Thursday, February 18, 2021

" సూర్యస్తుతి ".... " పెద్ద తరంగం ".... " రాయల యుగం - స్వర్ణయుగం "... ఇంకా

 *

మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నా అందరికీ ప్రత్యక్ష దర్శనం లభించదు. అయితే రోజూ ప్రత్యక్ష దర్శన భాగ్యం కలుగజేసే దైవం సూర్యనారాయణుడు. అందుకే ఆయనను ప్రత్యక్ష దైవం అంటుంటాం. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. సూర్యరశ్మి లో భూమి మీద ఉండే జీవులన్నిటికీ అవసరమైన పోషకాలు, రక్షకాలు ఎన్నో ఉంటాయి. వాతావరణ పరిస్థితులను కూడా సూర్యుడు ప్రభావితం చేస్తాడు. భూమికి కావల్సిన వెలుతురుని అందించేది సూర్యుడే. ఇలా ఎన్నో విధాలుగా భూమి మనుగడకు, భూమి మీద జీవం మనుగడకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణభూతుడవుతున్న ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు..... " సూర్యస్తుతి "

*    

వేసంగి శలవలకి వచ్చిన నాకు, ఈ పాటలు గమ్మత్తుగా ఉండేవి! ఎందుకంటే అప్పటికే చెన్నపట్నంలో శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ, వర్ణాలూ, త్యాగరాయకృతులూ, దివ్యనామ కీర్తనలూ పాడటం వచ్చి, కాస్త గర్వం పెరిగిన రోజులవి! పైగా పదాలూ తిల్లానాలూ కూడా పాడే స్థాయికొచ్చానాయె!! ఈ తరంగాలూ, అష్టపదులూ, ఆధ్యాత్మరామాయణకీర్తనలూ బోలెడన్ని చరణాలతో, కాస్త చాదస్తపు రాగాల్తో (అని అప్పటి నా ఉద్దేశం) ఈ సంగీతం నేర్చుకోని వాళ్లు పాడుతూంటే...చెప్పొద్దూ!! నాకేవంత గొప్పగా అనిపించేది కాదు.... " పెద్ద తరంగం "

రాయల పాలనలో రాజ్యమంతటా అన్ని మతాల వారూ యథేచ్ఛగా ప్రశాంత జీవనం గడిపారని బార్బోసా అనే విదేశీయుడు పేర్కొన్నాడు. పాడిపంటలతో ఎంతో సుభిక్షంగా రాయలు రాజ్యపాలన చేసిన తీరుని విదేశీ యాత్రికులు ఎంతగానో ప్రశంసించారు. రత్నాలు రాశులుగా పోసి అమ్మడం ప్రపంచంలో ఎక్కడా లేదని కూడా వీరి రాతల వల్ల తెలుస్తోంది. 16 శతాబ్ది కాలం తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగమనే చెప్పాలి..... " రాయల యుగం - స్వర్ణయుగం "

ఇంకా చాలా... ఈ క్రింది లింక్ లో.... 

శిరాకదంబం 10_013


 

 

Visit web magazine at https://sirakadambam.com/

 Vol. No. 12 Pub. No. 012

Tuesday, February 2, 2021

త్యాగరాజ ఆరాధన... చండాలిక... గురుసన్నిధి... ఇంకా....

 *

కర్ణాటక సంగీత ప్రపంచానికి ఎనలేని ఖ్యాతిని సమకూర్చిన వాగ్గేయకారుడు త్యాగరాజు తన దేహాన్ని విడిచిన రోజు పుష్య బహుళ పంచమి. ఆ మహానుభావుని స్మరించుకుంటూ కావేరీ నది తీరాన తిరువయ్యూరు లోని ఆయన సమాధి దగ్గర ప్రతి యేటా ఆరాధనోత్సవాలు నిర్వహించడం చిరకాలంగా సంప్రదాయం. ఆరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత కళాకారులు చిన్నా పెద్దా తేడా లేకుండా ఆ సమాధి చుట్టూ కూర్చుని త్యాగరాజ పంచరత్న కీర్తనలు అలపిస్తారు. - త్యాగరాజ ఆరాధన ” 

*

రక్తసిక్తమైన కత్తి పట్టుకొని యాజ్ఞవల్క్యుడు నిల్చుని ఉండగా అతని వెనుక ధర్మాన్ని రక్షించటానికి కంకణబద్ధులైన సకల విప్రాళి సంతుష్టాంతరంగులై నిలుచుని ఉన్నారు. గార్గి నిశ్చేష్టురాలై ఉండిపోయింది. “ యాజ్ఞవల్క్యా ! నువ్వు ఓడావు. అగ్రపూజకు నువ్వు అనర్హుడివి. బ్రాహ్మణులు కత్తి పట్టేది క్షత్రియులు ధర్మం తప్పినప్పుడు కాదు. చండాలురు జ్ఞానప్రకటన చేసినపుడు అని నువ్వే స్వయంగా నిరూపించావు అని చండాలిక తల తెగిపడిన చితిమంటలు వేయి నాలుకలు ఘోషించాయి. ఆ మంటలు ఆర్పటానికి ఋషులు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి.... “ చండాలిక ”


ఆ తీగపై కోయిల వాలి...

గొంతు సవరించింది. 

మేడపై పెద్ద హాల్లో చుట్టూరా వీణలు. నా ముందు తపోదీక్షలో కూర్చొన్న మునిలా గురువు గారు. ఆయన నోటితో పాఠం చెబితే నేను అర్థం చేసుకొని వీణపై వాయించాలి. అగ్ని పరీక్షే! నా మనోభావాల్ని చదివినట్లున్నారు. "నా మీటు.. నా  బాణీ.. నీ నరనరాల్లో జీర్ణించుకుపోయాయి. అర్థంకాని వారికి ఎదురు వీణ. నీకెందుకు?" అన్నారు నవ్వుతూ! ..... " గురుసన్నిధి "

ఇంకా... చాలా... ఈ క్రింది లింక్ లో..... 

శిరాకదంబం 10_012 

Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 12 Pub. No. 011

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం