Tuesday, October 26, 2021

దృశ్య శ్రవణ సంచిక... అక్షర రూప సంచిక....

' శిరాకదంబం ' అంతర్జాల పత్రిక ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానంగా కొన్ని మార్పులు చెయ్యడం జరిగింది. ఆ ప్రకారం పక్ష పత్రికగా ' శిరాకదంబం ' ఇప్పటివరకు ప్రతి నెలలో వెలువడుతున్న రెండు సంచికలలో ఒకదానిని ' దృశ్య శ్రవణ సంచిక ' గా, మరొకదానిని ' అక్షరరూప సంచిక ' గా మార్పు చేసినట్లు పాఠకులు గమనించే ఉంటారు. 

అక్షరరూప సంచిక కోసం రచయితలు తమ రచనలను పంపించడానికి అవసరమైన సూచనలను, దృశ్య శ్రవణ సంచిక కోసం ఆడియో / వీడియో, చిత్రాలు, కార్టూన్లు వంటివాటిని సమర్పించేవారికి అవసరమైన సూచనలను ఈ క్రింది లింక్ లో చూడవచ్చు. 

https://sirakadambam.com/  

 11_003 - దృశ్య శ్రవణ సంచిక.... ఈ క్రింది లింక్ లో..........

 https://sirakadambam.com/11_00311_004 - అక్షరరూప సంచిక.....ఈ క్రింది లింక్ లో.....

 https://sirakadambam.com/11_004/


 

Visit web magazine at https://sirakadambam.com/ 

 Vol. No. 13 Pub. No. 003 & 004

Monday, September 20, 2021

శరన్నవరాత్రులు....తెలుగు యాత్రా సాహిత్యం... ప్రతీచి లేఖ... ఇంకా...

 * సృష్టికి మూలం మహామాత. ఆమె కనుసంజ్ఞలలో మెదులుతుంది... కదులుతుంది జగత్తు. పృథ్వి ఆమె రూపం. అట్టి సీమను దివ్యసీమగా మార్చటానికి, నరుల నేత్రాలను దేదీప్యమానంగా వెలుగొంద జేయటానికి తల్లి ఈ నవరాత్రులలో అందరి ఇళ్లల్లో, కళ్లల్లో నాట్యమాడుతుంది..... శరన్నవరాత్రులు

 * వంద సంపుటాలకు పైబడ్డ మహాత్మాగాంధీ రచనల్లో మొట్టమొదటి రచన ఈ యాత్రాకథనమే. కాని ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, ఒక మనిషి తన చల్లని ఇంటిపట్టు వదిలిపెట్టి కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ, అనిశ్చయాలకు ఎదురేగే ప్రతి యాత్రా అతణ్ణి స్వాప్నికుడిగానో, సాహసిగానో మారుస్తుంది...... “ తెలుగు యాత్రా సాహిత్యం ” 

 

సంగీతానికి కావలసినవి రెండు. పాడేవాడి సంస్కారం. వినేవాడి సంస్కారం.

కొన్ని ధ్వనులు, చప్పుళ్ళు మనసుకీ ఆహ్లాదంగా ఉంటాయి. కొన్ని పాటలు అంతే ! అది తాత్కాలికం. రాగంతో అనుభూతి. మనసుకి సంబంధించినది కనుక. కొన్ని వేళల్లో అనుభూతి ఆనందంతో ఆరంభం. మరి కొన్ని భరించలేని దుఃఖం కలిగిస్తూనే పరమ సుఖంలో పర్యవసిస్తాయి. పదే పదే వింటాం. ఏడుస్తాం. మళ్ళీ వింటాం. ద్రవిస్తాం....... " ప్రతీచి లేఖ "

 

ఇంకా.... ఈ క్రింది లింక్ లో...... 

శిరాకదంబం 11_002 


Visit web magazine at https://sirakadambam.com/ 

 Vol. No. 13 Pub. No. 002

Thursday, August 26, 2021

దశ దిశోత్సవం... శిరాకదంబం పత్రిక ప్రత్యేక సంచిక

*

శిరాకదంబం ’ అంతర్జాల పత్రిక ప్రస్థానం లో దశాబ్ద కాలం పూర్తి అయింది. పదకొండవ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ ప్రయాణం సాఫీగా సాగడానికి తమవంతు సహకారాన్ని అందిస్తున్న రచయితలు, రచయిత్రులకు, చందాదారులకు, శ్రేయోభిలాషులకు, ప్రకటనదారులకు, ఇంకా అనేక రూపాల్లో ప్రోత్సాహాన్ని అందిస్తున్న .... అందరికీ కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటూ.... 🙏 🙏 🙏

' దశ దిశోత్సవం '  పేరిట పదవ వార్షికోత్సవ సంచిక ను భవిష్యత్తు మార్పులకు సూచికగా రెండు భాగాలుగా రూపొందించడం జరిగింది. అందులో ఒకటి మామూలు పద్దతిలోని అక్షర రూపంలో అయితే మరొకటి దృశ్య శ్రవణ ( AV ) రూపంలో వెలువడింది. 

ఇప్పటి వరకు ప్రతి నెల వెలువడుతున్న రెండు సంచికల్లో ఇకపైన ఒకటి అక్షర రూప సంచికగా, మరొకటి దృశ్య శ్రవణ సంచికగా వెలువడుతాయి. రచయితలు, పాఠకులు, ప్రకటన దారులు, శ్రేయోభిలాషులు గమనించ ప్రార్ధన. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అంశాలపై ప్రసంగాలు, కథా కవితా పఠనాలు, శాస్త్రీయ... లలిత... జానపద... వంటి పాటలు, పద్యాలు, ఏక పాత్రాభినయం, నాటిక, నృత్యం వంటి ప్రదర్శనా కళలు, చిత్రలేఖనం, చేతి వృత్తులు, వంటలు వంటి ఏ అంశం మీదనైనా దృశ్య ( వీడియో ) లేదా శ్రవణ ( ఆడియో ) మాధ్యమాల ద్వారా పంపించవచ్చు. వివరాలకు editorsirakadambam@gmail.com గాని, editor@sirakadambam.com గాని సంప్రదించవచ్చు. 

' దశ దిశోత్సవం ' ప్రత్యేక సంచిక..... ఈ క్రింది లింక్ లో..... 

శిరాకదంబం 11_001 

 

Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 13 Pub. No. 001


Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం