* ఈ రూపకంలో రాధ అష్టపదులను నేను పాడగా, శ్రీకృష్ణుని పాటలను కీ.శే. రామకృష్ణ చందేశ్రీ, సూత్రధారిగా కీ.శే. శ్రీ జగదీశ్ సింగ్ ఠాకూర్, సఖియలుగా శ్రీమతులు సురేఖా కోర్డే, జయశ్రీ తట్టే, కుసుమ్ బడోద్కర్ ఆలపించారు. దీనికి సంగీతాన్ని సమకూర్చింది నేను ( అసిస్టెంట్ ప్రొడ్యూసర్/సంగీత రచన ), కీ. శే. బిరాజ్ భూషణ్ బసు, శ్రీ రామకృష్ణ చందెశ్రీ. ఈ సంగీత రూపకాన్ని గురించి అన్ని ఇంగ్లీష్ వార్తా పత్రికలూ ఎంతో కొనియాడాయి. దీని విజయం తరువాత, ఏటా జరిగే కాళిదాస్ మహా సమారోహ్ లో కూడా ఇది ఆకాశవాణి కళాకారులచే మళ్ళీ ప్రదర్శించబడింది.... ‘ వాగ్గేయకారులు ’ శీర్షికన “ జయదేవకవి ”
* భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో.....
మనభారతజాతికి నీతికి
ప్రతీకగా నిలిచినజెండా !
మనధ్యానం మనప్రాణం
మనసర్వం ఈ జెండా ! .... ‘ బాలభారతం ’ నుంచి " అదిగో మన జెండా "
* అప్పట్లో ఎంత బాగుండేది !! పిల్లలు తమిద్దర్ని వాళ్ళ దగ్గర కి పిలిపించుకుని విదేశాల్లో వింతలన్ని చూపించి పంపారు ఆ విశేషాలు అన్నీ తను టీ కొట్టు వద్ద, జిలేబీ సెంటర్ వద్ద, పునుకుల బండి వద్ద ఎక్కడ పడితే అక్కడ తన కాలనీ ఫ్రెండ్స్ తో చెబుతుంటే వాళ్ల ముఖాల్లో మెరుపులు, అవీ చూసి తాను కొనిచ్చిన జిలేబీ లూ బజ్జీలు తింటూ ఆనందించే వారితో ఎంత హాయిగా ఉండేది .. అలాంటి జీవితం లో ఒక్కసారిగా ఈ మార్పు...
... " గతకాలము మేలు " ఇంకా చాలా ... ఈ క్రింది లింక్ లో.....
Vol. No. 12 Pub. No. 010
1 comment:
Thank you for this post. Good luck.
Post a Comment