Showing posts with label దేశభక్తి గేయాలు. Show all posts
Showing posts with label దేశభక్తి గేయాలు. Show all posts

Sunday, January 24, 2021

జయదేవకవి... అదిగో మన జెండా... గతకాలము మేలు.... ఇంకా చాలా...

 * ఈ రూపకంలో రాధ అష్టపదులను నేను పాడగా, శ్రీకృష్ణుని  పాటలను కీ.శే. రామకృష్ణ చందేశ్రీ, సూత్రధారిగా కీ.శే. శ్రీ జగదీశ్ సింగ్ ఠాకూర్, సఖియలుగా శ్రీమతులు సురేఖా కోర్డే, జయశ్రీ తట్టే, కుసుమ్ బడోద్కర్ ఆలపించారు. దీనికి సంగీతాన్ని సమకూర్చింది నేను ( అసిస్టెంట్ ప్రొడ్యూసర్/సంగీత రచన ),  కీ. శే.  బిరాజ్ భూషణ్ బసు, శ్రీ రామకృష్ణ చందెశ్రీ. ఈ సంగీత రూపకాన్ని గురించి అన్ని ఇంగ్లీష్ వార్తా పత్రికలూ ఎంతో కొనియాడాయి. దీని విజయం తరువాత, ఏటా జరిగే కాళిదాస్ మహా సమారోహ్ లో కూడా ఇది ఆకాశవాణి కళాకారులచే మళ్ళీ ప్రదర్శించబడింది.... ‘ వాగ్గేయకారులు ’ శీర్షికన “ జయదేవకవి ”

 

* భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో.....

మనభారతజాతికి నీతికి

ప్రతీకగా నిలిచినజెండా !

మనధ్యానం మనప్రాణం

మనసర్వం ఈ జెండా ! .... ‘ బాలభారతం ’ నుంచి " అదిగో మన జెండా "

 

* అప్పట్లో ఎంత బాగుండేది !! పిల్లలు తమిద్దర్ని వాళ్ళ దగ్గర కి పిలిపించుకుని విదేశాల్లో వింతలన్ని చూపించి పంపారు ఆ విశేషాలు అన్నీ తను టీ కొట్టు వద్ద, జిలేబీ సెంటర్ వద్ద, పునుకుల బండి వద్ద ఎక్కడ పడితే అక్కడ తన కాలనీ ఫ్రెండ్స్ తో చెబుతుంటే వాళ్ల ముఖాల్లో మెరుపులు, అవీ చూసి తాను కొనిచ్చిన జిలేబీ లూ బజ్జీలు తింటూ ఆనందించే వారితో ఎంత హాయిగా ఉండేది .. అలాంటి జీవితం లో ఒక్కసారిగా ఈ మార్పు...

... " గతకాలము మేలు " ఇంకా చాలా ... ఈ క్రింది లింక్ లో.....

 శిరాకదంబం10_011 

Visit web magazine at https://sirakadambam.com/

Vol. No. 12 Pub. No. 010

Friday, August 12, 2011

జెండా ఎత్తర...



 జెండా ఎత్తర - జాతికి ముక్తిర 
నిండగు శక్తిర - నిల్పర కీర్తిర 
                - జెండా ఎత్తర...

దండిగ వైరులు - గుండులు ప్రేల్చిన 
చెండుచు, నెత్తురు - కండలు రాల్చిన
                          - జెండా ఎత్తర...
 
ప్రాణముండే, యభి - మానముండే, మన 
 ప్రాణములైనన్ - బలియొసంగి, మన... 

జెండా ఎత్తర ! జాతికి ముక్తిర  !!

-  గురజాడ 



 స్వాతంత్ర్యం సాధించగానే సరిపోలేదు. దేశంలో కోటానుకోట్లమంది అష్టకష్టాల్ని అనుభవిస్తున్నారు. అన్నవస్త్రాలు కరువై, రోగబాదితులై ఆక్రందనలు చేస్తున్నారు. ఈ దుర్భర పరిస్థితుల్ని నిర్మూలించాలంటే మనం క్షుద్రవిద్వేషాల్ని పరిత్యజించి, ప్రజల ఉత్సాహాన్ని ఉపయుక్త మార్గంలో నడిపించాలి 
  - బాబూ రాజేంద్రప్రసాద్ 



Vol. No. 02 Pub. No. 317

Thursday, August 11, 2011

కన్నతల్లి సేవ


మముగన్న భారతమాత మందిరమున 
దివ్వెలై మన ముందామా
దివ్వెలై మన ముందామా 

పరమ పావని తల్లి పాదపూజల వాడు 
పువ్వులై మన ముందామా
పువ్వులై మన ముందామా

భారతీదేవి విపంచిక రవళించు
తంత్రులై మన ముందామా 
తంత్రులై మన ముందామా 

జన్మభూమి శౌర్య సౌరభ్యములు చల్లు 
గీతలై మన ముందామా
గీతలై మన ముందామా

కదన వీరుల చేతి ఖడ్గధారలలోని 
మెఱుపులై మన ముందామా
మెఱుపులై మన ముందామా

- ' కవికోకిల ' దువ్వూరి రామిరెడ్డి



ఎంత ఆశ్చర్యం.... ఎంత అద్భుతం.... యుద్ధం లేకుండా స్వతంత్ర్యమా ? భేష్... భారతవీరుల్లారా శభాష్...!! సర్వ ప్రపంచానికీ మీ చరిత మార్గదర్శకం !!!
- చైనా

Vol. No. 02 Pub. No. 314

Friday, August 13, 2010

పదండి ముందుకు



రాజకీయ చైతన్యం పుష్కలంగా వున్న నటుడు జగ్గయ్య 1962 లో ' పదండి ముందుకు ' అనే చిత్రాన్ని నిర్మించారు.



ఆ చిత్రానికి ఆయనే సంభాషణలు సమకూర్చగా విక్టరీ మధుసూదనరావు దర్శకత్వం వహించారు.
స్వాతంత్ర్య సమరం, గాంధీ మహాత్ముని సత్యాగ్రహాలు, భగత్ సింగ్ లాంటి వీరుల త్యాగాలు ఈ చిత్ర నిర్మాణానికి ప్రేరణ.

 అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా మన రాష్ట్రంలోనే తొలిసారి సబ్సిడీ అందుకున్న చిత్రంగా ' పదండి ముందుకు ' ను చెబుతారు.

ఈ చిత్రం ఆర్థికంగా విజయం సాధించకపోయినా జగ్గయ్య కృంగిపోలేదు.

" నా మనస్సు వ్యాపారపరమైంది కాదు. సాంఘిక బాధ్యతలెరిగిన వ్యక్తిని. రాజకీయవాదిగా నాకో ఇమేజ్ వుంది. ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా చిత్ర నిర్మాణంలో రాజీ పడడానికి నా మనసొప్పదు " అనేవారాయన.

హీరో కృష్ణ తొలిసారి తెర మీద కనిపించిన చిత్రం కూడా ఇదే !

పదండి ముందుకు చిత్రంలో మహాకవి శ్రీశ్రీ రాసిన దేశభక్తిని ప్రభోదించే టైటిల్ పాటను ఘంటసాల వెంకటేశ్వరరావు , బి. వసంత ఆలపించగా ఎస్.పి. కోదందపాణి స్వరపరిచారు. ఆ పాట అందరి కోసం........



Vol. No. 01 Pub. No. 373
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం