Saturday, August 27, 2011

తెలుగుకై నడక

తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా తెలుగు వాడుక పెరగాలని ఆశిస్తూ తెలుగు కోసం నడుద్దాం!

రేపే .......................★ ఆదివారం, ఆగస్టు 28 — ఉదయం 9 గంటల నుండి★

హైదరాబాదులో: తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు.

కంప్యూటర్లు మరియు జాలంలో తెలుగుని పెంపొదించడానికి కృషి చేస్తున్న e-తెలుగు, బయటి ప్రపంచంలో (ప్రభుత్వ, ప్రయివేటు వ్యవహారాలలో) కూడా తెలుగు వాడకం పెరగాలని ఆశిస్తూ ఈ తెలుగు బాట కార్యక్రమాన్ని చేపట్టింది. తెలుగు వాడకాన్ని ప్రోత్సహించడానికి, గుర్తు చేయడానికి తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సరైన సందర్భం! ప్రజలందరూ పాల్గొనడానికి వీలుగా సెలవు రోజైన ఆదివారం ఆగస్టు 28 నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.

తెలుగు భాషా దినోత్సవం

గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని (ఆగస్టు 29) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించింది.

ప్రవేశం ఉచితం. మీకు తెలుగు బాట కార్యక్రమంలో పాల్గొనాలని ఉంటే, మా నమోదు ఫారాన్ని పూరించండి. నమోదు ఫారం

మీరు తెలుగు కోసం తపించే వారైతే మాతో కలవండి. మాతో నడవండి!

సంప్రదింపులు

తెలుగు బాట గూగుల్ గుంపు

మీ స్నేహితులని కూడా వెంట తీసుకునిరండి!

తెలుగు బాట కార్యక్రమం గురించి బజ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ లలో మీ స్నేహితులకి పరిచయం చేయండి.
రండి, తెలుగు విప్లవంలో పాలుపంచుకోండి!

రేపు ఆదివారం సెలవురోజును సార్థకం చేసుకోండి. తెలుగు భాషకోసం నడవండి. భాషాభిమానం చాటుకోండి. 


Vol. No. 03 Pub. No. 014

5 comments:

కమనీయం said...

ఆ ఫొటో వల్లభజోస్యులశివరాంగారిది.ఆయన వాహినిలో సౌండ్ ఇంజనీరు.అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న వేషాలు వేస్తూ ఉండేవారు.(భక్తపోతన ,గుణసుందరికథ మొ:)మంచి పర్సనాలిటీఉండడం ,మంచి కంఠ స్వరం వలన రాజు వేషాలు ఆయనకి బాగా నప్పేవి.----రమణారావు.ముద్దు

asr said...

అమృత ధారల తేనెల సోనల
తడిసిన స్వర వీణ
పలికే పదముల పులకించని ఎద
కలదా భువనాన
ఆ వీణ మన తెలుగు భాష
రస రమ్య శ్రీ రాగ యోష ...
తెలుగు బాట నిజంగా చాలా మంచి ప్రయత్నం . శుభం జయం !!

SRRao said...

* రమణారావు గారూ !
ధన్యవాదాలు. మీ వ్యాఖ్య ఈ టపాకు చెందినది కాదు. ' నటుడు, సాంకేతిక నిపుణుడు....? - జవాబు ' టపాలో జవాబు కూడా ఇచ్చాను.

* asr గారూ !
తెలుగు మీద అతి రమ్యంగా రాశారు. ధన్యవాదాలు.

Radha Rav said...

bhaarataavani lo bhaasha lannintilo uttejamainadee....ujwala mainadee...atyanta uttama mainadee,,mana telugu bhaashe!..manku sampradinchina ..eebhaasha nu marinta seva cheddaam..marinta unnata sikharaalaku teesukeladaam...mana bhaashalo teeyadanaanni...saampradaayaannee .aunnatyaannee telpudamu andaarakuu.. kaapaadundaamu eppatikee...rakshiddaam bhaavodvegam to! telugu velugu loney undaali ennatikee!

SRRao said...

రాధ గారూ !
మీ ఆశయం ఉన్నతమైనది. నెరవేరాలని తెలుగు వారీగా అందరం కోరుకుందాం. త్వరలోనే తెలుగులో రాయడం ఆరంభిస్తారని ఆశిస్తూ.... ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం