భారతీయ భాషలు, సాహిత్యం విశిష్టమైనవి. అందులో మనదైన తెలుగు భాషలో సాహిత్యం అనేక పోకడలు పోయింది. అనేక విన్యాసాలు చేసింది. భాషను, సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన, చేస్తున్న సాహితీస్రష్టలేందరో మనకి వున్నారు. అందుకే మనదైన భాషను సజీవంగా ఉంచాల్సిన బాధ్యత మనందరి మీదా వుంది.
తెలుగు సాహిత్యంలో ద్వర్థి కావ్యం అనేది ఓ విచిత్రమైన ప్రక్రియ. అందులో అష్టదిగ్గజాలలో ఒకరైన పింగళి సూరన రచన ' రాఘవ పాండవీయం ' ప్రముఖమైనది. ఒకే పద్యంలో రామాయణ, భారత అర్థాలు వచ్చేటట్లు రెండు అర్థాలతో రచించడం ఆ కావ్య ప్రత్యేకత.
దీనిపైన క్లిక్ చెయ్యండి |
భారతీయ భాషలన్నిటికీ మూలమైన భాష, తల్లి భాష సంస్కృతం. ప్రపంచంలోని కొన్ని భాషల్లో కూడా సంస్కృత మూలాలు ఉన్నాయంటారు. అంతులేని సాహితీ సంపద సంస్కృతంలో వుంది. ఇటీవల ఆధునిక సూపర్ కంప్యూటర్లకు అత్యంత అనువైన భాషగా నాసా గుర్తించిందట. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో సంస్కృతానికి ఆదరణ బాగా పెరుగుతోంది. సంస్కృతం భాషకు పుట్టినిల్లుగా చెప్పుకునే భారత దేశంలో పుట్టిన మనందరం మళ్ళీ ఆ భాష వికాసానికి కృషి చేస్తే బాగుంటుంది. కనీసం ఇలాంటి విశేషాలను అందరికీ తెలియజేసి ఆ భాష గొప్పతనాన్ని తద్వారా భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలి.
సంస్కృతంలో పద్నాలుగవ శతాబ్దానికి చెందిన దైవజ్ఞ సూర్య పండితుడు అనే కవి రామకృష్ణ విలోమ కావ్యం వ్రాసారు. ఇందులో పద్యాన్ని మామూలుగా మొదటినుంచి చివరకు చదివితే రామాయణార్థం, తిరగేసి అంటే చివరినుంచి మొదటికి చదివితే భారతార్థం వస్తుంది. ఈ కావ్య పరిచయాన్ని పేస్ బుక్ లో మిత్రులు శ్రీ మణికంఠ ప్రసాద్ గారు అందించారు. దాన్ని ఇక్కడ అందిస్తున్నాను.
అలాగే రామకృష్ణ విలోమ కావ్యం లింక్ కూడా ఆయన అందించారు. అయితే ఇది పూర్తి పాఠం కాకపోవచ్చు. ఆ లింక్ ..................
Vol. No. 02 Pub. No. 300
6 comments:
చాలా బాగుంది రామచంద్రరావు గారు. మాకు చాలా తెలియని విషయాలు మీరు ఇక్కడ ప్రస్తుతిస్తున్నారు. ఇది మీరు చేసే భాషా ఔన్నత్యమ్ ఇంకా ఇట్లాంటివి పోస్ట్ చెయ్యండి.
నరేంద్ర గారూ !
ధన్యవాదాలు. మీలాంటి సహృదయుల ప్రోత్సాహం వుంటే తప్పకుండా ప్రచురిస్తాను.
రామకృష్ణ విలోమ కావ్యం (సూర్యకవి)
తం భూసుతాముక్తిముదారహాసం వందే యతో భవ్యభవం దయాశ్రీ: శ్రీయాదవం భవ్యభతోయదేవం సంహారదాముక్తిముతాసుభూతం
చిరం విరంచిర్న చిరం విరంచి: సాకారతా సత్యసతారకా సా సాకారతా సత్యసత్యసతారకా సా చిరం విరంచిర్న చిరం విరంచి:
తామసీత్యసతి సత్యసీమతా మాయయాక్షమసమక్షయాయమా మాయయాక్షసమక్షయాయమా తామసీత్యసతి సత్యసీమతా
కా తాపఘ్నీ తారకాఘా విపాపా త్రేధా విఘా నోష్ణకృత్య నివాసే సేవా నిత్యం కృష్ణనోఘా విధాత్రే పాపావిఘాకారతాఘ్నీ పతాకా
శ్రీరామతో మధ్యమతోది యేన ధీరోనిశం వశ్యవతీవరాద్వా ద్వారావతీవశ్యవశం నిరోధీ నయేదితో మధ్యమతోమరా శ్రీ:
కౌశికే త్రితపసి క్షరవ్రతీ యో దదాద్ ద్వితనయస్వమాతురం రంతుమాస్వయన తద్విద్ దాదయో తీవ్రరక్షసి పతత్రికేశికౌ
లంబాధరోరు త్రయలంబనాసే త్వం యాహి యాహి క్షరమాగతాజ్ఞా జ్ఞాతాగమా రక్షహి యాహి యాత్వం సేనా బలం యత్ర రురోధ బాలం
లంకాయనా నిత్యగమా ధవాశా సాకం తయానుత్రయమానుకారా రాకానుమా యత్రను యాతకంసా శావాధమాగత్య నినాయ కాలం
గాధిజాధ్వరవైరాయే తేతీతా రక్షసా మతా: తామసా క్షరతాతీతే యే రావైరధ్వజాధిగా:
తావ దేవ దయాదేవే యాగే యావదవాసనా నాసవాదవయా గేయా వేదే యాదవదేవతా
సభాస్వయే భగ్నమనేన చాపం కీనాశతానద్వారుషా శిలాశౌ: శౌలాశిషారుద్వానతాశనాకీ పంచాననే మగ్నభయే స్వభాస:
న వేద యామక్షరభామసీతాం కా తారకా విష్నుజితేవివాదే దేవావితే జిష్నువికారతా కా తాం సీమభారక్షమయాదవేన
తీవ్రగోరన్వయత్రార్యో వైదేహీమనసో మత: తమసోన మహీ దేవై- ర్యోత్రాయన్వరగోవ్రతీ
వేద యా పంచసదనం సాధారావతతార మా మారతా తవ రాధా సా నంద సంచప యాదవే
శైవతో హననేరోధీ యో దేవేషు నృపోత్సవ: వత్సపో నృషు వేదే యో ధీరోనేన హతోవశై:
నాగోపగోసి క్షర మే పినాకే నాయోజనే ధర్మధనేన దానం నందాననే ధర్మధనే జయో నా కేనాపిమే రక్షసి గోపగో న:
తతాన దామ ప్రమదా పదాయ నేమే రుచామస్వనసుందరాక్షీ క్షీరాదసుం న స్వమచారు మేనే యదాపి దామ ప్రమదా నతాత
తామితో మత్తసూత్రామా శాపాదేశ విగానతాం తాం నగావిశదేపాశా మాత్రాసూత్తమతో మితా
నాసావిఘాపత్రపాజ్ఞావినోదీ ధీరోనుత్యా సస్మితోఘావిగీత్యా త్యాగీ విఘాతోస్మి సత్యానురోధీ దీనోవిజ్ఞా పాత్రపఘావిసానా
సంభావితం భిక్షురగాదగారం యాతాధిరాప స్వనధాజవంశ: శవం జధాన స్వపరాధితాయా రంగాదగారక్షుభితం విభాసం
తయాతితారస్వనయాగతం మా లోకాపవాదద్వితయం పినాకే కేనాపి యం తద్విదవాప కాలో మాతంగయానస్వరతాతియాత
శవేవిదా చిత్రకురంగమాలా పంచావటీనర్మ న రోచతే వా వాతేచరో నర్మనటీవ చాపం లామాగరం కుత్రచిదావివేశ
నేహ వా క్షిపసి పక్షికంధరా మాలినీ స్వమతమత్త దూయతే తే యదూత్తమతమ స్వనీలిమా- రాధకం క్షిపసి పక్షివాహనే
వనాంతయానశ్వణువేదనాసు యోషామృతేరాణ్యగతావిరోధీ ధీరోవితాగణ్యరాతే మృషా యో సునాదవేణుశ్వనయాతంనా వ:
కిం ను తోయరసా పంపా న సేవా నియతేన వై వైనతేయనివాసేన పాపం సారయతో ను కిం
స నతాతపహా తేన స్వం శేనావిహితాగసం సంగతాహివినాశే స్వం నేతేహాప తతాన స:
కపితాలవిభాగేన యోషాదోనునయేన స: స నయే నను దోషాయో నగే భావిలతాపిక:
తే సభాప్రకపివర్ణమాలికా నాల్పకప్రసరమభ్రకల్పితా తాల్పికభ్రమరసప్రకల్పనా కాలిమార్ణవ పిక ప్రభాసతే
రావణేక్షిపతనత్రపానతే నాల్పకభ్రమణమశ్రుమాతరం రంతుమాశ్రుమణమభ్రకల్పనా తేన పాత్రనతపక్షిణే వరా
దైవే యోగే సేవాదానం శంకా నాయే లంకాయానే నేయాకాలం యేనాకాశం నందావాసే గేయో వేదై
శంకావజ్ఞానుత్వనుజ్ఞావకాశం యానే నధ్యాముగ్రముధ్యాననేయా యానే నధ్యాముగ్రముధ్యాననేయా శంకావజ్ఞానుత్వనుజ్ఞావకాశం
వా దిదేశ ద్విసీతాయాం యం పాథోయనసేతవే వైతసేన యథోపాయం యాంతాసీద్విశదే దివా
వాయుజోనుమతో నేమే సంగ్రామేరవితోహ్రి వ: విహ్రితో విరమే గ్రాసం మేనేతోమనుజో యువా
క్షతాయ మా యత్ర రఘోరితాయు- రంకానుగానన్యవయోయనాని నినాయ యో వన్యనగానుకారం యుతారిఘోరత్రయమాయతాక్ష
తారకే రిపురాప శ్రీ- రుచా దాససుతాన్విత: తాన్వితాసు సదాచారు శ్రీపురా పురి కే రతా
లంకా రంకాగరాధ్యాసం యానే మేయా కారావ్యాసే సేవ్యా రాకా యామే నేయా సంధ్యారాగాకారం కాలం
ఇతి శ్రీ దైవజ్ఞ పండిత సూర్యకవి విరచితం విలోమాక్షరరామకృష్ణకావ్యం సమాప్తం
తం భూసుతాం నిజమా తాం భూసుతాం నిజమా, నేను రెండు గమనించాను. వివరించగలరు
Post a Comment