Thursday, December 7, 2017

' శిరాకదంబం ' పత్రిక క్రొత్త రూపం... గాలిపటం... అమరగాయకుడు... ఇంకా చాలా....

 ఆరు సంవత్సరాలుగా నిరంతరాయంగా వెలువడుతున్న " శిరాకదంబం " అంతర్జాల పత్రిక పాఠకులకు, ముఖ్యంగా మొబైల్ లో చూసేవారికి సౌకర్యంగా ఉండేటట్లు ఇప్పుడు క్రొత్త రూపం సంతరించుకుంటోంది.
ముందుగా తాజా సంచికను ప్రస్తుత వెబ్ సైట్ తో బాటు క్రొత్త వెబ్ సైట్ లో కూడా రూపొందించడం జరిగింది.
తాత్కాలిక url : siraakadambam.in
ఇక్కడ క్రొత్త రూపాన్ని చూసి... మీ స్పందన తెలియజేయవలసిందిగా మనవి.
మీ స్పందనలను ఈ క్రింది మెయిల్ ఐడి లకు పంపవచ్చు.
editorsirakadambam@gmail.com / editor@siraakadambam.in

తాజా సంచిక ఈ లింక్ లలో...
1. శిరాకదంబం 07_007 
2. శిరాకదంబం 07_007
 

Visit web magazine at www.sirakadambam.com / siraakadambam.in
 
Vol. No. 09 Pub. No. 006

Thursday, October 26, 2017

హరిహరాద్వైతం - కార్తిక మాస వ్రతం... మేఘదూతం... దేవులపల్లి కృష్ణశాస్త్రి... ఇంకా...

************************************************************
ముఖ్య గమనిక : నవంబర్ లో విడుదలయ్యే ' బాల కదంబం ' బాలల ప్రత్యేక సంచిక లో పాల్గొనేందుకు గడువు తేదీ నవంబర్ 05 వ తేదీ వరకూ పొడిగించడం జరిగింది. దయచేసి మీ పిల్లల్ని, మీకు తెలిసున్న పిల్లల్ని ' బాల కదంబం ' లో పాల్గొనేలాగ ప్రోత్సహించండి. పూర్తి వివరాలు ఈ సంచిక 04 వ పేజీలో.....
************************************************************
* తమ పిల్లలు బాగా చదువుకోవాలని, జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని తల్లిదండ్రులు కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఆ ఆశయం తప్పుదారి పట్టింది. ఒకప్పుడు పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉన్న విద్య క్రమేపీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో కెళ్లింది. అప్పుడే విద్యారంగం వ్యాపార రంగు పులుముకుంది. వ్యాపారం చెయ్యాలనుకునే వ్యక్తికి కేవలం లాభార్జనే ప్రధానం. పెట్టిన పెట్టుబడికి వీలైనంత ఎక్కువ లాభం సంపాదించడానికే ప్రయత్నిస్తాడు తప్ప మరే ప్రయోజనాన్ని పట్టించుకోడు. సేవ అనే మాటని  అసలే దగ్గరకు రానివ్వడు. అందుకే వ్యాపార దృక్పథంతో విద్యాలయాన్ని ప్రారంభిస్తే అందులో ‘ఆలయం’ మాయమైపోతుంది......... ' ప్రస్తావన ' లో. 

* కార్తిక మాస ప్రత్యేక అంశాలు - కార్తికం, కార్తిక పౌర్ణమి, పూజ, హరిదారాద్వైతం - కార్తిక మాస వ్రతం
* ' మేఘదూతం ' లోని మొదటి శ్లోకం. 
*  నవంబర్ 01వ తేదీ మధురకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం.
* ప్రముఖ రచయిత పోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారి తో. లే. పి. 

ఇంకా చాలా..... ఈ క్రింది లింక్ లో.... 

శిరాకదంబం 07_005





Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 09 Pub. No. 005

Monday, October 9, 2017

మేఘదూతం...వీణ చిట్టిబాబు...నోబెల్ విజేత...మందాకిని... ఇంకా చాలా....

 " దీపం జ్యోతి పరబ్రహ్మ "
చీకటిలో చిరుదివ్వె తోవ చూపిస్తే, మనలో జ్ఞానజ్యోతులు అజ్ఞానాంధకారాన్ని పారద్రోలుతాయి.
మనలో ఉండే చెడు ఆలోచనల్ని తుడిచి వేసి మంచి ఆలోచనలని కాపాడుకోవడమే దుష్టశిక్షణ - శిష్ట రక్షణ.
ఆ సంబరమే దీపావళి పండుగ.
కనుక ముందు ఆ పని చేద్దాం. మనలో ఉన్న నరకాసురులను తరిమేద్దాం.

రాధా తత్వం ఏమిటి ?, కాళిదాస కృత ' మేఘదూతం ' ప్రారంభం, వైణిక సామ్రాట్ చిట్టిబాబు, నోబెల్ విజేత కాజుఓ ఇషిగురో, కథ ' ఇరుగు పొరుగు ', లిఖిత పత్రిక ' మందాకిని '..... ఇంకా చాలా.... . 
దీపావళి సంచిక ఈ క్రింది లింక్ లో.....
శిరాకదంబం 07_004


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 09 Pub. No. 004

Saturday, September 23, 2017

బాల కదంబం... నా దేశం - నా గీతం... దేవీ మంత్ర మాలా... ఇంకా....

దసరా వచ్చింది.... సందడి తెచ్చింది.
అయ్యవారికి చాలు అయిదు వరహాలు...  పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు అంటూ అయ్యవారి వెంట ఇంటింటికీ తిరిగే సంప్రదాయం ఎప్పుడో కనుమరుగైపోయింది. అదే కాదు.  ఇంకా అనేక సంప్రదాయాలు కనుమరుగయితే మరికొన్ని రూపం మార్చుకున్నాయి. వీటి గురించి ... ' ప్రస్తావన ' లో ......
నవరాత్రి, మూలపూజల విశేషాలు ' దసరా ' లో.....
దేవీ మంత్ర మాలా ' ధ్యాన శ్లోకములు ' లో .....
విజేతల గేయాలు ' నా దేశం - నా గీతం ' లో......
బాలల కోసం ప్రత్యేక సంచిక ' బాల కదంబం ' వివరాలు.....

ఇంకా ఎన్నో ....  దసరా సంచిక ఈ క్రింది లింక్ లో......
శిరాకదంబం 07_003  
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 09 Pub. No. 003

Sunday, September 10, 2017

కామాక్షీ కవచం... చేతన... నా దేశం - నా గీతం... ఇంకా చాలా.....

మరో మాతృభాషా దినోత్సవం కూడా వచ్చి వెళ్లిపోయింది. గతంలోని కొన్ని నిర్ణయాలకు కొనసాగింపుగా మరిన్ని నిర్ణయాలు వెలువడ్డాయి. అయితే అమలు విషయమే సందిగ్ధం. తెలుగు భాషా అభివృద్ధికి, వికాసానికి చేయవలసిన కృషి ఎంతో ఉంది. మన మాతృభాషని విస్మరించడం అంటే మనకు జన్మనిచ్చిన తల్లిని విస్మరించడమే అనే విషయం అన్నీ వ్యాపార ధోరణిలోనే చూసే వారికి అర్థం కావడం కష్టమైన విషయమే ! కానీ వారి తెలిసివచ్చేదాకా ఉద్యమించవలసిన బాధ్యత ప్రతి తెలుగు వాడి మీదా ఉంది. ఇంకా ' ప్రస్తావన ' లో.....
కామాక్షీ కవచం, చేతన, వరంగల్, అమలాపురంలో జరిగిన "  నా దేశం - నా గీతం " దేశభక్తి గేయాల పోటీ లలోఎంపికైన గేయాలు.... ఇంకా ఎన్నో....
ఈ క్రింది లింక్ లో .....
శిరాకదంబం 07_002

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 09 Pub. No. 002

Friday, August 18, 2017

అభినందన మందారాలు

' శిరాకదంబం ' పత్రిక గా ప్రారంభించి 6 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ ఆరు సంవత్సరాల్లో ఎందరో రచయితలు, రచయిత్రులు ఈ శిరాకదంబం కుటుంబంలో చేరారు. పత్రిక విజయానికి తోడ్పడ్డారు. ఎన్నో ప్రయోగాల్లో పాల్గొన్నారు. తద్వారా తెలుగు భాష, సంస్కృతి వికాసాలకి తమ వంతు కృషి చేస్తూ, పత్రికను కూడా మంచి స్థాయిలో నిలబెడుతున్నారు. అలాగే ఎప్పటికప్పుడు క్రొత్త క్రొత్త పాఠకులకు పత్రిక చేరువ అవుతోంది. మొదటినుంచీ పాఠకులు గా ఉన్నవారు మరెందరికో పత్రికను పరిచయం చేస్తున్నారు. పాఠకుల ఆదరణే రచయితలకు ప్రోత్సాహాన్ని ఇస్తే, పత్రికకు ఉత్సాహాన్ని ఇస్తుంది.

ఆదరిస్తున్న పాఠకులకు, తమ రచనలతో పత్రికను అలంకరిస్తున్న రచయితలకు, రచయిత్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతభివందనాలతో......

అభినందన మందారాలతో 6వ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఈ క్రింది లింక్ లో......
శిరాకదంబం 07_001





Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 09 Pub. No. 001

Saturday, July 22, 2017

దాశరథి మావయ్య... శబ్ద ప్రయోగం... ఏలూరిపాటి అనంతరామయ్య .... ఇంకా చాలా...

 * తెలుగు సాహితీ కిరణం కవి దాశరథి గారి జయంతి సందర్భంగా వారి జ్ఞాపకాలు " దాశరథి మావయ్య "
 * మన భాషలో శబ్దాల ప్రయోగాల గురించి వివరించే "శబ్ద ప్రయోగం "
* ప్రముఖ పండితులు " బ్రహ్మశ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య " గారి గురించి ' తో. లే. పి. ' లో...
ఇంక ఎన్నో ......ఈ క్రింది లింక్ లో ......
శిరాకదంబం 06_020



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 025

Saturday, July 8, 2017

గురుపౌర్ణమి... సాహిత్యం - సంస్కృతి... విద్యాదానం... ఇంకా...

* గురు పౌర్ణమి విశిష్టతను వివరిస్తున్న ప్రవచనం " గురు పౌర్ణమి "
* మన సంస్కృతిలో భాగంగా మారిన సాహిత్యం గురించి వివరణ " సాహిత్యం - సంస్కృతి "
* అన్ని దానాలలో ఉత్కృష్టమైనది అన్నదానం అంటారు. ' విద్యాదానం ' అంతకంటే ఉత్కృష్టమైనదిగా వర్ణించే పద్యం
* కార్టూనిస్ట్ ' సురేఖ ' గా ప్రసిద్ధులైన ఎమ్వీ అప్పారావు గారి " తో. లే. పి. "
ఇంకా చాలా ...... ఈ క్రింది లింక్ లో......

శిరాకదంబం 06_019



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 024

Wednesday, June 28, 2017

కృష్ణ ! కృష్ణ ! కృపాళీ !...తో.లే.పి. 'సత్యం శంకరమంచి'... మనసున్న మా ' రాజు '... ఇంకా

మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు పూర్తి కావస్తున్నాయి. ఆ సందర్భంగా ' శిరాకదంబం ' అనుబంధ సంస్థ ' శిరావేదిక ' ' శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ' సంయుక్తంగా వివిధ ప్రదేశాలలో స్థానిక మిత్రులు, సంస్థల సహకారంతో 16 సంవత్సరాల లోపు వయసు గల బాలబాలికలకు తెలుగు ' దేశభక్తి గేయాల పోటీ 2017 ' నిర్వహించడం జరుగుతోంది. ఆ పరంపరలో భాగంగా జూన్ 19 వ తేదీన వరంగల్, హనుమకొండలోని మల్లికాంబ మానసిక వికాస కేంద్రంలో ' ఫేసెస్ ' సంస్థ అధ్వర్యంలో పోటీ నిర్వహించడం జరిగింది. మరికొన్ని చోట్ల జూలై నెలలో నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఈ కార్యక్రమాలకు మిత్రుల సహకారం, పాల్గొంటున్న బాల బాలికలకు ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ....
తాజా సంచిక ఈ క్రింది లింక్ లో .....
శిరాకదంబం 06_018


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 023

Friday, June 9, 2017

ఎగిరిపోయిన చిలుకా !... పద్మశ్రీ ఎన్టీ రామారావు... సునాదం.... ఇంకా చాలా....

* భారతీయ సంగీత రంగానికి చెందిన వాగ్గేయకారుల గురించిన ఎన్నో విశేషాలను వివరిస్తున్న " సు'నాదం' " రెండవ భాగం,
* నటరత్న నందమూరి తారక రామారావు గారికి పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంలో వ్రాసిన " తో. లే. పి. ",
* 1969 లో విడుదలైన ' అర్థరాత్రి ' చిత్రంలోని " ఎగిరిపోయిన చిలుకా ! "......
ఇంకా చాలా.... ఈ క్రింది లింక్ లో.....
శిరాకదంబం 06_017


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 022

Wednesday, May 24, 2017

సు'నాదం'... మా కోనసీమ... ఫోటోలు... కథ కాని కథ... ఇంకా చాలా....


సంగీత లక్షణ గ్రంథాలు పరిశోధించి, భారతీయ సంగీతంలో వాగ్గేయకారులు అనదగ్గ మహనీయుల తైల వర్ణ చిత్రాలతో రెండు గ్రంథాలు రూపొందించారు ప్రముఖ రచయిత్రి, సంగీతజ్ఞులు, విదుషీమణి డా. శారదాపూర్ణ శొంఠి గారు. ఆ గ్రంథాలలోని విశేషాలు " సు'నాదం' " లో..... 
కోనసీమ విశిష్టతను వర్ణిస్తూ సాగే మహాకవి బోయి భీమన్న గారి పద్యం " మా కోనసీమ ".... 
ఒకప్పుడు బంధుమిత్రుల మధ్య అనుబంధాలకి, ఆప్యాయతలకు, మర్యాదలకు నిదర్శనంగా నిలిచిన మన యిళ్లలోని వేడుకలు ప్రస్తుతం కేవలం ఫోటోలకు, వీడియో లకు ప్రాముఖ్యతనిస్తున్న వైనం పైన ' అమెరికా ఇల్లాలి ముచ్చట్లు ' నుంచి ఓ ముచ్చట " ఫోటోలు " ..... 
మన దైనందిక జీవితంలో... కుటుంబ నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో హాస్యం అలవోకగా పుడుతుంది. అలాంటి ఒక సందర్భాన్ని వస్తువుగా తీసుకుని సున్నితమైన హాస్యాన్ని అందించిన " కథ కాని కథ ".... 
ఇంకా చాలా.... ఈ క్రింది లింక్ లో.... 

   


Visit web magazine at www.sirakadambam.com 


Vol. No. 08 Pub. No. 021

Thursday, May 11, 2017

అమ్మతనం - కమ్మదనం...బుద్ధుడు...హనుమత్తత్వమ్... చలానికి లేఖ

మాతృదినోత్సవ శుభాకాంక్షలతో..... 

మన జీవితాల్లో తల్లికి ఉన్నత స్థానముంది. మనకి జీవితాన్ని ప్రసాదించడం లో ప్రధాన భూమిక ఆమెదే ! మన పెరుగుదల, వ్యక్తిత్వం ఆమె మీద ఆధారపడి ఉన్నాయి. మే14వ తేదీ ' మాతృదినోత్సవం '. ఆ సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచిక ' అమ్మతనం - కమ్మదనం ' లో అమ్మతనం గురించిన ప్రత్యేక రచనలతో బాటు బుద్ధ జయంతి, హనుమజ్జయంతి ల గురించిన విశేషాలు, వైశాఖ పూర్ణిమ రోజున భీమిలి స్నేహ కుటి లో జరిగిన ప్రముఖ రచయిత చలం జయంతి వేడుకల విశేషాలు ' చలానికి లేఖ '.... ఈ క్రింది లింక్ లో......

శిరాకదంబం 06_015


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 020

Saturday, April 22, 2017

అక్షయతృతీయ... వివేకచూడామణి... స్వరరహస్యవేదీ !... ఇంకా....

