*
కర్ణాటక సంగీత ప్రపంచానికి ఎనలేని ఖ్యాతిని సమకూర్చిన వాగ్గేయకారుడు త్యాగరాజు తన దేహాన్ని విడిచిన రోజు పుష్య బహుళ పంచమి. ఆ మహానుభావుని స్మరించుకుంటూ కావేరీ నది తీరాన తిరువయ్యూరు లోని ఆయన సమాధి దగ్గర ప్రతి యేటా ఆరాధనోత్సవాలు నిర్వహించడం చిరకాలంగా సంప్రదాయం. ఆరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత కళాకారులు చిన్నా పెద్దా తేడా లేకుండా ఆ సమాధి చుట్టూ కూర్చుని త్యాగరాజ పంచరత్న కీర్తనలు అలపిస్తారు. - “ త్యాగరాజ ఆరాధన ”
*
రక్తసిక్తమైన కత్తి పట్టుకొని యాజ్ఞవల్క్యుడు నిల్చుని ఉండగా అతని వెనుక ధర్మాన్ని రక్షించటానికి కంకణబద్ధులైన సకల విప్రాళి సంతుష్టాంతరంగులై నిలుచుని ఉన్నారు. గార్గి నిశ్చేష్టురాలై ఉండిపోయింది. “ యాజ్ఞవల్క్యా ! నువ్వు ఓడావు. అగ్రపూజకు నువ్వు అనర్హుడివి. బ్రాహ్మణులు కత్తి పట్టేది క్షత్రియులు ధర్మం తప్పినప్పుడు కాదు. చండాలురు జ్ఞానప్రకటన చేసినపుడు అని నువ్వే స్వయంగా నిరూపించావు ”అని చండాలిక తల తెగిపడిన చితిమంటలు వేయి నాలుకలు ఘోషించాయి. ఆ మంటలు ఆర్పటానికి ఋషులు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి.... “ చండాలిక ”
*
ఆ తీగపై కోయిల వాలి...
గొంతు సవరించింది.
మేడపై పెద్ద హాల్లో చుట్టూరా వీణలు. నా ముందు తపోదీక్షలో కూర్చొన్న మునిలా గురువు గారు. ఆయన నోటితో పాఠం చెబితే నేను అర్థం చేసుకొని వీణపై వాయించాలి. అగ్ని పరీక్షే! నా మనోభావాల్ని చదివినట్లున్నారు. "నా మీటు.. నా బాణీ.. నీ నరనరాల్లో జీర్ణించుకుపోయాయి. అర్థంకాని వారికి ఎదురు వీణ. నీకెందుకు?" అన్నారు నవ్వుతూ! ..... " గురుసన్నిధి "
ఇంకా... చాలా... ఈ క్రింది లింక్ లో.....
Vol. No. 12 Pub. No. 011
No comments:
Post a Comment