ఇప్పుడు తెలుగు చలనచిత్ర రంగం ఒక రకమైన స్తబ్దతలో వుంది. నిర్మాతలు ఆత్మ పరిశీలనలో పడ్డారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం అప్పటి చిత్ర నిర్మాణ పరిస్థితి గురించి మహాకవి శ్రీశ్రీ రాసిన ఓ వ్యాసంలోని కొన్ని భాగాలు ఇక్కడ ఇస్తున్నాను. పరిస్థితిలో ఇప్పటికి కూడా పెద్ద మార్పు లేదని ఈ వ్యాసం చదివిన వారందరూ సులువుగా గ్రహించవచ్చు. ఆ విషయాన్ని నిర్మాతలు కూడా గ్రహించి తమ ఆత్మ పరిశీలనలో శ్రీశ్రీ గారు స్పృశించిన అంశాలను కూడా పరిశీలనలోకి తీసుకుంటే బాగుంటుంది. ఇక చదవండి.......
సినిమా అనేది ఒక బ్రహ్మాండమైన ఆయుధం. దానిని వినియోగించగల బ్రహ్మాండమైన కళాస్రష్ట మనలో ఇంకా బయిలుదేరలేదు. ప్రస్తుతం ఆది చిటికెన వేలంతటి మనుషుల చేతిలోనే వున్నది. వారు కూడా దానిని తమ అల్ప ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారు. బిర్లా, టాటాలు 501 సబ్బును, సిమ్మెంటు బస్తాలను ఉత్పత్తి చేస్తున్నట్లుగానే మన ప్రొడ్యూసర్లు ఈనాడు చిత్ర నిర్మాణం చేస్తున్నారు.
అసలు ఉత్తమ చిత్రాలు నిర్మిస్తే మన ప్రజలు చూడరని చెప్పడం కూడా మన ప్రొడ్యూసర్లకు పరిపాటి అయింది. ఇది ఎంత అసందర్భంగా ఉన్నదో చెబుతాను వినండి. ఆహారాన్ని విక్రయించడం ఒక వ్యాపారంగా నడపడం 20 వ శతాబ్దంలోనే ప్రారంభమయింది. ప్రతివాడూ తిండికోసం హోటలుకు వెళ్ళాలి. అతడికి ప్రతీసారీ ఆహారం ( మంచిది ) లభించకపోవచ్చు. అయినా రోజూ హోటలుకు వెళ్లక తప్పదు.
ఆహారం వలెనే ఈనాడు మానవునికి సినిమాకూడా ఒక అవసరం. అందువల్ల ఏ చిత్రం వచ్చినా ప్రేక్షకుడు చూస్తున్నాడు. కానీ కంపుకొట్టే వేరుశనగ నూనెతో చేసే వంటకాలను కాని ప్రజలు ముట్టరని, వాటికి వారు అలవాటు పడ్డారని యజమాని చెబితే ఎంత అసందర్భంగా ఉంటుందో ఉత్తమ చిత్రాలను నిర్మిస్తే ప్రజలు చూడరని చెప్పడం కూడా అలాగే వున్నది.
నాటకానుభవంలేని కవులు సినిమా రచయితలుగా వస్తే, యతిప్రాసలు రానివారు కవిత్వం చెప్పడానికి పూనుకున్నట్లే ఉంటుంది. సినిమా రచయితలకు నాటకానుభవం ఉండి తీరాలి. శ్రీ పింగళి నాగేంద్రరావుగారికి అట్టి అనుభవం వున్నందువల్లే " పాతాళభైరవి '' వంటి కాకమ్మ పిచికమ్మ కథలో అంత ' డ్రమెటిక్ ఎఫెక్ట్ ' తీసుకురాగలిగారు.
సాధ్యమైనంత ఎక్కువ యాక్షన్ తోనూ, సాధ్యమైనన్ని తక్కువ సంభాషణలతోనూ నిర్మించినపుడు చిత్రం ఉత్తమంగా వుంటుంది. అందుకు సహాయభూతం కాగల నాటకానుభవం వున్న రచయిత తప్పకుండా దర్శక పదవిని ఆక్రమించవచ్చు. డైరెక్టర్ అంటే ' స్టార్ట్ ' ' కట్ ' అని కేకలు వేసేవాడు మాత్రం కాదు.
ఏమైనా ఏ ప్రజలకు తగిన ప్రభుత్వం ఆ ప్రజలకు లభించినట్లుగానే, ఆయా ప్రజల అభిరుచులను బట్టి ఆయా సినిమాల స్థాయి కూడా వుంటుంది.
Vol. No. 02 Pub. No. 089
Saturday, December 18, 2010
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
No comments:
Post a Comment