మాతృదినోత్సవం సందర్భంగా " అమ్మతనం - కమ్మదనం " శీర్షికన ప్రత్యేక సంచిక వెలువడుతోంది. ఆ సందర్భంగా మాతృమూర్తుల నుంచి తమ పిల్లలతో ఆత్మీయతానుబంధాల గురించి రచనలను ఆహ్వానిస్తున్నాం. రచనలు అందవలసిన చివరి తేదీ 30 ఏప్రిల్ 2017. వివరాలకు శిరాకదంబం తాజా సంచిక 04 వ పేజీలో చూడండి లేదా editorsirakadambam@gmail.com లో సంప్రదించండి.
***********************************************
'అక్షయతృతీయ' గురించిన అసలు నిజం ఏమిటి ? సింహాచల వరాహ నరసింహస్వామి ' చందనోత్సవం',' ఆదిశంకరుల జయంతి' గురించిన విశేషాలు, ఆదిశంకరుల ' వివేకచూడామణి ', ఎస్.పి. బాలు ' స్వరరహస్యవేదీ! ', " మహాకవి శ్రీశ్రీ " గారి తో.లే.పి......ఇంకా చాలా.....ఈ క్రింది లింక్ లో....
శిరాకదంబం 06_014 


Visit web magazine at www.sirakadambam.com  

Vol. No. 08 Pub. No. 019

Wednesday, April 19, 2017

అభిజ్ఞాన శాకుంతలం 01



 
ప్రధమాంకములో ధనుర్బాణములను చేత పట్టుకొని ఒక లేడిని అనుసరించుచు సూతునితోసహా రధము పై దుష్యంతమహారాజు పాత్ర ప్రవేశించును.ఆ లేడిని తరుముతూ రాజు బాణమును ఎక్కుపెట్టినంతలో వైఖానసుడు ప్రవేశించి బాణముతో లేడిని కొట్టవద్దని రాజును వారించే సందర్భములో కాళిదాసు ఒక అద్భుతమైన శ్లోకమును రచించినాడు. ఆ శ్లోకము--

     నఖలు న ఖలు బాణ: సన్నిపాత్యో యమస్మిన్
     మృదుని మృగశరీరే పుష్పరాశా వివాగ్ని:
     క్వ! బత! హరిణకానాం జీవితం చాతిలోలం
     క్వ చ నిశితనిపాతా: సారపుంఖా: శరా స్తే!!
      అతి మృదువైన ఈ మృగశరీరము మీదికి బాణమును వేయుట పుష్పరాశి పై అగ్నిని విసిరినట్లు అగును. నీకిది తగదు.అతి చంచలములైన ఈ లేళ్ళ ప్రాణములు ఎక్కడ? మిక్కిలి వేగవంతములును, పదునైనవియునగు నీ బాణముల శక్తి ఎక్కడ? నీ బాణమును ఉపసమ్హరింపుము అని వైఖానసుడు దుష్యంతుని వారించిన ఈ శ్లోకములో రాబోవు కధనంతటినీ కాళిదాసమహాకవి సూచించినాడు.
రాజునకు చేయబడిన ఈ ధర్మోపదేశములో నొక చమత్కారమున్నది. ముందు జరుగబోవు కధలో గాంధర్వవిధిని దుష్యంతుడు చేపట్టిన శకుంతల భార్య హోదాలో రాజాస్థానమునకు పోగా అగతికయై, దీనయైన ఆ ఇల్లాలిని దుష్యంతుడు (దుర్వాసుని శాపవశమున) త్రోసిపుచ్చును. దీనురాలైన భార్యను రక్షింపవలసిన మహారాజు నిరపరాధిని యైన యామెను శాపవశమున శిక్షింపబోవును.ఈ కధ అంతయూ వైఖానసుని ధర్మోపదేశమున స్ఫూర్తిమంతముగా నున్నది. పౌరవులకు సాయకములు (బాణములు) దీనజన రక్షణకు కానీ నిరపరాధులను శిక్షించుటకు కాదు  అని దుష్యంతుడు ఎక్కుపెట్టిన బాణమును వైఖానసుడు ఉపసం హరింపజేయును. ఇదంతయూ కాళిదాసుని కళాభిజ్ఞతకు, లోకజ్ఞతకు నిదర్శనము.  


- ఎర్రమిల్లి శారద


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 018

మధుర గాయకుని పరిచయం - ఒక జ్ఞాపకం


1961 సంవత్సరం -
 కాకినాడ లోని గవర్నమెంట్ ఇంజినీరింగ్ కళాశాలలో 5 - సంవత్సరాల  B .E., డిగ్రీ కోర్సు లో మూడవ సంవత్సరం  చదువుతున్నాను. అప్పట్లో ఈ కోర్స్ లో చేరి చదివే విద్యార్ధినుల సంఖ్య చాలా తక్కువగా - అంటే నామమాత్రం ఉండేది. మా విద్యార్ధులు అందరినీ ఒక రెండు వారాల పాటు దక్షిణ భారత దేశ యాత్ర ( వైజ్ఞానిక - వినోద యాత్ర ) లో భాగంగా  మైసూరు, హంపి, బెంగళూరు, మద్రాసు నగరాలకు తీసుకువెళ్ళి, అవి చూడడం పూర్తి అయ్యాకా, మా అందరికీ మద్రాసు లోనే వీడ్కోలు చెప్పి, అక్కడ నుండి 4, 5 రోజులలో ఎవరికి వారుగా కాకినాడ చేరుకోమని - మా కూడా వచ్చిన ఉపాధ్యాయ బృందం  చెప్పారు.. మేమంతా కలిసి షుమారు పాతిక మంది  దాకా ఉన్నాము. మాకు మద్రాసు లో ఉండేందుకు నుంగంబాకం లోని లయోలా కళాశాల  హాస్టల్ భవనం లో ఉచిత వసతి ని కల్పించారు.
సరే ! మాలో ఎవరి అభిరుచులు వారివి కదా !
నా మటుకు నాకు యా రోజుల్లో ప్రత్యేకించి బ్లాక్ & వైట్ తెలుగు - హిందీ సినిమా పంచ ప్రాణాలు. సినిమా కళాకారులంటే  వల్లమాలిన ఇష్టం – భక్తి – గౌరవం - ఇంకా ఇలా ఎన్నో... ఎన్నో! వాళ్ళ  అడ్రెసులు సేకరించి వాళ్ళకి ఉత్తరాలు వ్రాసి - వారి  నుండి ప్రత్యుత్తరాలు, ఫోటోలు వస్తే - పొంగి పోతూ - వాటిని భద్రం గా దాచుకోవడం నాకు పరిపాటి.
చూడవలసిన ప్రదేశాలు అన్నిటినీ చూడడం అయిపొయింది కనుక - ఇక మిగిలిందల్లా, నేను చూడాలనుకున్న వ్యక్తులు - నా దృష్టి లో ముఖ్యం గా నేను అభిమానించే వారు 'ముగ్గురు'
ఆ ముగ్గురిలో ఒకరు : సుప్రసిద్ధ నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారు.


మద్రాసు మహానగరము లో ఆ రోజులలో ఆటో లు అరుదు. అద్దె టాక్సీలు మాత్రం తిరిగేవి. మనకు ఎక్కువగా అందుబాటు లో ఉండేవి సిటీ బస్సులు, లోకల్ రైళ్ళు .. ఇంకా APG II - నటరాజా సర్వీస్ అనే వాళ్ళం.- రెండు కాళ్ళ నడక. కాళ్ళల్లో చక్రాలు తిరగాలంటే వాటికి ఇంధనం అక్కర లేదు గానీ - కడుపు నిండా తిండి వుంటే చాలు. అప్పుడు అడుగు తడబడకుండా  ముందడుగు పడుతుంది.
మాంబళం స్టేషన్ లో ఎలక్ట్రిక్ ట్రైన్ దిగి టి. నగర్, ఉస్మాన్ రోడ్ పట్టుకుని కాలి నడక న వెడుతూ, ఇంటి నెంబర్లు వెతుక్కుంటూ  వెళ్లి - చివరకు 35 నెంబరు ఇంటిదగ్గర ఆగి చూసాను. ముందు గేటు, ప్రక్కన ప్రహరీ గోడలో బిగించిన బోర్డు మీద " ఘంటసాల " అన్న అక్షరాలు.! ఆ అక్షరాలను చూస్తుంటే సాక్షాత్తూ ఆయన దర్శనం కలిగినంత ఆనందం కలిగింది. మెల్లగా గేటు తోసి – లోపలకి అడుగు పెట్టాను. పెద్దాయనను చూడబోతున్నామన్న ఆనందాన్ని కప్పి వేస్తూ - ఒక పక్క భయం - ఇంకొక పక్క తడబాటు - వేరొక పక్క ఉత్కంఠ ! ముందు గది లో చాలామందే కూర్చుని ఎదురుగా వేరొక కుర్చీ లో కూర్చున్న "ఆయన" తో మాట్లాడుతున్నారు. ఆ " ఆయనే " మన ఘంటసాల గారని - అంతకు ముందే ఫోటో లో చూచి ఉన్న కారణంగా - వెంటనే గుర్తుపట్టగలిగాను. ఆయనతో అప్పటి వరకు ఉన్న వ్యక్తులు ఒకరొకరే ఆయన వద్ద శెలవు తీసుకుని వెళ్ళిపోగా - ఇక చివరికి – ఆయనా – నేను - ఇద్దరమే మిగిలాము అక్కడ. ఆయన కు నమస్కరించి - నన్ను పరిచయం చేసుకున్నాకా , ఆయన చిరు నవ్వుతో వేసిన ప్రశ్న ను మాత్రం ఈనాటికీ మరువలేను.
" బాబూ! నువ్వు పాడతావా ? " అని-
" లేదండీ " అని ఆయనకు కాస్త బెరుకు గా సమాధానం చెప్పి -- నా కూడా తెచ్చుకున్న పుస్తకం లో ఆయన ఆటోగ్రాఫ్  తీసుకుని - ఆయన కు ధన్యవాదాలు చెప్పి బయటకు వచ్చాను. శ్రీ ఘంటసాల గారిని కలిసిన సందర్భం మొదటిది - చివరిదీ కూడా అదే !
అటు తరువాత ఆయన 1974 లో కాలం చేసే పర్యంతం ఆ మహానుభావునితో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరిపేవాడిని. నా ఉత్తరాలను ఆయనకు స్వయంగా చదివి వినిపించేదానినని ఆయన సతీమణి సావిత్రమ్మ గారు నాతో తరచూ అంటూ వుంటారు. ఆమె మాటలు నాకు తేనె పలుకులు లా తోస్తాయి.
అమెరికా ప్రభుత్వం, ఇతర తెలుగు సంస్థల ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఆయన తన బృందం తో కలిసి అమెరికా లోని అనేక ప్రముఖ నగరాలలో పాట కచేరీ లను చేసి ఎంతోమంది శ్రోతలను అలరించారు. తన ఈ పర్యటనను దిగ్విజయం గా పూర్తి చేసుకుని ఆయన స్వదేశం చేరుకుంటున్న సందర్భం గా మిత్రులు సంగీత – సాహిత్య - నృత్య కళాకారులు – విమర్శకులు - శ్రీ వి. ఏ. కె. రంగారావు గారు ఊహా ఎంటర్ ప్రైజెస్ తరఫున " శ్రీ ఘంటసాల " గారి గురించిన వ్యాసాలు, ఆయన పాడిన లలిత గీతాలతో కూర్చిన ఒక పుస్తకాన్ని శ్రీ బాపు గారు వేసిన ముఖచిత్రం తో వెలువరించారు. శ్రీ ఘంటసాల గారి సంతకం తో  అపురూపమయిన కానుక గా ఆ పుస్తకాన్ని నేను అందుకున్నాను. ఆయన అన్నా, ఆయన గాత్రం అన్నా ఉన్న అభిమానం ఈ పరిచయంతో పదింతలయింది.

- ఓలేటి వెంకట సుబ్బారావు

 
Visit web magazine at www.sirakadambam.com 

 Vol. No. 08 Pub. No. 17
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం