మట్టిలో మట్టి కాబోయేమనిషి మట్టి (
భూమి ) అంతా తనసొంతం అని భ్రాంతిపడడం ఎంత ఆశ్చర్యమో !
- " వెలుగు నీడలు "
* నారములు ఆయన స్వరూపం నారాయణ తత్త్వం.
రాముని ఆయనం రామాయణం. నరము మొదలు సాగరం వరకు
భిన్న నామరూపాలు గల అపస్వరూపాలు. రామకథ కు సాక్షులై దర్శించి హృదయాలు స్పందించి కథ
లో నదులై, నదుల్లో కథ ను చెబితే ?... అసలే రమ్యగాధ అయిన రామాయణము ఎలా రూపొందుతుంది అంటే ఇదుగో... ఇలా
రామలహరి గా….
- ' తో. లే. పి. శీర్షికన " ధారా రామనాధశాస్త్రి "
* కాయతెచ్చాం, కారం,ఆవపిండి, లవణాలను కొట్టించలేదు గాని కొట్టునుంచి తెచ్చాం.
మా ఇంటి ఇంతి మటుకు మెంతులు తీసుంచింది.
జివ్వుమనే పుల్లని చిన్నరసాల
మామిడి ముక్కలు పక్కనుంచాము.
ఘుమఘమ నువ్వుల నూనెతో తానమాడించాం!
- ' కరోనా కారణంగా నిర్బంధం ' ప్రత్యేకంలో " ఆవకాయ విరాట్ స్వరూపం "
* ఇంట్లోనే ఉంటూ తిథి, వార, నక్షత్రాలు మరచిపోయి వ్రాసిన కరోనా వివాహ సూచన పత్రిక
సుస్తిశ్రీ దిగులు మానే, ప్రభవాది షష్ఠి సంవత్సరాల మధ్య లేని అనారోగ్య సంవత్సరే, చిరాకు మాసే, పరాకు పక్షే, చింతా నక్షత్రే, సందిగ్ధ లగ్నమందు partial lockdown సమయే......
- ' కరోనా కారణంగా నిర్బంధం ' ప్రత్యేకంలో " కరోనా వివాహ సూచన పత్రిక "
ఇంకా... చాలా... ఈ క్రింది లింక్ లో.....