Sunday, May 3, 2020

బ్రాహ్మణాగ్రహారం... కరోనాలో ఒక భర్త... కరోనా - కథా కమామీషు... ఇంకా

 * వైదిక విద్యలన్నీ విడిచిపెట్టి కొత్తదారి తొక్కను నేను. మేరలేని ఆత్మానందమును అనుభవిస్తాను. అనుభవించగలుతున్నాను.... ఏంచేత అంటే తెలుగు భాషలో ఒక రచయితను కాగలిగినందుకు. నా మాతృభాషలో కలం పట్టి నాలుగు బంతులు రాసే అదృష్టం పట్టినందుకు, తెలుగు కథకుడినయినందుకు గర్విస్తున్నానని చెప్పిన శ్రీపాద వారి కథలను పరిచయం చేయడం కూడా ఒక అదృష్టమే. వారి ఆత్మవిశ్వాసం తెలుగువారందరికీ ఆదర్శం..... ' శ్రీపాద వారి కథలు ' శీర్షికన " బ్రాహ్మణాగ్రహారం " పరిచయం. 
* చపాతీలు గుండ్రంగానే ఎందుకుండాలి ? భూమి గుండ్రంగా ఉన్నా ప్రపంచపటంలో దేశాలు తమ మానాన్న తాము చక్కగా వంకరటింకరగా లేవా? అయినా ఎలా ఉంటే ఏమిటి లోపలికెడితే "వాతాపి జీర్ణం " కదా! అన్న నా వాదనకి ఫిదా అయ్యిపోయి..

మీకు బోల్డు జనరల్ నాలెడ్జుంది, కానీ పెనం గుండ్రంగా ఉంది కదా! ఇలాగే చెయ్యాలని, అన్ని పక్కలా చపాతీ  కాలడానికి గుండ్రంగానే చేయాలని, అన్నీ తనే చేసి చూపించిన మా ఆవిడకి జోహార్..... ' కరోనా కారణంగా నిర్బంధం ' శీర్షికన " కరోనాలో ఒక భర్త "
* కరోనా అన్నది సంస్కృత పదమట ! వివరాలకు వస్తే .. కరోనా అన్నది. సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించి విడుదల సమయాన నల్లటి సూర్య బింబం కి చుట్టూ circumferential గా తెల్లని ఒక వెలుగు రేఖ కనబడుతుందట.. ఆ వెలుగు (మెరుపు) రేఖ పేరే కరోనా ట ! అదండీ సంగతి ?....
' కరోనా కారణంగా నిర్బంధం ' శీర్షికన " కరోనా - కథా కమామీషు "
ఇంకా.... ఈ క్రింది లింక్ లో...... 

Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 11 Pub. No. 015

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం