Wednesday, September 16, 2020

ఇది వరమా ! శాపమా !!... కందుకూరి రామభద్రకవి – కొండోజీ అనుబంధం... అరికాళ్ళ మంటలు... ఇంకా చాలా....

 *

శ్రీకృష్ణుడు నాడు చెప్పేదాకా అంచల పొందిన వరం గురించి వసుసేనునికి తెలియదు. వసుసేనుడు నిలువునా దిగ్భ్రాంతుడయ్యాడు. అసంకల్పితంగా అతని కంటి వెంట కన్నీరు కారుతూనే ఉంది. అంచల తన దగ్గిర దాచిన రహస్యం గురించి తెలిసి వసుసేనుడు నివ్వెరపోయాడు, నిలువునా నీరయ్యాడు. ----- " ఇది వరమా ! శాపమా !! "

*

"మీకు సార్వభౌముల దర్శనం లభించడానికి, నాకు చేతనైనంత సాయం చేస్తాను."

ఈ చిన్న మాట కందుకూరి రుద్రకవి కన్నులను ఆనందాశ్రువులతో నింపింది.  

----- “ కందుకూరి రామభద్రకవి – కొండోజీ అనుబంధం ” 

సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి అభ్యుదయ భావాలను, వితంతు పునర్వివాహాన్నీ ఈ కథలో సమర్థిస్తారు శ్రీపాద వారు. అర్థరాత్రి ఇల్లు విడిచిపెట్టిన రుక్కమ్మ ఒక జట్కా బండి మనిషి సాయంతో వీరేశలింగం పంతులుగారి తోటకు వెళ్తుంది. ఆ నరకంలోంచి ( పుట్టింటి నుంచి ) బయటపడడం తప్ప వేరే మార్గం లేదనుకుని ధైర్యం చేసిన బాల వితంతువు దయనీయ గాథ ఇది. ----- శ్రీపాద వారి " అరికాళ్ళ మంటలు " పరిచయం.

ఇంకా....ఈ క్రింది లింక్ లో...... 

శిరాకదంబం 10_003


Visit web magazine at https://sirakadambam.com/ 

 Vol. No. 12 Pub. No. 003

Friday, September 4, 2020

డొక్కా సీతమ్మ గారి నిత్యాన్నదాన వ్రతం... మా వూరు – అమలాపురం... సత్తిరాజు రామ్‌నారాయణ తో. లే. పి. .... ఇంకా... చాలా...

ఈయన జీవన విధానమే ఈయన రచనా శైలి. వృత్తి రీత్యా ఉపాధ్యాయులు ప్రవృత్తి వ్యవసాయ నేపథ్యం, జీవన శైలి రాయలసీమ గ్రామీణం." సత్కవుల్ హాలికులైన నేమి? ” అని ప్రశ్నించుకునే పోతన తత్వం. జీవన విధానంలో ఆర్ధిక పరమైన అంశాలకు తక్కువ ప్రాధాన్యం. రచయితగా ఏ రకమైన ఇజాలనీ, వ్యక్తిగా ఏరకమైన భేషజాలనీ సమర్ధించని వ్యక్తిత్వం. అన్ని ఇజాలకూ మూలం, వాటి సారం మానవత్వమే అని దృఢంగా విశ్వసించే నైజం. - " మధురాంతకం రాజారాం రచనలు "

 *   సత్తిరాజు వారి వంశ పెన్నిధి లో మూడు అనర్ఘరత్నాలు

ముగ్గురు అన్నదమ్ములు. 

లక్ష్మీనారాయణ గారు, శంకరనారాయణ గారు, రామ్‌నారాయణ గారు.

అయితే విశేషమేమంటే ఈ ముగ్గురికీ మారు పేర్లు, బ్రాండ్ నేమ్స్ కూడా ఉన్నాయి. అవేమిటంటే

లక్ష్మీనారాయణ గారు -- బాపు గారు

శంకర నారాయణ గారు - శంకర్ గారు 

రామ్‌నారాయణ గారు - రాంపండు గారు. ........ తో. లే. పి. " సత్తిరాజు రామ్‌నారాయణ ". 

*  చిన్నపిల్లల్ని సముదాయిస్తూ “ ఎంతమ్మా ! మనం సీతమ్మ గారి ఊరికి దగ్గరలోనికి వచ్చేసాం ! ఆ తల్లి మనకి వేడి వేడి పాలు అవీ ఇస్తుంది. అన్నపానాలు సమకూరుస్తుంది. మనం సేద తీరి వారింట ఈ రాత్రి విశ్రాంతి తీసుకొని మరునాడు ప్రొద్దున్నే వెళ్ళవచ్చు ”  అని అనుకుంటున్నారట. ఆ మాటలు ఆవిడ చెవిన పడగానే ఆవిడ ఈ సమయాన నేను ఇంటిన లేకపోతే వీరికి తగిన సదుపాయాలు ఎవరూ చేయరు, ఆ స్వామి దర్శనం మరెప్పుడైనా చేసుకోవచ్చునని తలంచి వెంటనే మేనాని గన్నవరానికి తిరిగి తీసుకు వెళ్ళమని చెప్పారట. అలాగే ఆమె వారికన్నా ముందుగానే ఇంటికి వచ్చి వారికి కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారట. అన్నార్తుల హృదయాలలో ఆ స్వామి ని దర్సించగలిగిన సాధ్వీమణి ఆమె".   - " డొక్కా సీతమ్మ గారి నిత్యాన్నదాన వ్రతం ".

 కాలువలనిండా నీరు బంగారంలా ప్రవహించి కాలువల గట్టున కొబ్బరిచెట్లు బంగారు హారానికి నగిషీలా అన్నట్టు, చెట్లమధ్య అమృత కలశాలైన కొబ్బరి కాయలు అమ్మ కడుపు పండి చంకలో తన సంతానాన్ని ఎత్తుకున్న చందాన మనకు గోచరిస్తుంది. అలాంటి  కోనసీమకు గుండెకాయ వంటి పట్టణం అమలాపురం. దీనికి "పాంచాలపురం " అని పేరు ఉండేదని ఒక ఐతిహ్యం ఉంది. కానీ చిందాడమడుగులో వెలసిన పార్వతీ సమేత అమలేశ్వర స్వామి నామం తో ఈ ఊరికి " అమలాపురం " అనే పేరు వచ్చిందని చెబుతారు. - " మా వూరు – అమలాపురం "

గమనిక : మీ ఊరి గురించిన విశేషాలు వ్రాసి, ఫోటోలతో సహా " మా వూరు " శీర్షికలో ప్రచురణ కోసం ఈ క్రింది మెయిల్ ఐడికి పంపవచ్చు.

editorsirakadambam@gmail.com / editor@sirakadambam.com  


  .....  ఇంకా..... ఈ క్రింది లింక్ లో............. 

శిరాకదంబం 10_002

Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 12 Pub. No. 002

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం