Friday, November 29, 2013

ముకుందమాల... కాఫీయాలయం.... మురారి అంతరంగం..... ఇంకా ఎన్నో

 * కేరళకు చెందిన రాజు కులశేఖర ఆళ్వార్ విశేషాలు, ఆయన సంస్కృతంలో రచించిన ' ముకుందమాల ' పరిచయం
*
స్వామి వివేకానందుడు అమెరికాలోని చికాగో నగరంలో చేసిన చరిత్రాత్మక ఉపన్యాసం
* వక్కలంక రసధారలు లో ' అమృతం '
* ఉత్పలమాల పద్యంలో ' కాఫీయాలయం '
* ప్రముఖ హాస్య రచయిత శ్రీ యర్రంశెట్టి సాయి గారి ' తో. లే. పి. '
* చిత్ర నిర్మాణం పై ప్రముఖ నిర్మాత శ్రీ కాట్రగడ్డ మురారి గారి అంతరంగం
ఇంకా ఎన్నో ....
శిరాకదంబం 03_008  
 

Visit web magazine at www.sirakadambam.com 


Vol. No. 05 Pub. No.12

Sunday, November 17, 2013

ప్రక్షాళన... కార్తీక మహాత్మ్యము.... ' మిథునం ' శ్రీరమణ గారి తో. లే. పి. ..... ఇంకా ....

 
సాధన అనేది మన మనసుల్ని, శరీరాన్ని ప్రక్షాళన చేస్తుంది. ఆత్మ ప్రక్షాళన కోసం సాధన అనేది ఏ రూపంలో, ఎలా చెయ్యాలి అనే విశేషాలు ‘ ప్రక్షాళన – సాధన ’ లో......
వేదాలు, ఉపనిషత్తులలోని సారాన్ని ప్రజలందరికీ సులభంగా అర్థం కావడానికి పురాణాలుగా చెప్పబడ్డాయి. కార్తీక పురాణంలో ధర్మబద్ధమైన జీవితానికి, ముక్తికి అనుసరించాల్సిన వివిధ పద్ధతులు ఉన్నాయి. కార్తీక మాస సందర్భంగా కార్తీకపురాణం నుంచి ఒక భాగం ‘ కార్తీక మహత్మ్యం ’ ............
‘ ఆంధ్ర కవితా పితామహ ’ అల్లసాని పెద్దన విరచిత "మనుచరిత్రము" గా ప్రసిద్ధి గాంచిన  "స్వారోచిష మనుసంభవము" అనే  ప్రబంధ పరిచయం .....
కోనసీమ కవికోకిల డా. వక్కలంక లక్ష్మీపతి రావు గారి రసధారలు లో ‘ కాంతి జలపాతం ’ సంపుటి నుండి ‘ వివేకం ’ కవిత.......
తెలుగు భాషకు గర్వకారణమైన పద్య సంపదను సమకాలీన అంశాలతో అలంకరిస్తూ వ్రాసిన ‘ పద్య కదంబం ’ లో ఉత్పలమాల పద్యం ‘ మాతృభూమి ’......
‘ మిథునం ’ శ్రీరమణ గా తెలుగు పాఠకుల మదిలో నిలిచిపోయిన రచయిత, పాత్రికేయులు శ్రీరమణ గారి లేఖతో తోకలేని పిట్ట.... 
ఇంకా చాలా .... 
 


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 011

Saturday, November 2, 2013

వెలుగుల పండుగ... ఫన్ డాక్టర్ తో. లే. పి. .... అలనాటి ' శశిరేఖ ' ... ఇంకా ....


తమసోమా జ్యోతిర్గమయ ‘

మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతుల్ని వెలిగించడానికి ప్రతీక ‘ దీపావళి ‘ పండుగ.

నరకాసురుడు అనే అహంకారాన్ని సంహరించింది సత్యభామ రూపంలో ఆ జగన్మాత. అది శుభ సందర్భంగా భావించి పండుగగా జరుపుకుంటున్నాము మనందరం.

మనలో నరకాసురుడు వుండడం ఎవరికీ ఇష్టం వుండదు. అలా వున్నవాడే దానవుడు అవుతాడు. అయినా చాలామంది అతడిని ( అహంకారాన్ని ) జయించలేకపోతున్నారు. అలా జయిస్తే అందరూ మానవులే అవుతారు.

ఈ దీపావళిని పురస్కరించుకునైనా మనలోని అజ్ఞానాంధకారాన్ని, అహంకారాన్ని కూడా తొలగించమని, సాటి మనుష్యుల్ని ద్వేషించే మనస్తత్వాన్ని ప్రేమించే విధంగా మార్చమని ఆ పరమాత్ముడిని కోరుకుందాం !

పాఠకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అందరికీ దీపావళి శుభాకాంక్షలతో .........
దీపావళి ప్రత్యేక రచనలతో బాటు ఇతర శీర్షికలతో దీపావళి ప్రత్యేక సంచిక ఈ క్రింది లింక్ లో  ..... 


 


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 05 Pub. No. 010
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం