతోనూ నిర్మించినపుడు చిత్రం ఉత్తమంగా వుంటుంది. అందుకు సహాయభూతం కాగల నాటకానుభవం వున్న రచయిత తప్పకుండా దర్శక పదవిని ఆక్రమించవచ్చు. డైరెక్టర్ అంటే ' స్టార్ట్ ' ' కట్ ' అని కేకలు వేసేవాడు మాత్రం కాదు.

మైనా ఏ ప్రజలకు తగిన ప్రభుత్వం ఆ ప్రజలకు లభించినట్లుగానే, ఆయా ప్రజల అభిరుచులను బట్టి ఆయా సినిమాల స్థాయి కూడా వుంటుంది.    

Vol. No. 02 Pub. No. 089

Saturday, June 5, 2010

పంచభూతాలు - ప్రకృతి

పంచభూతాలు ప్రకృతిమాత మనకు ప్రసాదించిన వరాలు
మహాజ్ఞానులమనే అజ్ఞానంతో మనం విర్రవీగితే
మిగిలేది శూన్యమే !

ప్రకృతి మాత వొడిలో మానవుడు ఎప్పుడూ బాలుడే !
ఆది తెలుసుకుంటే ప్రకృతి మనకెప్పుడూ అమ్మ వొడే !
అప్పుడంతా ఆనందమే !

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఓ చిన్న విన్నపం..........

 


Vol. No. 01 Pub. No.310

Wednesday, May 19, 2010

ప్రకృతికి ప్రశ్నలు

 మొన్న క్రోధంతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణవేణమ్మ
విరుచుకుపడింది తన ప్రవాహానికి అడ్డుకట్టిన ఊళ్లమీద

నిన్నటివరకూ నిప్పులు చెరిగిన భానుడు
చెలరేగిపోయాడు తనని కూడా లెక్క చెయ్యని జనం మీద

ఈరోజు ఆగ్రహంతో ఊగిపోతున్న సముద్రుడు
విరుచుకుపడబోతున్నాడు మరోసారి సామాన్య ప్రజల మీద

ఓ కృష్ణమ్మా ! ఓ భానుడా ! ఓ సాగరుడా !
మీకు కూడా డొక్కలెండిన సామాన్యుడే లోకువా ?
మీ ప్రవాహంతో అవినీతిని కడగలేరా ?
మీ ప్రతాపంతో అన్యాయాన్ని భస్మం చెయ్యలేరా ?
మీ అలల వేగంతో కుత్సితం నిండిన వ్యవస్థను ముంచెత్తలేరా ?




Vol. No. 01 Pub. No. 291

Friday, April 9, 2010

బహుపరాక్ !!!


నాకు మెయిల్ లో ఒక ఇంటర్నెట్ మిత్రుడు పంపిన సమాచారం ఆధారంగా,,,,,,,,,,,,,,,,


బెంగుళూరులో పది సంవత్సరాల బాలుడు పదిహేను రోజుల క్రితం ఒక అనాసపండు ( పైనాపిల్ ) తిన్నాడు. ఆరోజునుంచి అతను జబ్బు పడ్డాడు. అతన్ని ఆరోగ్య పరీక్షలకోసం తీసుకెళ్ళారు.........

ఆ పరీక్షల్లో అతనికి ఎయిడ్స్ వుందని నిర్థారణ అయింది.

ఆ బాలుని తల్లిదండ్రులు ఈ విషయం నమ్మలేకపోయారు..... మొత్తం కుటుంబం ఆరోగ్య పరీక్షలు చేయించుకుంది.....ఎవరికీ ఎయిడ్స్ లేదని తేలింది. అప్పుడు డాక్టర్లు అతన్ని జబ్బు పడటానికి ముందు తిన్న పదార్థాల గురించి ప్రశ్నించారు. అతను ఆ రోజు తిన్న అనాసపండు విషయం బయిట పడింది. అంతే !! ఆస్పత్రినుంచి ఓ బృందం ఆ అనాసపండు అమ్మినతని దగ్గరకు వెళ్ళింది.

ఆరోజు జరిగిన విషయం గురించి విచారించారు. వారికో ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఆ అనాసపండు కోస్తుండగా ఆ పండ్లు అమ్మే అతని చేతి వేలు తెగి రక్తం కారి ఆ పండు ముక్కలకు అంటినట్లు తెలిసింది.

దాంతో అతనికి రక్త పరీక్ష చెయ్యగా అతనికి ఎయిడ్స్ వుందని తెలిసింది. దురదృష్టవశాత్తూ అతనికా విషయం తెలియక పోవడంతో తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. దాంతో ఆ మహమ్మారి అతని రక్తం ద్వారా ఆ బాలునికి అంటింది. చెయ్యని పాపానికి ముక్కుపచ్చలారని ఆ బాలుడు బలయ్యాడు.

అందుకే రోడ్ పక్కన అమ్మే చాట్ మసాలాలు, పానీ పూరీలు వగైరా తినే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. మీ ప్రమేయం లేకుండా ఇలాంటి రోగాల బారిన పడకండి.

ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువమందికి ముఖ్యంగా మీ పిల్లలకు చేరేటట్లు చూడండి.
బహుపరాక్ !!!

ఆ మెయిల్ లోని సమాచారం :

Dear All,

It's in INDIA - Karnataka - Bangalore

A 10 year old boy, had eaten pineapple about 15 days back, and fell

sick, from the day he had eaten. Later when he had his Health check

done......

doctors diagnosed that he had AIDS.


His parents couldn't believe it...Then the entire family under went a

checkup... none of them suffered from Aids. So the doctors checked again

with the boy if he had eaten out....The boy said 'yes'. He had pineapple

that evening. Immediately a group from the hospital went to the

pineapple vendor to check.


They found the pineapple seller had a cut on his finger while cutting

the pineapple; his blood had spread into the fruit.



When they had his blood checked...the guy was suffering from AIDS...but

he himself was NOT aware. Unfortunately the boy is suffering from it

now.


Please take care while u eat on the road side (
particularly tasty vada
pav & Paani Puri
) and pls fwd this mail to your dear one's..

PEOPLE
  TAKE CARE


PLEASE FORWARD THIS MAIL TO ALL THE PERSONS YOU KNOW AS YOUR MESSAGE MAY

SAVE ONE'S LIFE !!!!!


Vol. No. 01 Pub. No. 248

Sunday, March 21, 2010

నిదురపోరా తమ్ముడా !

ష్....! గప్ చుప్ .....

*
*
*
*
ఎక్కడనుంచి హాయి గొలిపే ఆ మధుర గానం ?......... మంచి నిద్ర వస్తోంది. ...... ఎవరు ఆ గాన కోకిల ?






మొన్న 19 వ తేదీ ప్రపంచ నిద్రా దినోత్సవం సందర్భంగా .............




Vol. No. 01 Pub. No. 231

Sunday, February 21, 2010

మాతృభాషాదినోత్సవం-విలువైన సమాచారం

ఈ రోజు అంటే ఫిబ్రవరి 21 వ తేదీ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవంగా ప్రకటించింది. ఆ సందర్భంగా మన మాతృభాష అయిన తెలుగుకి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించారు శ్రీ నూర్ రెహమతుల్లా గారు. ఈయన తెలుగు భాషా వ్యాప్తికి, ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు వాడకానికి విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రభుత్వాధికారిగా తనకున్న విస్తృతాధికారాల్ని తెలుగు భాషా వ్యాప్తికి ఉపయోగించడం ఎంతైనా అభినందనీయం. తెలుగుకు ప్రాభవానికి విశేషమైన కృషి చేస్తున్న ఆయనకు అభినందనలు తెలుపుతూ, తెలుగు భాషను ప్రేమించే వారందరికీ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలతో రెహమతుల్లాగారు అందించిన ఈ వ్యాసం...................

విద్యార్ధులు తెలుగులో మాట్లాడకూడదట
* కడప జిల్లా మైదుకూరు సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో తెలుగుభాష మాట్లాడకూడదంటూ చిన్నారుల మెడలో బోర్డులు తగిలించారు.తెలుగు భాష మా ట్లాడకూడదంటూ విద్యార్థులపై ఆంక్షలు విధించడం మానవ హ క్కుల ఉల్లంఘనకు పాల్పడటమేనని, ఇది ఘోర తప్పిదమని మా నవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టి స్‌ సుభాషణ్‌రెడ్డి వ్యాఖ్యానించా రు. (ఆంధ్రజ్యోతి 28.10.2009)
పసిపిల్లలు ఏడ్చేది మాతృభాషలోనే
పుట్టకముందే నేర్చుకుంటారు.మాతృభాషలో ఎన్నడూ మాట్లడనంటూ రాసి ఉన్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో 'ఉపాధ్యాయులు' వేలాడదీయటం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్‌ నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు.(ఈనాడు7.11.2009).కాబట్టి అన్ని మతాల దైవప్రార్ధనలు కూడా మాతృభాషల్లో ఉండటం సమంజసమే.
ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్
ఆరు, ఆపై తరగతులు చదివే విద్యార్థులు ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్‌ తీసుకోవడానికి ఇక మీదట జిల్లా విద్యా శాఖాధికారులే (డీఈఓ) అనుమతి ఇవ్వొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ద్వితీయ భాషగా ఇంగ్లీష్‌ను తీసుకోవాలంటే పాఠశాల విద్య డైరెక్టరేట్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. (ఆంధ్రజ్యోతి1.11.2009)-
తెలుగుపై పరిశోధన.. అమెరికాలోనే ఎక్కువ
మనదేశంలో భాషలపై పరిశోధనలు జరిపే వారే కరవయ్యారని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడితో పోలిస్తే.. అమెరికాలోనే ఎక్కువమంది తమిళ, తెలుగు భాషలపై పరిశోధనలు చేస్తున్న వారు కనిపించారని తెలిపారు.(ఈనాడు31.1.2010)
అంతరించిపోతున్నఅమ్మభాష
దాదాపు రెండుతరాల విద్యార్థులు తెలుగు రాకుండానే, తెలుగుభాషను తూతూమంత్రంగా చదువుకునే కళాశాలల నుంచి బైటికొచ్చారు. వాళ్లంతా ఇంజినీర్లు, డాక్టర్లు, ప్రభుత్వశాఖల్లో పెద్దపెద్ద ఉద్యోగులైపోయారు. తెలుగంటే వెగటు. ఇంట్లో తెలుగక్షరాలు కనపడనీయరు. వినబడనీయరు. ఇక వీరి పిల్లలకు మాత్రం తెలుగంటే ఏం తెలుస్తుంది పాపం! ఇలాగే ఇంకో రెండుతరాలు కొనసాగితే, తెలుగువాచకాన్ని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఓ పురాతన వస్తువులా ప్రదర్శనకు పెట్టాల్సిందే.పేరుకు భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రమైనా, మనదగ్గర తల్లిభాషది రెండో స్థానమే. మళ్లీ మాట్లాడితే, మూడోస్థానమే.యాభై ఏడక్షరాలు, మూడు ఉభయాక్షరాలున్న మన వర్ణమాల ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్దది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత కానీ మనం తెలుగుభాషకు అధికార హోదా కల్పించుకోలేకపోయాం. తెలుగుభాషకే మంగళహారతులు పాడేస్తున్నాం.ఇంగ్లిష్‌, రోమన్‌, జర్మన్‌ సహా సంస్కృతం, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం వంటి భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగు భాషకే భావాలను వేగాతివేగంగా అక్షర రూపంలోకి తర్జుమా చేయగల శక్తి ఉందని నిరూపించారు. 'ఇంగ్లిషులో ఒక అక్షరం 4.71 బిట్ల సమాచారాన్ని అందించగలిగితే, తెలుగు అక్షరం అదే సమాచారాన్ని అందించడానికి 1.14 బిట్లు మాత్రమే ఉపయోగించుకుంటుందని తేలింది. హిందీకి 1.56 బిట్లు, తమిళానికి 1.26 బిట్లు, కన్నడానికీ మలయాళానికీ 1.21 బిట్లు అవసరమయ్యాయి. ఇంగ్లిషులో ఒకే పదానికి అనేక పర్యాయపదాలు ఉండగా, ఒక్కో ప్రత్యేక పదం ద్వారా ఒక్కో ప్రత్యేక భావాన్ని స్పష్టంగా అందించగల సామర్థ్యం తెలుగు భాషకుంది. అదే ఈ వేగానికి కారణం.కంప్యూటరు, మౌజు, కీబోర్డు, హార్డ్‌వేరు, సాఫ్ట్‌వేరు...చివర్లో అచ్చు గుద్దేస్తే చాలు, కాకలుతిరిగిన ఇంగ్లీషు పదమైనా పంచెకట్టులోకి మారిపోతుంది. సాంకేతిక పదజాలాన్ని ఇట్టే ఇముడ్చుకోగల శక్తియుక్తులున్న ఏకైక భాష... భారతీయ భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగేనని యాభై ఏళ్ల కిందటే ప్రపంచ ప్రసిద్ధ రసాయనశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హాల్డెన్‌ ప్రశంసించారు.మనదేశంలో 1652 మాతృభాషలున్నాయి. వీటిలో మహా అయితే ఓ పదిహేను, పదహారు భాషలకు లిపి ఉంది. రెండువందల భాషలకు పదహారు వందలకుపైగా మాండలికాలున్నాయి. ముప్ఫైశాతం పిల్లలు తమ మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే, ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్టే.1956 ఫిబ్రవరి 29న పాక్‌ సర్కారు బెంగాలీని కూడా మరో అధికార భాషగా గుర్తించింది. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా ప్రకటించింది. - కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు 21.2.2010)

Vol. No. 01 Pub. No. 204

Tuesday, January 26, 2010

గణతంత్ర దినోత్సవ కానుక


అమెరికా మనకు గణతంత్ర దినోత్సవ షష్టి పూర్తి సందర్భంగా ఒక ప్రత్యేకమైన కానుక అందించింది.
అదేమిటో ఇక్కడ చూడండి. స్పందించండి.


Vol. No. 01 Pub. No. 169

Friday, December 11, 2009

ఉద్యమకారులకి నాయకుడి సందేశం

ఉద్యమాల్లో సమిధలవుతున్న విద్యార్థులకు, అమాయకులైన ప్రజలకు ఈ నాయకుడు ఇస్తున్న సందేశాన్ని చూడండి.




Vol. No. 01 Pub. No. 134

Thursday, December 10, 2009

చరిత్ర చెప్పిన ఉద్యమ సత్యాలు

1921 - ఇతర భాషల వారు తెలుగు భాషను చిన్న చూపు చూడటం సహించలేక తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి నిజాం పాలన క్రింద ఉన్న తెలంగాణా ప్రాంతంలో టేకుమళ్ళ రంగారావు, కె.వి.రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు మొదలైన వారు ' ఆంధ్ర జన సంఘం ' ఏర్పాటు చేశారు.
1937 - నిజామాబాద్ లో జరిగిన ఆంధ్ర సభలో బాధ్యతాయుతమైన పాలన కావాలని, బ్రిటిష్ ఇండియాలో వలె సంస్కరణలు అమలుచేయ్యాలని మొదటి రాజకీయ తీర్మానం చేశారు.
1938 - హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటయింది. నిజాం దానిని నిషేధించాడు.
1939_ 40 - సోషలిస్ట్ భావాలతో కమ్యూనిస్ట్ పార్టీ అవతరించింది.
1946 - హైదరాబాద్ సంస్థానంలో రాజకీయాలు మితవాద, అతివాద రాజకీయాలుగా విడిపోయాయి.
వీరిని అణచడానికి నిజాం అండదండలతో ' రజాకార్లు ' తయారయ్యారు.
1947 - భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నిజాం నవాబు భారత యూనియన్ చేరకుండా యథాతథ ఒప్పందం కుదుర్చుకున్నాడు. తెలంగాణా ప్రజలపై రజాకార్ల ఆగడాలు పెరిగిపోయాయి.
1948 - భారత ప్రభుత్వ సైనిక చర్యతో తెలంగాణా ప్రజలకు నిజాం పీడ వదిలిపోయింది.
1952_56 - హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. విశాలాంధ్ర ఏర్పాటు ప్రయత్నాలు సాగుతున్నపుడు కొందరు తెలంగాణా విడిగానే ఉండాలని పట్టుబట్టగా బూర్గుల రామకృష్ణారావు వారికి మద్దతిచ్చారు. విశాలాంధ్ర ఖాయమని తేలిపోయాక అభిప్రాయం మార్చుకుని దానికి తన మద్దతును ప్రకటించి ద్వంద్వ నీతిని ప్రదర్శించారు.
1956 - రాష్ట్రాల పునర్విభజన సంఘం నివేదిక ఆధారంగా కుదిరిన పెద్దమనుష్యుల ఒప్పదం ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలుగు వారందిరినీ ఏకం చేస్తూ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు చేసింది.
1969 - ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఋజువు కావడంతో చెన్నారెడ్డిని ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చెయ్యకూడాదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో తెలంగాణా వారిని ఆంధ్ర వాళ్లు అణగదొక్కుతూన్నారంటూ ఉద్యమం ప్రారంభమయింది. వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వేలమంది జీవితాలు బలయ్యాయి. కానీ ఆ ఉద్యమం చెన్నారెడ్డి రాజకీయానికి బలైపోయింది.
1972 - తెలంగాణా ఉద్యమ ఫలితంగా అధిష్టానం బ్రహ్మానందరెడ్డి చేత రాజీనామా చేయించి తెలంగాణా ప్రాంతానికి చెందిన పి. వి. నరసింహారావును ముఖ్యమంత్రిగా చేసింది. ఈ చర్యకు ఫలితంగా భూసంస్కరణలు అమలు, ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్ట్ స్టే కారణాలుగా చూపుతూ ప్రత్యేకాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. చివరికి అది కూడా రాజకీయ ప్రయోజనాలకి బలయిపోయింది.

ఏ ఉద్యమ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం
అమాయకుల బలిదానం
నాయకుల స్వలాభం
ఇది చరిత్ర చెప్పిన సత్యం

సమ్మె ఘెరావు దొమ్మీ
బస్సుల దహనం లూటీ
శాంతీ సహనం సమ ధర్మంపై
విరిగెను గూండా లాటీ
గాంధీ పుట్టిన దేశమా ఇది
నెహ్రు కోరిన సంఘమా ఇది
సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా !
.......... ( పాటను చూడండి ! )




Vol. No. 01 Pub. No. 132

Tuesday, December 1, 2009

చరిత్ర పునరావృతం

1969
తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర నినాదంతో హోరెత్తింది
భవిష్యత్తు పై కలలుకన్న విద్యార్థులెందరో బలయ్యారు
వారి ఆవేశమే స్వార్థరాజకీయ నాయకుల పెట్టుబడి
ఉద్యమం ఆ నాయకుల చేతిలోనే బలయ్యింది
1973
ప్రత్యేక ఆంధ్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసింది
ఇందులో కూడా విద్యార్థులే బలయ్యారు
అర్థ సంవత్సరం పైన నడిచింది
ఈ ఉద్యమం కూడా షరా మామూలే !
2009
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉధృత రూపం దాల్చింది
విద్యార్థులూ.....!! బహు పరాక్ !!!
మరోసారి నాయకుల రాజకీయ లబ్దికి బలవకండి
చరిత్ర ఇప్పటికే పునరావృత్తమయింది

Vol. No. 01 Pub. No. 122

Friday, November 20, 2009

ఆంధ్రప్రదేశ్ లో మొదటి మహిళా సౌరశక్తి ఇంజనీర్లు

" కృషి ఉంటే మనుష్యులు ఋషులవుతారు " కొంచెం ప్రేరణ, ప్రోత్సాహం ఉంటే ఏపని నేర్చుకోవడానికైనా విద్య, ఆర్ధిక పరిస్థితి, లింగ బేధాలు వగైరా అడ్డంకి కాదు. పట్టుదల, కృషి ఉంటే చాలని నిరూపిస్తూ మహిళా సాధికారతకు దర్పణమైన ఈ వీడియో చూడండి.


Vol. No. 01 Pub. No. 115
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం