Friday, April 3, 2020

ప్రత్యక్ష శయ్య.... నేనో కవిత్వోపాసకుణ్ణి.... లిటిల్ ఇండియా.... ఇంకా....

* ప్రభువు ఇంగితం కనిపెట్టి ఆస్థాన పౌరాణికుడు ఆంధ్రమహాభారతం తెచ్చి శాస్త్రికిచ్చాడు. “ సభ్యులందరూ కత్తుల మీద పరీక్ష ” అనుకున్నారు. సభలో మహారాజు మేనమామ తొంభై యేళ్ళ వృద్ధుడు దంతులూరి వెంకటపతిరాజు భారతంలోని ‘ ఊరుభంగం ’ ఘట్టం తీయించారు. “ సంస్థానానికి తగిన ఘట్టం. శయ్యకి తగిన ఘట్టం. నా బిరుదునకిన్నీ తగిన ఘట్టం. నేనేది నిరీక్షిస్తున్నానో అదే మమ్మేలినవారు సెలవిచ్చారు. అయితే ఒక మనవి ” అని దోసిలి ఒగ్గాడు. - " శ్రీపాద కథలు – ప్రత్యక్ష శయ్య "

* నాన్న జార విడిచాడు అమ్మ గర్భంలోకి

అమ్మ పోరాడమన్నది లోకం శోకం పైకి
అమ్మ తొలిగురువు. అమ్మ ఒడిలోనే ఓనమాలు నేర్చుకుంటాం. లోకం శోకం పైకి పోరాటం చేయమన్నది అమ్మ అన్నందువల్లనే కిసలయించే వాక్యాలతో ఒంటరిగా తెగించి పోరాడుతున్నానంటారు. - “ నేనో కవిత్వోపాసకుణ్ణి ”

ఇంకో రకం వాళ్ళుంటారు. ఆ భార్యామణి గారు కావాల్సినవేవో ముందుగా చెప్పక పోగా, షాపుకెళ్ళి ఫోన్ చెయ్యమని ఆర్డరు జారీ చేస్తుందనుకుంటా! ఆయన గారు బుద్ధిగా షాపులో ప్రతి కూరముందు నిలబడి, వాటి గుణగణాలు, రంగులు, సైజులు ఫోనులో వర్ణించటం మొదలు పెడ్తాడు! - " అమెరికా ఇల్లాలి ముచ్చట్లు - లిటిల్ ఇండియా”

.... ఇంకా... చాలా.... ఈ క్రింది లింక్ లో..... 
Visit web magazine at https://sirakadambam.com/ 


Vol. No. 11 Pub. No. 013

Wednesday, March 18, 2020

హరిత సుందరి శార్వరి... మార్గదర్శి... పొత్తూరికి నివాళి... ఇంకా... చాలా...

శార్వరి ఉగాది శుభాకాంక్షలతో....
* రా. .ఉగాదీ! రా! మాకే పరిమితమైన

మా కుటుంబం లోకి నీకు స్వాగతం.! – “ వచ్చావా ఉగాదీ !! ”

గుమ్మానికి పచ్చని తోరణమౌతోంది
ఇంటింటా సంబరాల కారణమౌతోంది – “ హరిత సుందరి శార్వరి ” - ఉగాది కవితలు 

* బతుకు తెరువు కోసం వాడి కాళ్ళు, వీడి కాళ్ళు పట్టుకోవడం హేయమనీ, అనవసరమనీ అనిపించక మానదు. స్వశక్తిని నమ్ముకొని ఆత్మ విశ్వాసంతో యువత ముందడుగు వేయాలనీ శ్రీపాద వారి ప్రగాఢ కాంక్ష -

" శ్రీపాద కథలు – మార్గదర్శి


* ' ఆస్తి ' పదారంభంతో ఒక కావ్యము, ' కశ్చిత్ ' ప్రారంభంగా ఒక కావ్యము, ' వాక్ ' శబ్దముతో మొదలు పెట్టి వేరొక కావ్యము, కావ్యత్రయము గా అతి త్వరలో సమర్పిస్తాను.- " కావ్యావతరణం " 


* ‘మీ నివేదిక నాకు దిగ్భ్రాంతితో కూడిన నిరుత్సాహాన్ని కలిగించింది’ అన్నది దాని సారాంశం. గోయంకా యజమాని. పొత్తూరి వారు ఆయన దగ్గర ఒక ఉద్యోగి. అయినా అలా ఉత్తరం రాయడం ఆయనకు నచ్చలేదు. వెంటనే నిరసనగా రాజీనామా లేఖ గోయంకాకు పంపించారు. – " పొత్తూరి కి నివాళి " 

ఇంకా.... చాలా... ఈ క్రింది లింక్ లో..... 

Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 11 Pub. No. 012

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం