‘ తమసోమా జ్యోతిర్గమయ ‘
మనలోని
అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతుల్ని వెలిగించడానికి ప్రతీక ‘ దీపావళి ‘ పండుగ.
నరకాసురుడు
అనే అహంకారాన్ని సంహరించింది సత్యభామ రూపంలో ఆ జగన్మాత. అది శుభ సందర్భంగా భావించి
పండుగగా జరుపుకుంటున్నాము మనందరం.
మనలో
నరకాసురుడు వుండడం ఎవరికీ ఇష్టం వుండదు. అలా వున్నవాడే దానవుడు అవుతాడు. అయినా
చాలామంది అతడిని ( అహంకారాన్ని ) జయించలేకపోతున్నారు. అలా జయిస్తే అందరూ మానవులే
అవుతారు.
ఈ
దీపావళిని పురస్కరించుకునైనా మనలోని అజ్ఞానాంధకారాన్ని, అహంకారాన్ని కూడా తొలగించమని, సాటి మనుష్యుల్ని ద్వేషించే మనస్తత్వాన్ని ప్రేమించే విధంగా
మార్చమని ఆ పరమాత్ముడిని కోరుకుందాం !
పాఠకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు,
అందరికీ దీపావళి శుభాకాంక్షలతో .........
దీపావళి ప్రత్యేక రచనలతో బాటు ఇతర శీర్షికలతో దీపావళి ప్రత్యేక సంచిక ఈ క్రింది లింక్ లో .....
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 05 Pub. No. 010
No comments:
Post a Comment