Monday, December 21, 2015

శ్రీ శంకరాచార్య అష్టోత్తర శతనామావళి, కపిర గిరీశా ! భాగ్య పురీశా !!, శ్రీ కనకమహాలక్ష్మి ఇంకా...

ఇప్పటి తరం పిల్లల్లో తెలుగు భాష, సంస్కృతులపైన తగ్గిపోతున్న మక్కువను, మళ్ళీ వాళ్ళలో పెంపొందించజేసే కార్యక్రమాలను నిర్వహించడం ఆశయంగా స్థాపిస్తున్న సంస్థ ' శిరావేదిక '. భావితరాలలో మాతృభాషా వికాసానికి కృషి చెయ్యడమే ఈ సంస్థ లక్ష్యం. ప్రారంభోత్సవ కార్యక్రమంగా ఈ డిసెంబర్ నెల 27 వ తేదీన విశాఖపట్నం జిల్లాలోని ఉన్నత పాఠశాల స్థాయి పిల్లలకు ' తెలుగు పద్య పఠన పోటీ ' నిర్వహించి,10 మంది విజేతలకు డా. సుసర్ల గోపాలశాస్త్రి గారి స్మారక పురస్కార ప్రదానం జరుగుతుంది. శిరావేదిక మరియు శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంయుక్త అధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విశాఖపట్నం లో వున్నవారు, ఆ సమయానికి విశాఖపట్నం వచ్చే అవకాశం వున్నవారు తప్పక హాజరై చిన్నారులను ప్రోత్సహించి, ఆశీర్వదించవలసిందిగా మనవి. తేదీ & సమయం : 27 డిసెంబర్ 2015 - పోటీ : మధ్యాహ్నం గం. 2.30 ని. ల నుండి., సభ : సాయింత్రం గం. 6.30 ని. ల నుండి
వేదిక : శ్రీకృష్ణ విద్యామందిర్, తిలక్ షోరూమ్ ఎదురుగా, ద్వారకానగర్, విశాఖపట్నం
వివరాలకు : siravedika@gmail.com  మొబైల్ : 9440483813
శ్రీ శంకరాచార్య అష్టోత్తర శతనామావళి, కపిర గిరీశా ! భాగ్య పురీశా !!, శ్రీ కనకమహాలక్ష్మి ఇంకా... ఈ క్రింది లింక్ లో

శిరాకదంబం 05_009
 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 07 Pub. No. 009

Wednesday, December 2, 2015

దోసెడు మల్లెమొగ్గలు.. పుచ్చు విత్తనం... సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్.... ఇంకా ....

ప్రేమకు పెట్టిన పరీక్ష ఫలితాన్ని తెలియజేసే కథ ' దోసెడు మల్లెమొగ్గలు '
నేటి యువత ఆలోచనలు ఏ దిశగా సాగుతున్నాయో తెలియజేసే కథ ' పుచ్చు విత్తనం '
స్నేహం లోని మాధుర్యాన్ని తెలియజేసే వ్యాసం ' సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్ '
ఇంకా ... తాజా సంచిక ఈ క్రింది లింక్ లో.... .
శిరాకదంబం 05_008
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 07 Pub. No.008

Sunday, November 15, 2015

" బాలకదంబం " బాలల ప్రత్యేక సంచిక.... పద్యాలు, పాటలు, చిత్రాలు, రచనలు, ప్రతిభ....అన్నీ

" బాలకదంబం " బాలల ప్రత్యేక సంచిక.... ఇందులో....
* బాల పద్యం
* బాల చిత్రం
* బాల సంగీతం
* బాల రచన
* బాల ప్రతిభ
... అన్నీ పిల్లలవే..... ఈ క్రింది లింక్ లో .....

శిరాకదంబం 05_007 

ఈ క్రింది లింక్ లో కూడా....... .






Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 07 Pub. No. 007

Tuesday, November 3, 2015

దివ్వెల - వెలుగు రవ్వల పండుగ..మొగసాల నిలిచెనీ మందారం... సంగీత చికిత్సలో సంగీతపు వాడకం... ఇంకా చాలా....

బాలకదంబం వచ్చే సంచికే బాలల దినోత్సవ ప్రత్యేక సంచిక
' దీపం జ్యోతి పరః బ్రహ్మ '
దీపావళి శుభాకాంక్షలతో .......
* దివ్వెల... వెలుగు రవ్వల పండుగ
* దీపావళి
* ' మొగసాల నిలిచెనీ మందారం ' అన్న దేవులపల్లి వారి గురించి....
* ' సంగీత చికిత్స లో సంగీతపు వాడకం ' గురించి.....

ఇంకా ఎన్నెన్నో విశేషాలు ఈ క్రింది లింక్ లో...
శిరాకదంబం 05_006 
ఈ క్రింది లింక్ లో కూడా డిజిటల్ పుస్తక రూపంలో....







Visit web magazine at www.sirakadambam.com

 Vol. No. 07 Pub. No. 006

Saturday, October 17, 2015

బతుకమ్మ....ఆంధ్ర పుణ్యక్షేత్రాలు.... సింహగర్జన... తుంటరి రమేష్.... ఇంకా.....

దసరా వచ్చేసింది.  దసరా శుభాకాంక్షలతో ' శిరాకదంబం ' దసరా సంచిక కూడా వచ్చేసింది.
* బతుకమ్మ పండుగ విశిష్ట, బతుకమ్మ పాట
* నవరాత్రులలో నరులు కిన్నెరలు
* ఆంధ్ర పుణ్యక్షేత్రాలు
* దుర్గమ్మ చిత్రాలు - కూచి

ఇంకా ఎన్నో ... ఈ క్రింది లింక్ లో....
శిరాకదంబం 05_005
ఈ సంచికను డిజిటల్ పుస్తకరూపంలో ఈ క్రింది లింక్ లో చదవవచ్చును. " ఆంధ్ర పుణ్యక్షేత్రాలు " పాట వినవచ్చును.   

 

Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 07 Pub. No. 005

Friday, October 2, 2015

శ్రీకృష్ణదేవరాయలు...అతివస్ఫూర్తి...లక్ష్యం... ఇంకా ......

 బాలల వికాసానికి  ' శిరాకదంబం ' పత్రిక చేస్తున్న మరొక ప్రయత్నం..... బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సంచిక " బాలల జో'హార' కదంబం ". ఈ సంచికలో ప్రచురణ కోసం 15 సంవత్సరాల లోపు పిల్లలు తమ రచన, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, నాటకం, మిమిక్రీ వంటి కళారూపాల్లోనూ, అపూర్వమైన జ్ఞాపక శక్తి వంటి సాధనలలోను ప్రవేశమున్న బాలలందరూ తమకు ప్రావీణ్యమున్న అంశాలను పంపవచ్చును. చివరి తేదీ అక్టోబర్ 25, 2015. ఇది పోటీ కాదు. ప్రచురణార్హమైన వాటినన్నిటినీ బాలల ప్రత్యేక సంచికలో ప్రచురించబడును. అన్ని వివరాలకు పత్రికలోని 04, 05 పేజీలలో చూడవచ్చును. తమ ప్రతిభను ప్రపంచానికి చాటే విధంగా పిల్లలను ఈ విషయంలో ప్రోత్సహించండి.
* వినాయక చవితి పూజల చిత్రమాలిక, వినాయకుని మీద పద్యములు
* శ్రీకృష్ణదేవరాయలు
* అతివస్ఫూర్తి
* లక్ష్యం 
ఇంకా ఎన్నెన్నో .... ఈ క్రింది లింక్ లో ....
శిరాకదంబం 05_004     
' శిరాకదంబం ' డిజిటల్ పుస్తకరూపంలో కూడా చూడవచ్చును. ఆ లింక్ కూడా ఈ సంచికలో ఉంది. 


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 07 Pub. No. 004

Wednesday, September 16, 2015

బ్రతుకులు పురివిప్పిన నెమిళ్ళు... జ్వాల...మొబైల్ తో స్నేహం.... ఇంకా....

వినాయక చవితి ప్రత్యేకం ' బ్రతుకులు పురివిప్పిన నెమిళ్లు '
నేను సైతం శీర్షికన ' పుష్యమీ సాగర్ '
ఓ వీర వనిత కథ ' జ్వాల '
క్రొత్త పోకడల ' మొబైల్ తో స్నేహం '

,,, వినాయక చవితి శుభాకాంక్షలతో....
తాజా సంచిక ఈ క్రింది లింక్ లో....
www.sirakadambam.com



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 07 Pub. No. 003

Tuesday, September 1, 2015

అమ్మమ్మ వాళ్ళ ఇల్లు... బావి రహస్యం... నేను సైతం....ఇంకా

బాలల కథలు...  హూద్ హూద్ తుఫాను నేపథ్యంలో " అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ",
కాల్పనిక కథాంశంతో " బావి రహస్యం "
వర్థమాన కవులను పరిచయం చేసే " నేను సైతం "
వ్యంగ్య చిత్రాలు ( కార్టూన్లు ) " ' కూచిం'త నవ్వరూ... ! "
ఇంకా చాలా .... ఈ క్రింది లింక్ లో ...
శిరాకదంబం 05_002

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 07 Pub. No. 002

Saturday, August 15, 2015

బాలల కథల పోటీ ఫలితాలు... సంభవామి యుగే యుగే...శనగ్గింజలు... ఇంకా

 "బాలల కథల పోటీ - 2015 " ఫలితాలు తాజా సంచిక ( 05_001 ) లో ప్రకటించడం జరిగింది. ముందుగా ప్రకటించిన 10 బహుమతులకు తోడుగా మరొక రెండు బహుమతులు ప్రత్యేకంగా ప్రకటించడం జరిగింది.
బహుమతి పొందిన కథల్లో రెండింటిని తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.
అరవిందుల వారి జీవిత విశేషాలతో రూపొందిన ' సంభవామి యుగే యుగే ' నాటిక ప్రచురణ, అష్టదిగ్గజాల్లో ఒకరైన ' రామరాజభూషణుడు ' ప్రారంభం,
శ్రావణమాసంలో ప్రముఖంగా కనిపించే ' శనగ్గింజలు ' రేపిన కలకలం,
పురాణాల్లో ప్రముఖమైన స్త్రీ పాత్రల గుణగణాల గురించి ' గొనముల సొబగులు ',
ఇటీవల పరమపదించిన ప్రముఖ నేపథ్య గాయకుడు వి. రామకృష్ణ గారి తో. లే. పి. ....
ఇంకా చాలా ..... ఈ క్రింది లింక్ లో .......
శిరాకదంబం 05_001 

 Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 07 Pub. No. 001

Tuesday, July 28, 2015

భారత ' జాతి ' రత్నం

 ఆయనకు పిల్లలంటే అమితమైన ఇష్టం.
వారిలో భావి భారతాన్ని చూడగలిగిన దార్శనికుడాయన.
పిల్లలని, యువకులని కలలు కనమన్నారాయన.
ఆ కలల్ని సాకారం చేసుకునేందుకు కృషి చెయ్యమన్నారు. 




ఆయన నిజమైన, స్వచ్చమైన లౌకిక వాది.
ఏ మత సిద్ధాంతాన్నైనా, సంప్రదాయన్నైనా గౌరవించగల సంస్కారం ఆయన స్వంతం.
ఉన్నత శిఖరాలు అందుకోవడానికి ఉన్నతమైన లక్ష్యం, నిబద్ధత కావాలి గానీ అడ్డదారులు కావని నిరూపించిన మహనీయుడు.



రాష్ట్రపతి అయినా ప్రజలకు దూరంగా అద్దాల సౌధంలో గడపనవసరం లేదని, ప్రజల మధ్యనే వుండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యవచ్చని తెలియజేసిన మహా నాయకుడు ఆయన.




పదవి అందరికీ అలంకారం. ఆయన పదవికే అలంకారం.
ఇటీవలి కాలంలో భారతజాతి గర్వించదగ్గ ఏకైక ' భారతరత్నం ' ఆయన. 
తన వ్యక్తిత్వాన్ని, ఆదర్శాలను, ఆకాంక్షలను మనకి వదలి, నా పని అయిపోయింది.... ఇక అనుసరించడం మీ పని అన్నట్లుగా నిన్ననే ( 27 జూలై 2015 ) వెళ్లిపోయారాయన.



ఆయన చెప్పిన మార్గంలో మన పిల్లల్ని తయారుచేసి, భవిష్యత్తులోనైనా ఆయన లాంటి నాయకులను, శాస్త్రజ్ఞులను, పండితులను దేశానికి అందించడమే అబ్దుల్ కలామ్ గారికి నిజమైన నివాళి.



అప్పుడే మన దేశాన్ని బయిటి ముష్కరుల నుంచి, లోపలి రాబందుల నుంచి మనమే రక్షించుకోగలుగుతాము.
 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 029

Saturday, July 25, 2015

బృహస్పతి అష్టోత్తరమ్... తుంగభద్ర... ప్రాతః స్మరణీయుడు... ఇంకా


గోదావరికి మహా పుష్కరాలు మహా వైభవంగా జరిగాయి. పుష్కరానికి, బృహస్పతికి అవినాభావ సంబంధం వుంది.
పుష్కరాల నేపథ్యంలో బృహస్పతి అష్టోత్తర నామావళి, పుష్కర సమయంలో ఇవ్వవలసిన దానముల గురించి వివరణ.....


మన దేశానికి స్వాతంత్ర్యము సిద్ధించిన తొలినాళ్లలో సాహిత్యం  కొంతకాలం ప్రభావితమయింది.  మన జీవితాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో  నదులతో పెనవేసుకుని వుంటాయి. అందుకే నదీమతల్లిని మన ప్రజలు అంత భక్తితో కొలుస్తారు. ఈ రెండు విషయాలను ముడివేసి అధ్బుతమైన ప్రేమ కథను ‘ జాతీయ విజ్ఞానం ‘ అనే పత్రిక 1948 జూన్ సంచికలో రావూరు వ్రాసిన కథ " తుంగభద్ర "........  

పాలకునికి దార్శనికత వుండాలి. ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతాన్ని సరైన తీరులో అభివృధ్హి చేస్తే దేశానికే ధాన్యాగారం అవుతుందని, దానికి వృధాగా సముద్రంలోకి పోయే జలాలను ఒడిసి పట్టి పొలాలకు మళ్ళించడం కోసం ఎన్నో ప్రణాళికలు రచించి అమలు చేసి, కరువు కోరల్లో చిక్కుకున్న ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన మహనీయుడు కాటన్. ఆయన వర్థంతి సందర్భంగా " ప్రాతః స్మరణీయుడు సర్ ఆర్థర్ కాటన్ " ........  ఇంకా చాలా...... ఈ క్రింది లింక్ లో.....


" బాలల కథల పోటీ - 2015 " కి పొడిగించబడిన గడువు తేదీ 31 జూలై సమీపిస్తోంది. 
మీ పిల్లల్ని లేదా మీ బంధు మిత్రుల పిల్లల్ని ప్రోత్సహించి ఈ పోటీలో పాల్గొనేటట్లు చేయండి. భావి తరానికి భాషా వారసత్వాన్ని కూడా అందించండి. తెలుగు భాషను ఎప్పటికీ సజీవంగా వుంచడంలో మీ వంతుగా తోడ్పడండి. 

భవదీయుడు
శి. రా. రావు



​Visit web magazine at www.sirakadambam.com 


Vol. No. 06 Pub. No. 028

Sunday, July 12, 2015

గోదావరి మహత్మ్యం.... బాటసారి.... ముద్దుగారే యశోదా.... ఇంకా

గోదావరి మహా పుష్కరముల సందర్భంగా " గోదావరి పుష్కర మహత్మ్యం, గోదావరి అష్టోత్తర నామావళి " లను వినిపించారు డా. గోలి ఆంజనేయులు గారు తాజా సంచిక 56 వ పేజీలో.......
పల్లె జీవితాలను, పశువులతో... ప్రకృతితో పల్లె వాసుల అనుబంధాన్ని ఆవిష్కరించిన రావూరు వారి కథ " బాటసారి "  తాజా సంచిక 35 వ పేజీలో.......
మహీధర నళినీమోహన్ రావు గారు, ' బాలబంధు ' బి. వి. నరసింహారావు గారి గురించి " బాల సాహిత్య సృష్టికర్తలు " తాజా సంచిక 59 వ పేజీలో.......
అన్నమయ్య పద కీర్తన " ముద్దుగారే యశోదా " ఉషవినోద్ రాజవరం గారి స్వరంలో తాజా సంచిక 53 వ పేజీలో.......
ఇంకా చాలా విశేషాలతో తాజా సంచిక ఈ క్రింది లింక్ లో...... 
శిరాకదంబం 04_024
" బాలల కథల పోటీ - 2015 " కి రచనలు చేరవలసిన చివరి తేదీ 31 జూలై 2015 వరకూ పొడిగించడమైనది. మీ పిల్లల్ని, మీ బంధుమిత్రుల పిల్లల్ని తెలుగులో వ్రాసేలా ప్రోత్సహించి, తెలుగు భాషను సజీవంగా వుంచడానికి మీ వంతు కృషి చేయండి. 
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 027

Saturday, June 27, 2015

ఏరువాక... బాల సాహిత్య సృష్టికర్తలు...అంతర్జాతీయ యోగా దినోత్సవం..... ఇంకా

 తొలకరి వాన పడగానే రైతు వ్యవసాయ పనులకు సిద్ధం అవుతాడు. ఏరువాక  పున్నమి రోజున పనులు ప్రారంభిస్తాడు. తెలుగునాట రైతులకు అదొక పెద్ద పండుగ. క్రమంగా కనుమరుగవుతున్న ఆ సంప్రదాయం గురించి, పల్లె వాసుల భావోద్వేగాల గురించి వివరించే రావూరు వారి " ఏరువాక " కథ తాజా సంచికలో .......
మనకు జన్మనిచ్చిన తల్లిని, జన్మభూమిని, మాతృభాషని ప్రేమించనివాడు, వాటికి విలువ ఇవ్వనివాడు ఎన్ని చదువులు చదివినా, ఎంత ఎత్తు ఎదిగినా వ్యర్థమే ! వీటిని గౌరవించడం అంటే తనని తాను గౌరవించుకోవడమే ! పిల్లలకు కూడా అన్ని భాషలతో బాటు మన తెలుగు భాష లో కూడా తప్పనిసరిగా మాట్లాడడం, చదవడం, వ్రాయడం నేర్పించడం చాలా అవసరం. లేకపోతే తెలుగు భాష కనుమరుగయ్యే ప్రమాదం పొంచి వుంది. మీ పిల్లల్ని, మీకు తెలుసున్న పిల్లలని అందర్నీ ' శిరాకదంబం ' నిర్వహిస్తున్న " బాలల కథల పోటీ - 2015 " కి తెలుగులో కథలు వ్రాసేలా ప్రోత్సహించండి. వారి భావాలకు తెలుగు భాషలో అక్షరరూపం కల్పించే అవకాశం ఇవ్వండి.
వివరాలకు తాజాసంచిక ఈ క్రింది లింక్ లో .........
శిరాకదంబం 04_023 
 Visit web magazine at www.sirakadambam.com 

 Vol. No. 06 Pub. No. 026
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం