Showing posts with label e తెలుగు. Show all posts
Showing posts with label e తెలుగు. Show all posts

Thursday, August 26, 2021

దశ దిశోత్సవం... శిరాకదంబం పత్రిక ప్రత్యేక సంచిక

*

శిరాకదంబం ’ అంతర్జాల పత్రిక ప్రస్థానం లో దశాబ్ద కాలం పూర్తి అయింది. పదకొండవ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ ప్రయాణం సాఫీగా సాగడానికి తమవంతు సహకారాన్ని అందిస్తున్న రచయితలు, రచయిత్రులకు, చందాదారులకు, శ్రేయోభిలాషులకు, ప్రకటనదారులకు, ఇంకా అనేక రూపాల్లో ప్రోత్సాహాన్ని అందిస్తున్న .... అందరికీ కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటూ.... 🙏 🙏 🙏

' దశ దిశోత్సవం '  పేరిట పదవ వార్షికోత్సవ సంచిక ను భవిష్యత్తు మార్పులకు సూచికగా రెండు భాగాలుగా రూపొందించడం జరిగింది. అందులో ఒకటి మామూలు పద్దతిలోని అక్షర రూపంలో అయితే మరొకటి దృశ్య శ్రవణ ( AV ) రూపంలో వెలువడింది. 

ఇప్పటి వరకు ప్రతి నెల వెలువడుతున్న రెండు సంచికల్లో ఇకపైన ఒకటి అక్షర రూప సంచికగా, మరొకటి దృశ్య శ్రవణ సంచికగా వెలువడుతాయి. రచయితలు, పాఠకులు, ప్రకటన దారులు, శ్రేయోభిలాషులు గమనించ ప్రార్ధన. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అంశాలపై ప్రసంగాలు, కథా కవితా పఠనాలు, శాస్త్రీయ... లలిత... జానపద... వంటి పాటలు, పద్యాలు, ఏక పాత్రాభినయం, నాటిక, నృత్యం వంటి ప్రదర్శనా కళలు, చిత్రలేఖనం, చేతి వృత్తులు, వంటలు వంటి ఏ అంశం మీదనైనా దృశ్య ( వీడియో ) లేదా శ్రవణ ( ఆడియో ) మాధ్యమాల ద్వారా పంపించవచ్చు. వివరాలకు editorsirakadambam@gmail.com గాని, editor@sirakadambam.com గాని సంప్రదించవచ్చు. 

' దశ దిశోత్సవం ' ప్రత్యేక సంచిక..... ఈ క్రింది లింక్ లో..... 

శిరాకదంబం 11_001 

 

Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 13 Pub. No. 001


Sunday, December 11, 2011

తెలుగు బ్లాగుల దినోత్సవం

తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా బ్లాగ్మిత్రులందరికీ శుభాకాంక్షలు
 



e - తెలుగు ఆధ్వర్యంలో తెలుగు బ్లాగుల దినోత్సవ కార్యక్రమం - 

తెలుగు బ్లాగర్లకు, తెలుగు భాషాభిమానులకూ ఆహ్వానం 
ఈ నెల రెండవ ఆదివారం అనగా (డిసెంబర్ 11న) తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం మరియు తేనీటి విందుని e-తెలుగు ఏర్పాటు చేసింది. తెలుగు బ్లాగర్లందరూ దీనిలో పాల్గొని విజయవంతం చేయమని ప్రార్థన. వివరాలు … తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు!


 తెలుగు బ్లాగుల దినోత్సవం - డిసెంబర్ రెండవ ఆదివారం


సమయం:
ఆదివారం, డిసెంబర్ 11, 2011 మధ్యాహ్నం 3 గంటలకు వేదిక:
హనీపాట్ ఐటీ కన్సెల్టింగ్ ప్రాంగణం,
6-2-46, అడ్వొకేట్స్ కాలనీ,
ఏసీ గార్డ్స్, లకడీ-కా-పూల్,
హైదరాబాద్ - 500 004. (పటం)
సంప్రదింపులు:
93965 33666
ఇప్పటివరకూ బ్లాగ్ముఖంగా మాత్రమే పరిచయమున్న మిత్రులను కలిసే సదవకాశమిది. మీకున్న సాంకేతిక సమస్యలను నలుగురితో చర్చించి వాటికి పరిష్కారమూ పొందవచ్చు. పాల్గొన్నవారందరికీ ఈ సమావేశం నూతనోత్సాహాలను కలగజేస్తుందని ఆశిస్తున్నాం.
వచ్చే ఏడాదికి తెలుగు బ్లాగులు “లక్ష బ్లాగులూ కోటి సందర్శకులు”గా ఎదగాలని ఆశిస్తూ… తెలుగు బ్లాగరులందరికీ ఇదే మా ఆహ్వానం! ,
తెలుగు బ్లాగర్లందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు
మీ శ్రేయోభిలాషి 
కశ్యప్



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 087

Saturday, August 27, 2011

తెలుగుకై నడక

తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా తెలుగు వాడుక పెరగాలని ఆశిస్తూ తెలుగు కోసం నడుద్దాం!

రేపే .......................★ ఆదివారం, ఆగస్టు 28 — ఉదయం 9 గంటల నుండి★

హైదరాబాదులో: తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు.

కంప్యూటర్లు మరియు జాలంలో తెలుగుని పెంపొదించడానికి కృషి చేస్తున్న e-తెలుగు, బయటి ప్రపంచంలో (ప్రభుత్వ, ప్రయివేటు వ్యవహారాలలో) కూడా తెలుగు వాడకం పెరగాలని ఆశిస్తూ ఈ తెలుగు బాట కార్యక్రమాన్ని చేపట్టింది. తెలుగు వాడకాన్ని ప్రోత్సహించడానికి, గుర్తు చేయడానికి తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సరైన సందర్భం! ప్రజలందరూ పాల్గొనడానికి వీలుగా సెలవు రోజైన ఆదివారం ఆగస్టు 28 నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.

తెలుగు భాషా దినోత్సవం

గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని (ఆగస్టు 29) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించింది.

ప్రవేశం ఉచితం. మీకు తెలుగు బాట కార్యక్రమంలో పాల్గొనాలని ఉంటే, మా నమోదు ఫారాన్ని పూరించండి. నమోదు ఫారం

మీరు తెలుగు కోసం తపించే వారైతే మాతో కలవండి. మాతో నడవండి!

సంప్రదింపులు

తెలుగు బాట గూగుల్ గుంపు

మీ స్నేహితులని కూడా వెంట తీసుకునిరండి!

తెలుగు బాట కార్యక్రమం గురించి బజ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ లలో మీ స్నేహితులకి పరిచయం చేయండి.
రండి, తెలుగు విప్లవంలో పాలుపంచుకోండి!

రేపు ఆదివారం సెలవురోజును సార్థకం చేసుకోండి. తెలుగు భాషకోసం నడవండి. భాషాభిమానం చాటుకోండి. 


Vol. No. 03 Pub. No. 014
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం