Showing posts with label క్విజ్. Show all posts
Showing posts with label క్విజ్. Show all posts

Wednesday, November 2, 2011

పూర్వాశ్రమంలో...... ? - జవాబు

  కనుక్కోండి చూద్దాం - 56_జవాబు 

అ ) ప్రముఖ నటులు కృష్ణంరాజు గారు ' చిలకా గోరింక '  చిత్రంతో చిత్రసీమలో ప్రవేశించారని తెలుసు కదా ! దానికి ముందు ఆయన ఏం చేసేవారో చెప్పగలరా ?

జవాబు కృష్ణంరాజు ' ఆంధ్ర రత్న ' పేరుతో ఒక పత్రికను నడిపారు.

ఆ ) మరో నటుడు భానుచందర్ పూర్తి పేరు మాదూరి వెంకట సత్య సుబ్రహ్మణ్యేశ్వర భానుప్రసాద్. ఆయన సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో చెప్పగలరా ?

జవాబు )  మద్రాస్ ( చెన్నై ) దూరదర్శన్ కేంద్రంలో అనౌన్సుర్ గా పనిచేసారు. 

Vol. No. 03 Pub. No. 068a

Saturday, October 29, 2011

పూర్వాశ్రమంలో...... ?

  కనుక్కోండి చూద్దాం - 56  

అ ) ప్రముఖ నటులు కృష్ణంరాజు గారు ' చిలకా గోరింక '  చిత్రంతో చిత్రసీమలో ప్రవేశించారని తెలుసు కదా ! దానికి ముందు ఆయన ఏం చేసేవారో చెప్పగలరా ?

ఆ ) మరో నటుడు భానుచందర్ పూర్తి పేరు మాదూరి వెంకట సత్య సుబ్రహ్మణ్యేశ్వర భానుప్రసాద్. ఆయన సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో చెప్పగలరా ?

Vol. No. 03 Pub. No. 065

Saturday, October 15, 2011

పేర్ల తికమక... ? - జవాబులు

  కనుక్కోండి చూద్దాం - 55_ జవాబులు  

1939  లో వాహినీ వారు నిర్మించిన ' వందేమాతరం ' చిత్రంలో ప్రధాన కథాంశం నిజానికి స్వాతంత్ర్యోద్యమం కాదు. నిరుద్యోగ సమస్య.  అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఆ పేరు చూసి నిషేదిస్తుందేమోననే సందేహంతో ఇంకో పేరు కూడా పెట్టారు. అసలు పేరు ' వందేమాతరం ' క్రిందనే చిన్న అక్షరాలలో ఉపశీర్షికగా ఆ పేరు వేసేవారు.
రాజకీయవేత్తగా, కొన్ని రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా పని చేసిన ఒకప్పటి కథానాయకుడు, నిర్మాత, దర్శకుడు 1944 లో ప్రారంభించిన ఒక చిత్రానికి అదే పేరు పెట్టారు. అంతే కాదు ఆ చిత్రానికి మొదట వేరే పేరు ప్రకటించి, ప్రొడక్షన్ దశలోనే ఇంకో పేరు మార్చి, చివరికి అది పూర్తయి విడుదల చేసే ముందు ఈ పేరు ఖరారు చేసారు.

అ ) 1939 లో ఉపశీర్షికగా, 1946 లో ప్రథాన శీర్షికగా వచ్చిన ఆ పేరు ఏమిటి ? 
జవాబు : మంగళసూత్రం  

ఆ ) 1946  లో వచ్చిన చిత్రం మొదటి రెండు పేర్లు ఏమిటి ? 
 జవాబు : మొదటి పేరు ' ఇది మా కథ ', తర్వాత పేరు ' మనమిద్దరం '  

ఇ ) 1946 లో వచ్చిన ఆ కథానాయకుడు, నిర్మాత, గవర్నర్ ఎవరు ? 
జవాబు : కోన ప్రభాకరరావు - ఈయన రాజకీయాలలో అనేక పదవులనలంకరించడంతో బాటు పుదుచ్చేరి, సిక్కిం, మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేసారు.   
 
దేవికగారు దాదాపుగా అంతా సరిగానే చెప్పారు. ముఖ్యంగా ఆవిడ పరిజ్ఞానానికి ధన్యవాదాలు. మీరు చెప్పినట్లు ' మంగళసూత్రం ' చిత్రం విడుదలైంది 1946  లోనే ! కాకపోతే ఆ చిత్రనిర్మాణ సన్నాహాలు ప్రభాకరరావు గారు 1944  లో ప్రారంభించారు. ఆ విషయమే వివరణలో ఇచ్చినా ప్రశ్నలలో మార్చకపోవడం పొరబాటు అయింది. జవాబులో సవరించాను. మీ సవరణకు ధన్యవాదాలు. 
 
రమణారావు గారు చెప్పినట్లు ప్రభాకరరావు గారు 1948  లో వచ్చిన ' ద్రోహి ' చిత్రంలో విలన్ గా నటించారు. అంతేకాదు.. 1951  లో విడుదలయిన ' రూపవతి ' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. రమణారావు గారికి కూడా ధన్యవాదాలు.

Vol. No. 03 Pub. No. 057a

Friday, October 14, 2011

పేర్ల తికమక... ?

  కనుక్కోండి చూద్దాం - 55  

1939  లో వాహినీ వారు నిర్మించిన ' వందేమాతరం ' చిత్రంలో ప్రధాన కథాంశం నిజానికి స్వాతంత్ర్యోద్యమం కాదు. నిరుద్యోగ సమస్య.  అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఆ పేరు చూసి నిషేదిస్తుందేమోననే సందేహంతో ఇంకో పేరు కూడా పెట్టారు. అసలు పేరు ' వందేమాతరం ' క్రిందనే చిన్న అక్షరాలలో ఉపశీర్షికగా ఆ పేరు వేసేవారు.

రాజకీయవేత్తగా, కొన్ని రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా పని చేసిన ఒకప్పటి కథానాయకుడు, నిర్మాత, దర్శకుడు 1944 లో నిర్మించిన ఒక చిత్రానికి అదే పేరు పెట్టారు. అంతే కాదు ఆ చిత్రానికి మొదట వేరే పేరు ప్రకటించి, ప్రొడక్షన్ దశలోనే ఇంకో పేరు మార్చి, చివరికి అది పూర్తయి విడుదల చేసే ముందు ఈ పేరు ఖరారు చేసారు.

అ ) 1939 లో ఉపశీర్షికగా, 1944 లో ప్రథాన శీర్షికగా వచ్చిన ఆ పేరు ఏమిటి ? 
ఆ ) 1944  లో వచ్చిన చిత్రం మొదటి రెండు పేర్లు ఏమిటి ? 
ఇ ) 1944 లో వచ్చిన ఆ కథానాయకుడు, నిర్మాత, గవర్నర్ ఎవరు ?

Vol. No. 03 Pub. No. 057

Tuesday, October 11, 2011

భ్రమర కీట న్యాయం .. ? - జవాబు

  కనుక్కోండి చూద్దాం - 54 _జవాబు 

సంస్కృతంలో వాడుకలో వున్న ఈ భ్రమర కీట న్యాయం అనేదాన్ని మనం కూడా వాడుతూ వుంటాం.

ప్రశ్న :  దీని అర్థమేమిటో, ఏ సందర్భంలో వాడుతామో చెప్పగలరా ?  
 
జవాబుభ్రమరం అంటే తుమ్మెద. కీటం అంటే పురుగు. 
పురుగు చుట్టూ తుమ్మెద తిరుగుతుంది. కొంతకాలానికి ఆ పురుగే తుమ్మెదగా మారుతుంది. 
అయితే కనబడిన ప్రతి పురుగు చుట్టూ తుమ్మెద తిరగదు. అలాగే తుమ్మెద తిరిగిన ప్రతీ పురుగు తుమ్మెదగా మారదు. 
తుమ్మెద ఎలా అయితే తనక్కావాల్సిన పురుగును వెదుక్కుని దాని చుట్టూ పరిభ్రమించి తనలాగే మార్చేస్తుందో అలాగే మనం కూడా మనక్కావలసిన వ్యక్తిని ఎంచుకుని విద్యాబుద్ధులు లాంటివి చెప్పించి మనంతటి వాడిని చెయ్యాలని ప్రయత్నిస్తాం. 
దీనినే భ్రమర కీట న్యాయం అన్నారు పెద్దలు. తండ్రి కొడుకుల సంబంధం, గురుశిష్య సంబంధం ఇలాంటివే ! 
 
స్పందన : ముందుగా వెంటనే స్పందించిన జ్యోతి గారికి ధన్యవాదాలు. దాదాపుగా సరైన వివరణ ఇచ్చిన పందిళ్ళ శేఖర్ బాబు గారికి కూడా ధన్యవాదాలు.
 
Vol. No. 03 Pub. No. 051a

Wednesday, October 5, 2011

భ్రమర కీట న్యాయం .. ?

  కనుక్కోండి చూద్దాం - 54 

సంస్కృతంలో వాడుకలో వున్న ఈ భ్రమర కీట న్యాయం అనేదాన్ని మనం కూడా వాడుతూ వుంటాం.

ప్రశ్న :  దీని అర్థమేమిటో, ఏ సందర్భంలో వాడుతామో చెప్పగలరా ? 

 Vol. No. 03 Pub. No. 051

Thursday, September 22, 2011

పేర్లు చెప్పరా ?- జవాబు

  కనుక్కోండి చూద్దాం - 53_ జవాబు 

అసలు పేర్లు                                                                   తెర పేర్లు
1. ప్రమీల                                                    -    దేవిక
2 . వసుంధరాదేవి                                          -    వసుంధరాదేవి
3 . ఉదయచంద్రిక                                          -     రాధ
4 . ఉష                                                      -     దివ్యవాణి
5 . శ్రీలత                                                    -     రోజా
6 . విజయలక్ష్మి                                            -     రంభ
ఇవన్నీ ఒకప్పటి తెలుగు చిత్ర కథానాయికల అసలు పేర్లు. 
వీరి తెర పేర్లు ఏమిటో వరుసలో చెప్పగలరా ?
 
దేవిక గారు రెండు తప్ప మిగిలిన పేర్లు చెబితే ప్రసీద గారు అదనంగా మరో పేరు చెప్పారు. వారిద్దరికీ ధన్యవాదాలు.
 
Vol. No. 03 Pub. No. 036a

Saturday, September 17, 2011

పేర్లు చెప్పరా ?

  కనుక్కోండి చూద్దాం - 53 

1. ప్రమీల 
2 . వసుంధరాదేవి
3 . ఉదయచంద్రిక 
4 . ఉష 
5 . శ్రీలత 
6 . విజయలక్ష్మి 

ఇవన్నీ ఒకప్పటి తెలుగు చిత్ర కథానాయికల అసలు పేర్లు. 
వీరి తెర పేర్లు ఏమిటో వరుసలో చెప్పగలరా ?

Vol. No. 03 Pub. No. 036

Saturday, September 10, 2011

ఇద్దరు ప్రముఖ రచయిత్రులు...?- జవాబు

   కనుక్కోండి చూద్దాం - 52 _ జవాబు 

  ఈ ప్రక్కఫోటోలో కనిపిస్తున్నది ఇద్దరు ప్రముఖ రచయిత్రులు. పాత ఫోటో కావడం, అంత స్పష్టంగా లేకపోవడం వలన సులభంగా గుర్తుపట్టడానికి ఒక క్లూ..... వీళ్ళిద్దరూ అక్కచెల్లెళ్ళు. 
 ప్రశ్న : ఇద్దరు రచయిత్రుల పేర్లు చెప్పగలరా ?  
 
జవాబు : ఒకరు ( కుడిప్రక్క ) రచయిత్రి శ్రీమతి గోవిందరాజు సీతాదేవి గారు, ఇంకొకరు కొంతకాలం పాటు ఆంధ్ర పాఠకలోకాన్ని  ఉర్రూతలూగించిన రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి. 

Vol. No. 03 Pub. No. 024a

Tuesday, September 6, 2011

ఇద్దరు ప్రముఖ రచయిత్రులు...?

  కనుక్కోండి చూద్దాం - 52 

  ఈ ప్రక్కఫోటోలో కనిపిస్తున్నది ఇద్దరు ప్రముఖ రచయిత్రులు. పాత ఫోటో కావడం, అంత స్పష్టంగా లేకపోవడం వలన సులభంగా గుర్తుపట్టడానికి ఒక క్లూ..... వీళ్ళిద్దరూ అక్కచెల్లెళ్ళు. 

 ప్రశ్న : ఇద్దరు రచయిత్రుల పేర్లు చెప్పగలరా ?  

Vol. No. 03 Pub. No. 026

హైదరాబాద్ లో మొదటి నిర్మాత.. ? - జవాబు

 కనుక్కోండి చూద్దాం - 51_జవాబు  

అ ) హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి చలనచిత్ర నిర్మాత ఎవరు ?

జవాబు : ధీరేంద్రనాథ్ గంగూలీ

ఆ ) ఆయన ప్రధానంగా ఏ భాషలో చిత్రాలు నిర్మించారు ?

జవాబు : బెంగాలి, హిందీ

ధీరేంద్రనాథ్ గంగూలీ శాంతినికేతన్ విద్యార్ధి. ఆయన నటుడు, దర్శకుడు, నిర్మాత. బెంగాలీలో చిత్రాలు నిర్మించారు. 1921 నుంచీ ఆయన చిత్రాల్లో నటించారు. దాదాసాహెబ్ పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్ నైజాం స్టేట్ ఆర్ట్ స్కూల్లో ప్రథానోపాధ్యాయునిగా పనిచేసారు. నిజం సహకారంతో లోటస్ ఫిలిం కంపెనీ నెలకొల్పి బిమాత, చింతామణి లాంటి చిత్రాలు  నిర్మించారు. ఆ పేరుతోనే ఒక స్టూడియో, రెండు థియేటర్లు స్థాపించారు.

1924 లో ధీరేంద్ర రజియా బేగం చిత్రం పంపిణీ చెయ్యడం నిజాం నవాబుకు ఆగ్రహం తెప్పించింది. ఫలితంగా ఆయన హైదరాబాద్ ను వదలి వెళ్ళాల్సివచ్చింది. కలకత్తా చేరుకున్నాక ఆయన చాలా చిత్రాలు రూపొందించారు. పద్మభూషణ్ తో బాటు అనేక పురస్కారాలు అందుకున్నారు.

Vol. No. 03 Pub. No. 011a

Thursday, August 25, 2011

హైదరాబాద్ లో మొదటి నిర్మాత.. ?

 కనుక్కోండి చూద్దాం - 51  

అ ) హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి చలనచిత్ర నిర్మాత ఎవరు ?

ఆ ) ఆయన ప్రధానంగా ఏ భాషలో చిత్రాలు నిర్మించారు ? 

Vol. No. 03 Pub. No. 011

Wednesday, August 17, 2011

నటుడు, సాంకేతిక నిపుణుడు....? - జవాబు

 కనుక్కోండి చూద్దాం - 50_జవాబు  

మొదట రంగస్థలం మీద నటించి
సినిమాల్లో ప్రవేశించి కొన్ని చిత్రాల్లో నటించి
తర్వాత సాంకేతిక రంగంలో అడుగుపెట్టి
ఆ శాఖలో తెలుగు చిత్ర రంగంలో
తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న
ఈ ప్రక్క ఫోటోలోని ప్రముఖుడెవరు ?

 ఎమ్మిగనూరులో నాలుగో తరగతి చదివే రోజుల్లో ' భక్తప్రహ్లాద ' నాటకంలో వేషంతో ప్రారంభించి ఎన్టీయార్, ముక్కామల, జగ్గయ్య లాంటి వారితో కలసి నాటకాలలో నటించిన వల్లభజోస్యుల శివరాం భక్తపోతన చిత్రంలో స్త్రీ వేషం ధరించారు. తర్వాత వాహినీ స్టూడియోలో శబ్దగ్రహకుడుగా చేరారు. తర్వాత కూడా గుణసుందరి కథ, షావుకారు, రంగులరాట్నం లాంటి చిత్రాలలో నటిస్తూనే సౌండ్ ఇంజనీర్ వి. శివరాం గా ప్రసిద్దులై ఎన్నో చిత్రాలకు శబ్దగ్రహణం చేసారు. 

ఆత్రేయ గారు పొరబడినా, దేవిక గారు సరిగానే గుర్తించారు. ఇద్దరికీ అభినందనలు... ధన్యవాదాలు. చివరి నిముషంలో నమ్మకం గా సరైన జవాబిచ్చిన శ్రీ సుబ్బారావు గారికి కూడా ధన్యవాదాలు. 

Vol. No. 03 Pub. No. 003a

Tuesday, August 16, 2011

నటుడు, సాంకేతిక నిపుణుడు....?

 కనుక్కోండి చూద్దాం - 50  

మొదట రంగస్థలం మీద నటించి
సినిమాల్లో ప్రవేశించి కొన్ని చిత్రాల్లో నటించి
తర్వాత సాంకేతిక రంగంలో అడుగుపెట్టి
ఆ శాఖలో తెలుగు చిత్ర రంగంలో
తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న
ఈ ప్రక్క ఫోటోలోని ప్రముఖుడెవరు ?

Vol. No. 03 Pub. No. 003

Monday, August 8, 2011

స్నేహబంధమూ... పాట ? - జవాబు

 కనుక్కోండి చూద్దాం - 49_జవాబు 

స్నేహబంధమూ ఎంత మధురమూ ! 

నిన్న స్నేహదినోత్సవం సందర్భంగా ప్రచురించిన టపాలో ఉపయోగించిన ఈ పాట గురించి....

అ ) ఈ పాట ఏ చిత్రంలోనిది ? 

జవాబు : స్నేహబంధం ( 1973 )

ఆ ) ఈ పాట పాడిన గాయనీ గాయకులెవరు ? 

జవాబు : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, జి. ఆనంద్ 

జ్యోతి గారు చిత్రం పేరు, క్లూ చక్కగా అందుకని గాయనీగాయకుల పేర్లు కూడా సరిగానే చెప్పారు. ఆవిడకు  ధన్యవాదాలు. 

Vol. No. 02 Pub. No. 308a

స్నేహబంధమూ... పాట ?

 కనుక్కోండి చూద్దాం - 49  

స్నేహబంధమూ ఎంత మధురమూ !

నిన్న స్నేహదినోత్సవం సందర్భంగా ప్రచురించిన టపాలో ఉపయోగించిన ఈ పాట గురించి....

అ ) ఈ పాట ఏ చిత్రంలోనిది ?

ఆ ) ఈ పాట పాడిన గాయనీ గాయకులెవరు ?

Vol. No. 02 Pub. No. 308

Friday, July 29, 2011

కవి గవర్నర్

కనుక్కోండి చూద్దాం - 48

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖ కవి డా. సి. నారాయణరెడ్డి గారు కొంతకాలం రాజ్యసభ సభ్యులుగా పనిచేశారని మనందరికీ తెలుసు. కానీ ఆయన ఒక సినిమాలో గవర్నర్ గా నటించారు.

ప్రశ్న : ఆ సినిమా పేరేమిటో చెప్పగలరా ?

Vol. No. 02 Pub. No. 295

Tuesday, July 26, 2011

అయిదుగురు సంగీత దర్శకులు - జవాబు

కనుక్కోండి చూద్దాం - 47 _ జవాబులు

చాలా చిత్రాలకు జంట సంగీత దర్శకులు పనిచెయ్యడం, కొన్ని జంటలు ప్రజాదరణ పొందడం మనకి తెలుసు. హిందీలో శంకర జైకిషన్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఇలా ...... దక్షిణాదిన విశ్వనాథన్ రామమూర్తి, రాజన్ నాగేంద్ర, తర్వాత కొంతకాలం రాజ్ కోటి, కృష్ణ చక్ర ఇలా ..... కొన్ని జంటలు ప్రాముఖ్యం చెందాయి. అద్భుతమైన సంగీతాన్ని ప్రేక్షకశ్రోతలకు పంచాయి.

ఇటీవలి కాలంలో తక్కువ సమయంలో చిత్ర నిర్మాణం పూర్తి చేసి రికార్డు సృష్టించాలనో, మరే ఇతర కారణం చేతనో గానీ ఒకే చిత్రానికి నలుగురయిదుగురు దర్శకులు, సంగీత దర్శకుల చేత అక్కడక్కడా పనిచేయిస్తున్నారు గానీ, నిదానంగా అన్ని పనులకు తగినంత సమయం కేటాయించగలిగే కాలంలో ఒకే చిత్రానికి అయిదుగురు సంగీత దర్శకులు పనిచెయ్యడం అనే సంఘటన బహు అరుదు.

అలాంటి సంఘటన గతంలో ఒక తెలుగు చిత్రానికి జరిగింది. ఆ చిత్రం ఇటీవలే షష్టిపూర్తి చేసుకుంది.

) చిత్రం పేరేమిటి ?

జవాబు : వాలి సుగ్రీవ ( 1950 )

) చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన అయిదుగురు సంగీత దర్శకులు ఎవరు ?

జవాబు : గాలి పెంచల నరసింహరావు, యస్. రాజేశ్వరరావు, ఘంటసాల, పెండ్యాల, మాస్టర్ వేణు

అజ్ఞాత గారు, రాజీవ యామిజాల గారు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేసారు. కానీ చిత్రం పాతాళ భైరవి కాదండీ ! అలాగే అజ్ఞాత గారు చెప్పిన వారిలో ఘంటసాల గారు మాత్రమే ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. అయితే పాతాళభైరవితో బాటు వాలి సుగ్రీవ కూడా 1950 లో విడుదల అవడం వలన రెండు చిత్రాలూ షష్టిపూర్తి చేసుకున్నాయి.

ఈ ప్రశ్నలకు నూటికి నూరు శాతం సరైన సమాధానం చెప్పిన వారు దేవిక సాయి గణేష్ పురాణం గారు. వారికీ, రాజీవ గారికి, అజ్ఞాత గారికి ( మీరు పేరు రాసి వుంటే బాగుండేది ) ధన్యవాదాలు.

Vol. No. 02 Pub. No. 287

Sunday, July 24, 2011

అయిదుగురు సంగీత దర్శకులు

కనుక్కోండి చూద్దాం - 47

చాలా చిత్రాలకు జంట సంగీత దర్శకులు పనిచెయ్యడం, కొన్ని జంటలు ప్రజాదరణ పొందడం మనకి తెలుసు. హిందీలో శంకర జైకిషన్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఇలా ...... దక్షిణాదిన విశ్వనాథన్ రామమూర్తి, రాజన్ నాగేంద్ర, తర్వాత కొంతకాలం రాజ్ కోటి, కృష్ణ చక్ర ఇలా ..... కొన్ని జంటలు ప్రాముఖ్యం చెందాయి. అద్భుతమైన సంగీతాన్ని ప్రేక్షకశ్రోతలకు పంచాయి.

ఇటీవలి కాలంలో తక్కువ సమయంలో చిత్ర నిర్మాణం పూర్తి చేసి రికార్డు సృష్టించాలనో, మరే ఇతర కారణం చేతనో గానీ ఒకే చిత్రానికి నలుగురయిదుగురు దర్శకులు, సంగీత దర్శకుల చేత అక్కడక్కడా పనిచేయిస్తున్నారు గానీ, నిదానంగా అన్ని పనులకు తగినంత సమయం కేటాయించగలిగే కాలంలో ఒకే చిత్రానికి అయిదుగురు సంగీత దర్శకులు పనిచెయ్యడం అనే సంఘటన బహు అరుదు.

అలాంటి సంఘటన గతంలో ఒక తెలుగు చిత్రానికి జరిగింది. ఆ చిత్రం ఇటీవలే షష్టిపూర్తి చేసుకుంది.

) చిత్రం పేరేమిటి ?

) చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన అయిదుగురు సంగీత దర్శకులు ఎవరు ?

Vol. No. 02 Pub. No. 287

Tuesday, July 19, 2011

గుర్తుపట్టగలరా ? - జవాబు

కనుక్కోండి చూద్దాం - 46 - జవాబు 

అ) ఈ ఫోటోలో వున్నది ఎవరో గుర్తుపట్టగలరా?
జవాబు : అర్జా జనార్ధనరావు

ఆ ) ఈయనకో ప్రత్యేకత కూడా వుంది. అది ఏమిటో చెప్పగలరా ?
జవాబు : అప్పట్లో ప్రఖ్యాతి చెందిన అథ్లెట్ ( వెయిట్ లిఫ్టర్ )
మూడే మూడు నిముషాల్లో స్పందించి సమాధానమిచ్చిన జ్యోతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆ సమాధానానికి స్పందించిన సుజాత గారికి కూడా ధన్యవాదాలు. జ్యోతి  గారు చెప్పినట్లు అర్జా గారి పేరు చెప్పగానే ఎవరికైనా ఆంజనేయస్వామి గుర్తుకోస్తాడు. కానీ ఆయనలోని అసలైన ప్రత్యేకత ఏమిటో తెలియజేసిన మిత్రులు దర్పణం సుబ్బారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
  Vol. No. 02 Pub. No. 282a
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం