Wednesday, March 30, 2011

నిత్య నూతన ప్రసాదం

ఒకసారి హాస్యనటుడు పద్మనాభం కృష్ణా జిల్లా కైకలూరులో తన బృందంతో ' శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం ' నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంతలో కొంతమంది కుర్రాళ్ళు అక్కడికి చేరుకున్నారు. నాటకం చూడాలి. ఎలా ? తమ దగ్గర డబ్బులు లేవు. టికెట్ లేకపోతే లోనికి రానివ్వరు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎలాగైనా నాటకం చూడాలి.

ఇంతలో ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్న యువకుడికి ఓ ఆలోచన వచ్చింది. అంతే ఓ ఇనుప తీగ సంపాదించి ఆ నాటకం ప్రదర్శిస్తున్న హాలుకి విద్యుత్ సరఫరా చేస్తున్న తీగలపైకి విసిరాడు. ఇంకేముంది..... లైవ్, న్యూట్రల్ వైర్లు కలిసిపోయి హాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. నాటకం మొదలు కాలేదు. సిబ్బంది విషయాన్ని గమనించి సరిచేసి విద్యుత్ సరఫరా పునరిద్ధరించడానికి అరగంట పట్టింది. ఈలోపు హాలంతా గందరగోళం. సందట్లో సడేమియాలాగ చీకట్లో ఈ మిత్రబృందం హాల్లో జొరబడ్డారు. నాటకం మొదలయ్యింది. హాయిగా కూర్చుని ఆసాంతం చూసి ఆనందించిన ఆ మిత్రబృందానికి సారధ్యం వహించిందీ, విద్యుత్ సరఫరా ఆగిపోయేటట్లు చేసిందీ వరప్రసాద్ అనే అబ్బాయి. ఇది జరిగింది 1961 వ సంవత్సరంలో.... అతనే తరవాత కాలంలో అనేక నాటకాలు వేసి, ఆపైన సినిమా నటుడిగా విజృభించాడు.

విపత్కర పరిస్థితుల్ని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాడు.
వైకల్యాలను సౌకర్యాలుగా చేసుకున్నాడు
అపజయంలోనూ విజయాన్ని సాధించాడు
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు

ఆయన అభినయంలో సహజత్వం ఉట్టిపడుతుంది
ఆయన వాచికంలో విరుపులు మలుపులు తిరుగుతాయి
ఆయన నటనలో నవరసాలు నాట్యమాడతాయి
ఆయన గళంలో సంభాషణలు విన్యాసాలు చేస్తాయి

ఆయనకు అపజయమేమిటి ?
ఆయనకు వైకల్యమేమిటి ?
అసలైన కళాకారుడు ఓటమిని అంగీకరించాడు
ఓటమిలోనే గెలుపును వెదుక్కుంటాడు

నూతన్ ప్రసాద్ కూడా అదే చేసాడు. ఆయన నట జీవితాన్ని బలి తీసుకుందనుకున్న విధిని ఎదిరించాడు. గెలిచాడు. ప్రమాదవశాత్తూ వచ్చిన వైకల్యం శరీరానికే కానీ నటనకు కాదని నిరూపించాడు. తర్వాత కొన్ని చోట్ల ఆయన నటించాడు. మరికొన్నిచోట్ల ఆయన స్వరం నటించింది. నటుడిగా ప్రేక్షకులను అలరించాడు. ఆయన నటన అజరామరం. తెలుగు చిత్రసీమ ఉన్నంతవరకూ నిలిచి వుంటుంది. అలాంటి వైవిధ్యమున్న నటులు ఇటీవలి కాలంలో అరుదు.

ఆయన నటన తెలుగు తెరకు నిత్యనూతన ప్రసాదం 
ఆయన లేకపోయినా ఆయన నటన కలకాలం నిలిచే వుంటుంది

నూతన్ ప్రసాద్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ................ 

' చలిచీమలు ' చిత్రంలో తుమ్మలపాటి చినపద్దయ్య గా నూతన్ ప్రసాద్ సంభాషణలు వినండి...... 





Vol. No. 02 Pub. No. 187

నూటొక్క తీరాలకు చేరిన అందగాడు

 నూటొక్క జిల్లాలకు అందగాడు 
నవరసాల నటనా దురంధుడు 
నూతన ప్రసాద్ మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, తెలుగు ప్రేక్షకలోకానికి తీరని లోటు 
ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ................



Vol. No. 02 Pub. No. 186

Tuesday, March 29, 2011

వందనం గిరి నందినీ ప్రియనందనా...

వందనం గిరి నందినీ ప్రియనందనా 
వందనం ఇదే వందనం ...............
వందనం కరివదన కరుణా సదన 
నీ పదకమలముల కడ 
వందనం ఇదే వందనం ................ 

అయ్య కడ ఐశ్వర్యమడిగి
అమ్మ కడ సౌభాగ్యమడిగి ..........
నెయ్యమున నీ చరణదాసులకియ్యవా....
దేవాదిదేవా....... దేవాదిదేవా.......
వందనం ఇదే వందనం ...... వందనం గిరి నందినీ ప్రియనందనా ......

వెన్నవలె వెన్నెలలవలె 
క్రొన్ననల వలె మెత్తనిది నీయెద.........
నేతవని వరదాతవని సంజాతవని
దేవాదిదేవా........ దేవాదిదేవా........
వందనం ఇదే వందనం ...... వందనం గిరి నందినీ ప్రియనందనా ......

మధురకవి మహాకవి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి సాహిత్యాన్ని 
బండారు చిట్టిబాబు గారి స్వరకల్పనలో 
మధుర గాయని శ్రీమతి నీరజ విష్ణుభొట్ల 
ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం కోసం ఆలపించిన ఈ గీతాన్ని ఇక్కడ వినండి.  



Vol. No. 02 Pub. No. 185

Monday, March 28, 2011

నాన్నగారి జన్మదినం

 కుటుంబంలో నాన్నగారి పాత్ర చాలా ముఖ్యమైనది. కుటుంబ సంక్షేమం ఆయన భుజస్కందాలపైన వుంటుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరి మంచి చెడ్డలు చూసే బాధ్యత ఆయనదే !

ఒకప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా ఒకే కుటుంబంలా వుండేది. ఆ కుటుంబంలో పెద్దగా, అందరి మంచి చెడ్డలూ కనిపెడుతూ, అందరి ఎదుగుదలకూ దోహదపడుతూ పరిశ్రమలో అందరిచేత ఆప్యాయంగా నాన్నగారూ అని పిలిపించుకున్న మహానుభావుడు...... నాన్నగారు అన్న పదానికి అసలైన నిర్వచనం నాగయ్య గారు.

' తన ' అనే స్వార్థం ఆయన జోలికి రాలేదు.
ఆకలి అనే మాట కళాకారుడి నోట వినడానికి ఇష్టపడని దయార్ద్రహృదయుడు.

అలాంటి బహుముఖ ప్రజ్ఞావంతుడు, అలాంటి మహోన్నత వ్యక్తిని తెలుగు చిత్ర పరిశ్రమ మళ్ళీ చూడలేదేమో ! 

నాగయ్య గారి జన్మదినం { మార్చి 28 ) సందర్భంగా కళాంజలులు

నాగయ్య గారిపైన గతంలోని టపాలు -

న భూతో న భవిష్యతి ' నాగయ్య '

http://sirakadambam.blogspot.com/2009/11/blog-post_05.html 

సంగీతమయం సమస్తం

http://sirakadambam.blogspot.com/2010/06/blog-post_07.html

 నాన్నగారు 'నాగయ్య'
 http://sirakadambam.blogspot.com/2009/12/blog-post_30.html     

అపర త్యాగయ్య

http://sirakadambam.blogspot.com/2010/03/blog-post_29.html  

 నా ' త్యా ' గయ్య

http://sirakadambam.blogspot.com/2010/12/blog-post_30.html 

 

Vol. No. 02 Pub. No. 184

Sunday, March 27, 2011

రంగస్థల దినోత్సవం

కళలు మానవ జీవితంలో అంతర్భాగం. వినోదానికి, వికాసానికి ఆధారం కళలు. మానవుడి మేదోరూపం కళలు. ఒక్కో మనిషిలో ఒక్కో రకమైన సృజనాత్మకత వుంటుంది. వాటి బాహ్య రూపమే కళారూపం. ఒక ప్రాంతం లేదా ఒక దేశం యొక్క సంస్కృతికి ప్రతీకలు కళారూపాలు.  వాటిని కలిపే వారధి కూడా ఈ కళారూపాలే ! 

భాషకు అందనిది కళ 
ప్రాంతాలకు అతీతం కళ

రంగస్థలం అనగానే మనకి సాధారణంగా గుర్తుకొచ్చేవి నాటకాలు. నిజానికి రంగస్థలం మీద ప్రదర్శించేవి కేవలం నాటకాలు మాత్రమే కాదు. సంగీత కచేరీలు, నాట్య ప్రదర్శనలు, యక్షగానాలు, భాగవత మేళాలు, హరికథలు, బుర్రకథలు ..... ఇలా ఎన్నెన్నో రకాల కళారూపాలు రంగస్థలం మీద ప్రదర్శిస్తారు. అంతేకాదు మనుష్యులు అజ్ఞాతంగా వుండి ఆడించే బొమ్మలాటలు లాంటి ప్రక్రియలు కూడా రంగస్థలం మీద ప్రదర్శించేవే ! ఇవన్నీ సజీవ కళలు. కళాకారులు మన కళ్ళ ముందు ప్రదర్శించే కళారూపాలన్నీ దాదాపుగా రంగస్థలం మీద ప్రదర్శించేవే !
ఆ రంగస్థలం పరిస్థితి ఈనాడు అంత ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా తెలుగు రంగస్థలం. దానికి జవజీవాలు సమకూర్చాల్సిన బాధ్యత ప్రజలందరి మీదా వుంది.

ఈరోజు ( మార్చి 27 ) ప్రపంచ రంగస్థల దినోత్సవం
ఈ సందర్భంగా ప్రాంతాల, దేశాల మధ్య సాంస్కృతిక రాయబారులైన 
రంగస్థల కళాకారులందరికీ శుభాకాంక్షలు

గత సంవత్సరం టపా లింక్ - 




Vol. No. 02 Pub. No. 183

Saturday, March 26, 2011

' పాతాళభైరవి ' లో ద్విపాత్రాభినయం

 పాతాళభైరవి చిత్రం ఎంతటి ప్రాచుర్యం పొందిందో అందులో నటించిన నటులకు కూడా అంతే ప్రాచుర్యం తెచ్చి పెట్టింది. అందులో హాస్యనటుడు బాలకృష్ణ ఒకరు. అంజి పాత్రలో ప్రసిద్ధి చెందిన బాలకృష్ణ ఆ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసారనే విషయం చాలామందికి తెలీదు. 
నెల్లూరులో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్న వల్లూరు బాలకృష్ణ నాటకాల్లో నటిస్తూ వుండేవారు. ఆ రంగస్థలానుభవం ఆయన్ని రేలంగితో బాటు ' శ్రీకృష్ణ తులాభారం ' చిత్రంలో చిన్న వేషం వేసే అవకాశం ఇచ్చింది. తర్వాత విజయావారి ' షావుకారు ' చిత్రంలో సున్నం రంగడు ముఠాలో సభ్యునిగా నటించారు. అయితే అదే విజయ సంస్థ తర్వాత నిర్మించిన ' పాతాళభైరవి ' చిత్రంలో అంజి పాత్ర  కోసం బాలకృష్ణకు మేకప్ టెస్ట్ చేసారు. కానీ ఆ పాత్రకు ఆయన పీలగా వున్నారని మొదట్లో తీసుకోలేదు. అయితే బాలకృష్ణను నిరాశ పరచడం ఇష్టం లేక దర్శకులు కే. వి. రెడ్డి గారు భూతం వేషం ఇచ్చారు. కానీ అంజి పాత్రకు సరైన నటుడు దొరకకపోవడంతో చివరకు బాలకృష్ణ చేతనే ఆ వేషం కూడా వేయించారు. దాంతో బాలకృష్ణ ఆ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసినట్లయింది. భూతం వేషంలో వున్నది బాలకృష్ణే అని ప్రేక్షకులు గుర్తించలేనంతగా మలిచారు కే. వి. రెడ్డి గారు.

Vol. No. 02 Pub. No. 182

Friday, March 25, 2011

అర్థరూపాయి నిజాయితీ



చిన్నప్పటి చిలిపి చేష్టలు కొన్నిటిని ఇప్పుడు తల్చుకుంటుంటే వింతగా అనిపిస్తాయి. చీకూ చింతా లేని జీవితం. హాయిగా ఆడుతూ పాడుతూ గడిపేసాం. ఇప్పటి పిల్లలకు అంత అదృష్టం లేదేమోననిపిస్తుంది. నేను ఘంటాపధంగా చెప్పగలను.... మాది బంగారు బాల్యం అని. ఒక ప్రక్క పెద్దలు ఎంత కట్టడి చేస్తున్నా అంతా స్వేచ్ఛా అనుభవించాం. ప్రతి మనిషి జీవితంలోనూ బాల్యం ఒక రసవత్తర ఘట్టం. జీవిత చరమాంకంలో నెమరువేసుకోవడానికి మిగిలేవి ఈ జ్ఞాపకాలే ! ఆ మధుర జ్ఞాపకాల్ని కోల్పోతున్న ఇప్పటి పిల్లల్ని చూస్తుంటే జాలి వేస్తూ వుంటుంది. సరే ! విషయానికి వద్దాం........

............ మొత్తం కథనం స్వ ' గతం ' - 2  క్లిక్ చేసి కొంచెం శ్రమ తీసుకుని క్రిందవరకూ వెళ్లి చదవండి. 

Vol. No. 02 Pub. No. 181

దర్శకుడెవరు ? - జవాబు

   కనుక్కోండి చూద్దాం - 39 - జవాబు 

జగపతి వారి ఈ చిత్రం 1970 లో వచ్చింది. 

1 ) ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఎవరు ?
జవాబు : అక్కినేని సంజీవి. ఆయన ఇంకా ధర్మదాత, అత్తగారు కొత్తకోడలు, నాటకాలరాయుడు, మల్లమ్మ కథ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. 
 
2 ) ఆ దర్శకుడు అంతకుముందు ఏ శాఖలో ప్రసిద్ధుడు ? 
 
జవాబు : ఎడిటింగ్. అక్కినేని సంజీవి గారు ఎడిటింగ్ లో నిష్ణాతుడు. విదేశీ చలన చిత్రోత్సవాల్లో పాల్గొనే చిత్రాలకు మన తెలుగు చిత్రాల నిడివి ఎక్కువైనపుడు వాటిని అర్థవంతంగా కుదించి పంపించిన ఘనత సంజీవి గారిది. 
అంతేకాదు. అప్పట్లో మనకు కొత్తైన సబ్ టైట్లింగ్ ప్రక్రియను సరైన పరికరాలు లేకుండా మామూలు లాబరేటరీలో అత్యంత ప్రతిభావంతంగా రూపొందించి చిత్రోత్సవాలకు పంపించారు. ఆ తర్వాత చాలా కాలానికి గానీ సబ్ టైట్లింగ్ పరికరం మన దేశానికి రాలేదు. సంజీవి గారు అలా నిడివి కుదించి సబ్ టైట్లింగ్ చేసిన చిత్రాల్లో నమ్మినబంటు, అంతస్తులు, పదండి ముందుకు, సాక్షి లాంటి చిత్రాలు వున్నాయి.
 
పైన ఇచ్చిన ప్రశ్నలకు రాజేంద్రకుమార్ దేవరపల్లి గారు సరైన సమాధానమే ఇచ్చారు.  వారికి ధన్యవాదాలు. 
మనవి :  అక్కినేని సంజీవి గారి ఫోటో నాకు దొరకలేదు. మిత్రులు ఎవరిదగ్గరైనా వుంటే పంపగలరు.

Vol. No. 02 Pub. No. 180a

Thursday, March 24, 2011

దర్శకుడెవరు ?

   కనుక్కోండి చూద్దాం - 39 

జగపతి వారి ఈ చిత్రం 1970 లో వచ్చింది. 

1 ) ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఎవరు ?
2 ) ఆ దర్శకుడు అంతకుముందు ఏ శాఖలో ప్రసిద్ధుడు ?

  


Vol. No. 02 Pub. No. 180

Wednesday, March 23, 2011

స్వాతంత్ర్య పోరాటంలో బలిదాన దినం

  S. Bhagat Singh, Rajguru and Sukhdev live no longer. In their death lies their victory let there be no mistaking it. The bureaucracy has annihilated the mortal frame. The nation has assimilated the immortal spirit.  Thus shall Bhagat Singh, Rajguru and Sukhdev live eternally to the dismay of the bureaucracy. . . . To the nation, Bhagat Singh and colleagues will ever remain the symbols of martyrdom in the cause of freedom. 
- The Free Press Journal ( 24th March 1931 )

పరాయిపాలనలో మగ్గుతున్న భారతమాతకు విముక్తి కల్పించడానికి తమ ప్రాణాలకు తెగించి పోరాడిన ముగ్గురు స్వాతంత్య వీరులు షహీద్ భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు లు చివరకు ఆ ప్రాణాలనే త్యాగం చేసిన రోజు ఈరోజు.

ఉద్యమానికీ, యువతకూ నేటికీ నమూనాగా నిలిచిన మహావీరులను పరాయి పాలకులు నిర్దాక్షిణ్యంగా ఉరి తీసిన రోజు ఈరోజు.

జీవించింది అతి తక్కువకాలమైనా తరతరాలుగా ప్రజల గుండెల్లో కొలువు దీరిన స్వాతంత్ర్య పోరాట వీరుల బలిదానం జరిగిన రోజు

భారత స్వాతంత్ర్య పోరాట యోధులైన షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల ఉరి శిక్షను ప్రజల ఆగ్రహానికి గురికావలసి వస్తుందనే భయంతో అమలు చెయ్యాల్సిన సమయానికంటే ముందుగా అమలు చేసింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం.

మనం ఈనాడు అనుభవిస్తున్న స్వేచ్చకు ఆనాటి స్వాతంత్య పోరాట యోధుల త్యాగమే కారణం. ఆ స్వేచ్చ అయాచితంగా ఒక్కరోజులో రాలేదు. ఎన్నెన్నో పోరాటాలు. మరెన్నో బలిదానాలు. ఫలితమే ఈనాటి ఈ స్వేచ్చ. 
దాదాపుగా ఈనాటి తరం ఈ స్వేచ్చ వెనుక చరిత్రను, దాన్ని ప్రసాదించిన మహనీయుల త్యాగాలను తెలుసుకోలేని ఈ తరుణంలో వారిని, వారి త్యాగాలను స్మరించుకోవడం, నవతరానికి తెలిసేటట్లు చెయ్యడం చాలా అవసరం. లేకపోతే దశాబ్దాల స్వాతంత్ర్య పోరాట స్పూర్తికి తూట్లు పోడిచినట్లే ! 

గత తరాలనుంచి ప్రస్తుత తరాలు...... ప్రస్తుత తరాల నుంచి భావి తరాలు...  ఈ స్పూర్తిని గురించి తెలుసుకోవాలి. అప్పుడే మనమేమిటో మనం తెలుసుకోగలుగుతాం. మన పరిస్థితి ఏమిటో మనకి అర్థమవుతుంది. ఉద్యమ లక్ష్యాలంటే ఏమిటో తెలుస్తుంది. నిజమైన త్యాగం అంటే ఏమిటో అర్థం చేసుకుంటాం. ఎలాంటి విషయాల మీద, ఏ పద్ధతిలో పోరాటం చెయ్యాలో దిశా నిర్దేశం జరుగుతుంది. ఉద్యమాలు వ్యాపారమైపోయిన ఈ రోజుల్లో భావితరాలైనా దేనికి ఉద్యమాలు చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఉద్యమ లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకోవాలో అర్థం చేసుకోగలుతారు. ఈ విచక్షణా జ్ఞానం వలన నాయకుల మాటలను గొర్రెల్లా అనుసరించే అవసరం వుండదు.

  అమరవీరులు షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లను ఉరి తీసి ఎనభై సంవత్సరాలు పూర్తయిన  సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ...........



Vol. No. 02 Pub. No. 179

Tuesday, March 22, 2011

జానపద వీరుడు

వలపు పాటలు పాడి యువరాణి మనసు దోచుకునే కథానాయకుడు
అమాయకత్వంతో యువరాజు మనసును రంజింపజేసే కథానాయకి
వారి మధ్య రాహుకేతువుల్లా బావమరదులూ, మాంత్రికులూ వగైరా
సప్తసముద్రాలు, చిలక ప్రాణాలూ, సాహసోపేత విన్యాసాలూ వగైరా


ఇవన్నీ స్వేదం చిందించే జానపదుల సేద తీర్చేవే !
వారి మనసులకు ఉల్లాసం, ఉత్సాహం కలిగించేవే !
అందుకే చందమామ కథలకు అంత పాచుర్యం  !
అందుకే జానపద చిత్రాలంటే అందరికీ అంత మోజు !

 జానపద చిత్రం అనగానే కత్తియుద్ధాలు   

 జానపద చిత్రం అనగానే మంత్రతంత్రాలు
 జానపద చిత్రం అనగానే రాజరికాలు
 జానపద చిత్రం అనగానే అంతఃపురాలు వగైరా వగైరా

జానపద చిత్రం అనగానే గుర్తుకొచ్చేది కాంతారావు
ఆయన అసలు పేరు ఏదైనా ప్రేక్షకులకు కత్తి కాంతారావు 
ఆయన గుర్రమెక్కితే హర్షనాదాలు 
ఆయన కత్తి తిప్పితే జయ జయధ్వానాలు

జానపద వీరునిగానే కాక సాంఘిక చిత్రాల సామ్రాట్టుగా కూడా కాంతారావు గారు నీరాజనాలు అందుకున్నారు.
తాడేపల్లి లక్ష్మీకాంతారావు గారి ద్వితీయ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ.......

కాంతారావు గారి మీద గతంలోని టపా -
కత్తి కాంతారావు

Vol. No. 02 Pub. No. 178

Monday, March 21, 2011

భావి సంగీత దర్శకురాలు...!

 ఇక్కడ మీకు ఓ భావి సంగీత దర్శకురాలు కనిపిస్తుంది. నిన్న అనుకోకుండా ఆమె పాట కంపోజ్ చేసుకుంటుంటే కంటపడింది. అంతే ! ఫోటోలు తీసేశాను.

మీరు కూడా ఇవన్నీ చూసి ఈ ఫోటోలకు వ్యాఖ్యలు రాయడానికి ప్రయత్నించండి.



Vol. No. 02 Pub. No. 177

Sunday, March 20, 2011

చందమామ వచ్చే

 చందమామ వచ్చే 
జాబిల్లి వచ్చే 
కొండెక్కి వచ్చే
వెలుగు పూలు తెచ్చే 

నిన్న ( 19 -03 -2011 ) అర్థరాత్రి దివినుండి దిగి వచ్చి కనువిందు చేసిన చందమామను వీక్షించండి........

ఫోటోగ్రఫీ : ఎస్. ఉదయ్, బి. ఎస్సీ. - విస్కాం ( ద్వితీయ ) 




Vol. No. 02 Pub. No. 177

Saturday, March 19, 2011

రంగు రంగుల వసంతం


ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ
వర్ణచక్రంలో ఎన్నెన్నో వర్ణాలు
సంతోషం, విషాదం, సుఖం, దుఃఖం 
జీవితంలో  ఎన్నెన్నో పార్శ్వాలు 

రంగుల మయమీ ప్రపంచం 
రంగుల కల ఈ జీవితం 
అందుకే విషాదాలని ప్రక్కన పెట్టి 
నవవసంతం కోసం వసంతాలాడుదాం !


 మిత్రులందరికీ హోలీ శుభాకాంక్షలు





గత సంవత్సరం టపా -


స్వగతంలో


Vol. No. 02 Pub. No. 176

Thursday, March 17, 2011

ముళ్ళపూడి ముత్యాలు

*  " నేను సిగరెట్లు త్రాగడం మానేసాను తెలుసా ? " అన్నారు దర్పంగా ఆరుద్ర.
" అదేం పెద్ద గొప్ప ! నేను అలా చాలాసార్లు మానేసాను " అన్నారు ముళ్ళపూడి వారు.

  * ఒకాయన ముళ్ళపూడి వారి దగ్గరకు వచ్చాడు. ఆ మాటా, ఈ మాటా మాట్లాడుతూ ఆయన రమణ గారితో " మద్రాసులో ఎక్కువగా అరవ వాళ్ళే వుంటారు కదా ! వాళ్ళ మధ్యలో తెలుగు వాళ్ళను పోల్చుకోవడం ఎలా ? " అనడిగాడు. దానికి రమణ గారు తన మార్కు జవాబిచ్చారు. 

" ఏముందీ ? మీరు పేపర్ కొని చదువుకుంటుంటే, మధ్యలో ఆ పేపర్ని ఎవరు అడిగి తీసుకుంటారో వాడే తెలుగు వాడు " అన్నారు. 


* " ఏమిటండీ మీ వ్రాత ఇలా వుంటుంది ? " అన్నాడట ఓసారి ముళ్ళపూడి వారి పుస్తకాన్ని ప్రచురణకు సిద్ధం చేస్తున్న కంపోజిటర్. 
" అందుకేనయ్యా ! నా రాత ఇలా వుంది " అని ముళ్ళపూడి వారి సమాధానం.  


Vol. No. 02 Pub. No. 175

నటి, నర్తకి - జవాబులు

    కనుక్కోండి చూద్దాం - 38_జవాబులు  


 1 . ఈ ప్రక్క ఫోటోలో వున్న నటి, నర్తకి ఎవరు ?
జవాబు : అనురాధ 

2 . ఆమె అసలు పేరు ఏమిటి ?

జవాబు : రాజ్యలక్ష్మి 

3 . ఆమె కథానాయికగా నటించిన చిత్రం ఏది ? 
జవాబు : పంచకల్యాణి.
అప్పట్లో ముగ్గురు రాజ్యలక్ష్మిలు చిత్ర పరిశ్రమకు వచ్చారు. మొదటి ఇద్దరూ శంకరాభరణం రాజ్యలక్ష్మి, హరిజన్ రాజ్యలక్ష్మి కాగా, మూడవవారు పంచకల్యాణి రాజ్యలక్ష్మి అనే అనురాధ. 

ఒకటో క్లూ - మూడవ ప్రశ్నకు జవాబును అప్పట్లో  రెండవ ప్రశ్న జవాబుకు జతచేసి పిలిచేవారు. 
రెండో క్లూ - ఆమె అసలు పేరుతో అప్పట్లో ముగ్గురు నటీమణులు చిత్రరంగంలోకి వచ్చారు.

Vol. No. 02 Pub. No. 169a

Wednesday, March 16, 2011

ఆదర్శజీవి - అమరజీవి

 మహనీయులు మహోన్నత ఆశయాలకోసం పుడుతుంటారు
ఆ ఆశయ సాధనకోసం తమ ప్రాణత్యాగానికి సైతం వెనుకాడరు

మనిషన్న ప్రతివాడికీ కొన్ని ఆశలు, ఆశయాలు వుంటాయి  
వాటిని నెరవేర్చుకోవడానికి పట్టుదల, చిత్తశుద్ధి వుండాలి

ఆశయ సాధనలో మనిషి ఉన్మాది కాకూడదు
మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి

ఉన్నతమైన లక్ష్యం, ఖచ్చితమైన ప్రణాళిక వున్న మనిషి తప్పక విజయం సాధిస్తాడు
అనుకున్నది నెరవేరడానికి, లోక కల్యాణానికి అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనుకాడడు

అలాంటి ఓ మహనీయుడు అమరజీవి పొట్టిశ్రీరాములు
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమించి తన ఆమరణ నిరాహారదీక్షతో  ఆ ఆశయాన్ని సాధించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు.

ఆయన జీవితం ఉద్యమకారులకు ఆదర్శం
ఆయన త్యాగం నిరసనకారులకు ఓ పాఠం

తన ఆశయం సాధన కోసం 58 రోజుల అకుంఠిత దీక్ష చెయ్యడం, ఆ దీక్షలోనే తన ప్రాణం కోల్పోవడం, ఆయన ప్రాణ త్యాగంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం చివరికి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ఎలా సాధ్యమయ్యాయో బహుశా ఇప్పటి నాయకులమనుకునే వాళ్లకు అర్థం కాకపోవచ్చు.

ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ఆయన అనుసరించిన పంథాను ఇప్పటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకులు అనుసరిస్తే తప్పక వారి ఆశయం నెరవేరుతుంది. ఆయన త్యాగాన్ని స్పూర్తిగా తీసుకుని నిస్వార్థంగా ఉద్యమిస్తే తప్పక వారిని నమ్ముకున్న ప్రజల కల నెరవేరేది. అప్పుడు వందలమంది తమ జీవితాలను పణంగా పెట్టనవసరం లేదు. ఎవరినీ తిట్టనవసరం లేదు. బందుల పేరుతో రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్యుల ఆకలితో అడుకోనవసరం లేదు. బంగారం లాంటి విద్యార్థుల భవిష్యత్తును బలి చెయ్యనక్కరలేదు. సంస్కృతికి చిహ్నాలైన విగ్రహాలను ధ్వంసం చేసి, ఆ చర్యను సమర్ధించి తమ అజ్ఞానాన్ని లోకానికి చాటుకోనక్కరలేదు. కేవలం ఒక్క నాయకుడైనా పొట్టి శ్రీరాములు గారిలా చిత్తశుద్ధితో, దీక్షతో..... 58 రోజులు అక్కరలేదు...... అందులో సగం రోజులు చేస్తే చాలు..... ప్రత్యేక రాష్ట్రం వచ్చి తీరుతుంది.

ఇప్పటికైనా ప్రజల భావోద్వేగాలతో ఆడుకోకుండా, ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చకొట్టకుండా...... ఈ ఉద్యమ ఆశయం నిజంగా ప్రత్యేక రాష్ట్ర సాధనే అయితే, ఈ ఉద్యమం నిజంగా స్వార్థరహిత ఉద్యమమే అయితే..... పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. తమ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి పూనుకోవాలి.

అమరజీవి బాట ఉద్యమ విజయానికి మార్గదర్శి 

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన్ని, ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ ............

అమరజీవిపై గతంలో రాసిన తపాల లింకులు ........... 

ఆశయ సాధనలో అమరజీవి

 అమరజీవి ఆత్మఘోష

Vol. No. 02 Pub. No. 174

Tuesday, March 15, 2011

రాముడి సాయం



నాగయ్య గారు నిర్మించిన ' రామదాసు ' చిత్రం ఆయన్ని కష్టాల్లో పడేసింది. ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సందర్భంగా నాగయ్య గారికి సహాయం చెయ్యడానికి చిత్ర పరిశ్రమ నడుం కట్టింది. ఆ విషయాలు చర్చించడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్రరంగ ప్రముఖులతోబాటు నటుడు రాజనాల మాట్లాడుతూ......


" సినిమా వాళ్లకి సహాయం చెయ్యడానికి ఎవరు మాత్రం ముందుకొస్తారు ? సాక్షాత్తూ శ్రీరాముడే సహాయం చెయ్యాలనుకోడు. ఇంతకాలం మనమందరం ఆయన్ని దశరథ రాముడు, పట్టాభిరాముడు, అయోధ్యరాముడు, జగదభిరాముడు అని పిలుచుకునేవాళ్ళం. ఆయన మెచ్చుకుని సహాయం చేసేవాడు. మరి ఇప్పుడు మనమేమో దొంగరాముడు, తోట రాముడు, బండరాముడు, బికారి రాముడు అంటూ సినిమాలకు రకరకాల పేర్లు పెడుతున్నాం ! ఇంక ఆయనేం సహాయం చేస్తాడు ? " అన్నారు.


Vol. No. 02 Pub. No. 173

Monday, March 14, 2011

మాట్లాడే బొమ్మలకు ఎనభైఏళ్లు

" All Living, Breathing 100% Talking Peak Drama, Essence of Romance, Brains and Talents unheard of under one banner "

.... ఇదీ మొదటి భారతీయ టాకీ ' ఆలం అరా ' చిత్రం ప్రచారానికి ఉపయోగించిన పోస్టర్ లోని వాక్యాలు. అందరికీ ఉత్కంఠ.... తెర మీద బొమ్మలు కదలడమే విచిత్రమనుకుంటుంటే అవి మాట్లాడదేమిటి ? అని. ఆ ఉత్కంఠకు తెరపడింది 1931 మార్చి 14 వ తేదీన. ఆరోజు బొంబాయిలోని మేజస్టిక్ సినిమాలో  ' ఆలం ఆరా ' చిత్రం విడుదలయింది.

భారతీయ సినిమా మాటలు నేర్చి ఎనభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చిత్ర రంగ అభివృద్ధికి కృషి చేసిన, చేస్తున్న అందరికీ శుభాకాంక్షలు. 

..........  ఈ చిత్ర కథ, నిర్మాణ విశేషాలు చిత్రమాలిక లింక్ లో చదవండి.  

 

 Vol. No. 02 Pub. No. 172

Sunday, March 13, 2011

విధ్వంసం - విలయం

 గతవారం వెంట వెంటనే జరిగిన సంఘటనలు గమనించాక ఓ రకమైన స్తబ్దత ఏర్పడింది. ఏమని స్పందించాలో తెలియని పరిస్థితి. స్పందించకుండా ఉండలేని పరిస్థితి. ఒకటి ప్రకృతి సృష్టించిన విలయమైతే మరొకటి మనకి మనమే సృష్టించుకున్న విధ్వంసం.                                     

  ఆత్మహత్యా సదృశము
                 
 
ఠీవిగా నిలబడ్డ తెలుగు తేజం నేలకొరిగింది 
తెలుగుజాతి ఆత్మగౌరవం వీధిపాలయింది   

విగ్రహాలను కేవలం రాతిబోమ్మలుగా చూస్తే
అరాచకమైన పనులు రాతిమనుషుల్లా చేస్తే

అనుకున్నది నెరవేరుతుందా ? ఆశయం సిద్ధిస్తుందా ?
మన గౌరవాన్ని మనమే నేలపాలు చేసుకోవడం తప్ప  

 రాష్ట్రం సమైక్యంగా వున్నా, రెండుగా చీలినా
మనమందరం తెలుగువారం..మనది తెలుగు జాతి

అది గమనించి స్వార్థ రాజకీయాల ముసుగు మనమే తొలగించాలి
లేకుంటే ఇలాంటి సంఘటనలు మనకు ఆత్మహత్యా సదృశాలవుతాయి

  ప్రకృతి విలయ తాండవం  

ప్రకృతి మళ్ళీ కన్నెర్ర చేసింది 
అన్నిటా మిన్న అనిపించుకున్న దేశం 
అంతులేని విషాదంలో మునిగిపోయింది.
నిన్నటి వరకూ ప్రపంచ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసిన దేశం.. నేడు కనీ వినీ ఎరుగని నష్టాన్ని చవి చూసింది. వారి సాంకేతిక పురోగతి ఇప్పుడు వారి మనుగడకే సవాల్ విసిరింది. అణువిస్పోటనం వారినే కాదు ప్రపంచాన్నే వణికిస్తోంది. జపాన్ ప్రజల కడగండ్లు తీరేదేప్పుడో.... మళ్ళీ జపాన్ కు పూర్వ వైభవమెన్నడో.... 

Vol. No. 02 Pub. No. 171

Thursday, March 10, 2011

చిత్ర విచిత్ర పరిశ్రమ


 చిత్ర విచిత్రమీ చలనచిత్ర పరిశ్రమ ! అందమౌ సుధా 
పాత్ర సుకాల యాత్రయని భ్రాంతిని గొల్పెడు స్వప్నసీమ ! ఏ 
గోత్రములేని హీనునకు గొప్ప చరిత్రను గూర్చు జాతకాల్
రాత్రికి రాత్రి మార్చనిది రంగుల రాట్నం వెంకటేశ్వరా ! 


ఇది గతతరం ప్రముఖ రచయిత వీటూరి గారు  తన సినిమా అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాసుకున్న పద్యం.

Vol. No. 02 Pub. No. 170

Wednesday, March 9, 2011

నటి, నర్తకి

    కనుక్కోండి చూద్దాం - 38  


 1 . ఈ ప్రక్క ఫోటోలో వున్న నటి, నర్తకి ఎవరు ?

2 . ఆమె అసలు పేరు ఏమిటి ?

3 . ఆమె కథానాయికగా నటించిన చిత్రం ఏది ?

ఒకటో క్లూ - మూడవ ప్రశ్నకు జవాబును అప్పట్లో  రెండవ ప్రశ్న జవాబుకు జతచేసి పిలిచేవారు. 
రెండో క్లూ - ఆమె అసలు పేరుతో అప్పట్లో ముగ్గురు నటీమణులు చిత్రరంగంలోకి వచ్చారు.

Vol. No. 02 Pub. No. 169

Tuesday, March 8, 2011

శతదినోత్సవ మహిళ

ఈరోజు నూరవ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 
అసలు ఇప్పటికైనా మహిళా దినోత్సవ ఉద్దేశ్యం నెరవేరిందా ? 
మహిళా సమస్యలకు సరైన పరిష్కారాలు దొరికాయా ?
మహిళాభ్యుదయం నిజంగా జరిగిందా ? 


మహిళలు చాలా రంగాల్లో పురోగమించిన మాట నిజమే ! అంత మాత్రం చేత తరతరాలుగా వున్న వారి సమస్యలు తీరిపోలేదు. వివక్షత సమసిపోలేదు. పైగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. 

ప్రకృతిలో స్త్రీకి, పురుషుడికి భౌతికంగా భేదం చాలా స్వల్పం. అది కూడా వారి కర్తవ్య నిర్వహణ కోసం ఆ మాత్రం భేధమైనా వుంది. కానీ మనం ఒప్పుకోవాల్సింది మానవజాతి మనుగడలో ఇద్దరికీ సరి సమానమైన బాధ్యత వుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ అసలు మానవజాతి పుట్టుకలో మాత్రం స్త్రీ కొంచెం ఎక్కువ బాధ్యతనే మోస్తోంది. ఆ విషయంలో స్త్రీ ఏమాత్రం అలక్ష్యం, అశ్రద్ధ చూపినా అసలు మనిషి పుట్టుక సందేహమే ! 

అందుకే మనం స్త్రీని జగజ్జననిగా ఉన్నత స్థానాన్ని ఇచ్చి కొలుస్తాం. త్రిమూర్తులకంటే శక్తివంతమైనది ఆమె. అందుకే ఆమె మహాశక్తి స్వరూపిణి అయింది. ఆదిశక్తి అయింది. మూలపుటమ్మ అయింది. 

దేవతగా స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలుస్తున్నాం. కానీ నిజ జీవితంలో ఆమెకు ఆ స్థానం ఇస్తున్నామా ? 
పురాణాల్లోని మహిళలకు తమ భర్తల్ని తామే ఎంచుకునే హక్కు వుంది. కానీ నాగరికంగా ఇంతగా అభివృద్ధి చెందిందనుకుంటున్న ఈరోజుల్లో కూడా ఎంతమంది స్త్రీలు ఆ హక్కును అనుభవిస్తున్నారు ? ఒకవేళ ఎవరినైనా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్నా అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల అడ్డంకులు. ఇవన్నీ కష్టపడి దాటి ఎలాగో పెళ్ళిచేసుకున్నా తర్వాత వారి జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతున్నదనుకోవడానికి వీలు లేదు. 

అసలు స్త్రీల సమస్యలకు, వివక్షతకు పురుషులే కారణమా ? అని ఆలోచిస్తే నాణేనికి బొమ్మా బొరుసూ వున్నట్లు ఆడైనా, మగైనా మనుషులందరిలోనూ మంచి చెడూ వుంటాయి. భార్యను వేధించే మగవారున్నట్లే వారికి సహకరించే అత్తలు, ఆడపడచులు వున్నారు. అసహాయ స్త్రీలను చేరబట్టే పురుషులున్నట్లే వారిని వక్రమార్గాలు పట్టించే స్త్రీలున్నారు. నేరాలు ఘోరాలు కేవలం పురుషులకు మాత్రమే పరిమితం కాదు. స్త్రీలలో కూడా ఆ ప్రవృత్తి కలిగిన వారు వున్నారు. తమ కొడుకునో, సోదరుడినో తమకు కాకుండా చేస్తుందనే అబధ్రతా భావం మొదటి రకం వారి ప్రవర్తనకు కారణమైతే, డబ్బు వ్యామోహం రెండో రకం వారి, మానసిక బలహీనతలు, పుట్టి పెరిగిన నేపథ్యం మూడో రకానికి కారణమవుతాయి. ఇవన్నీ కాకుండా నిష్టూరమైనా ఒప్పుకోవాల్సిన విషయం ఆడవారిలో అసూయ ఎక్కువ అని. కారణాలేమైనా ఇవన్నీ ఆడవారిపట్ల శాపాలుగా మారాయి. కనుక ఈరకమైన స్త్రీలు తమ ఆలోచనలను, ప్రవర్తనను మార్చుకొని, సంఘటితమైతే వారిని ఏరకమైన వివక్షతా దరిచేరదు. ఎవరూ వారిని అణచలేరు.   

మహిళా బ్లాగ్మిత్రులందరికీ నూరవ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ.... 

* గత సంవత్సరం టపా ..............

మహిళాలోకానికి శుభాభినందనలు

* 100 వ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఎదుర్కుంటున్న సమస్యల గురించి పుష్కర కాలం క్రితం శ్రీమతి దుర్గ డింగరి గారు రాసిన సవివరమైన వ్యాసం... దాని లింక్ .............












Vol. No. 02 Pub. No. 168

Monday, March 7, 2011

శిలను మల్లె ........


 

శిలను మల్లె పూచిందట 
తెలుసా నీకెపుడైనా....... 





 ప్రముఖ కవి శ్రీ ఇంద్రకంటి శ్రీకాంతశర్మగారు రచించిన ఈ గేయాన్ని శాస్త్రీయ సంగీత గాయకురాలు, విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో బి. హై కళాకారిణి శ్రీమతి విష్ణుభట్ల నీరజ గారు ఆలపించారు. ఈ పాటకు ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ బండారు చిట్టిబాబు గారు సంగీతం అందించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్న నీరజ ఇంజనీరింగ్ పట్టభద్రులు కూడా ! ఆమె పాడిన ఆ మధుర గీతాన్ని వినండి.........



Vol. No. 02 Pub. No. 167

Saturday, March 5, 2011

తెలుగు చిత్ర గంభీర స్వరం

1948 వ సంవత్సరం జనవరి 30 వతేదీ  
 ఆకాశవాణి వార్తల్లో మహాత్మాగాంధీ హత్య గావింపబడ్డారన్న వార్త ప్రసారమవుతోంది. ఆ వార్త శ్రోతలని ఎంత నిశ్చేష్టులను చేసిందో.... ఆ వార్తను చదివిన తీరు అంతగా వారిని దుఖః సాగరంలో ముంచేసింది. అప్పట్లో టీవీలు లేవు కదా ప్రత్యక్ష ప్రసారంగా ఆ విషాద సన్నివేశాన్ని చూడడానికి. రేడియోలోని, పత్రికల్లోని వార్తలే ప్రజలకు సమాచారం తెలుసుకునేందుకు ఆధారం. గాంధీజీ హత్య వార్తను గద్గద స్వరంతో చదివి ఆ సన్నివేశాన్ని శ్రోతల కళ్ళ ముందు ఉంచిన కంఠం కంచు కంఠం జగ్గయ్య గారిది.

 I am a man by birth
A socialist by connection
An artiste by temperment

         - అనేవారు జగ్గయ్య 

ఆయన తెలుగు చిత్ర గంభీరస్వరం 
ఆయన తెలుగు జాతికి గొప్ప వరం 

పదకొండవయేట హిందీ నాటకంలో లవుడి పాత్రలో రంగస్థల ప్రవేశం చేసారు. 
పద్నాలుగవయేట ' హంపి ' అనే కవితతో రచయిత అయ్యారు. 
ప్రఖ్యాత చిత్రకారుడు, రచయిత అడవి బాపిరాజు గారి దగ్గర చిత్రలేఖనం అభ్యసించారు. హైస్కూల్లో ఉండగానే రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి ప్రముఖుల తైలవర్ణ చిత్రాలు వేసారు. 
ఇంటర్ చదువు పూర్తి కాగానే ' దేశాభిమాని ' అనే పత్రికకు సహాయ సంపాదకునిగా, ' ఆంధ్ర రిపబ్లిక్ ' అనే పత్రికకు సంపాదకునిగా పనిచేసారు. 
మూఢనమ్మకాల వల్ల జరిగే నష్టాలను తెలుసుకోవడానికి శాస్త్రీయ దృక్పథం అవసరమని నమ్మిన జగ్గయ్య రాజమండ్రిలో గోదావరిశాస్త్రి గారి వద్ద వాస్తు శాస్త్రం, బరోడాలో సాగభోగేశ్వర శాస్త్రి వద్ద జ్యోతిష్య శాస్త్రం, కెనడాలోని ఆచార్య ఋషికుమార పాండే వద్ద  హిప్నాటిజం నేర్చుకున్నారు. 
జగ్గయ్య తెనిగించిన రవీంద్రుని ' గీతాంజలి ' గురించి, ఆయన పరిష్కరించిన రాజకీయ పారిభాషిక పదకోశం గురించి, ఆయన రాజకీయ జీవితం గురించి అందరికీ తెలిసిందే !
ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన జగ్గయ్య వర్థంతి ఈరోజు ( మార్చి 5 ). ఆ గంభీర స్వరానికి నీరాజనాలు అర్పిస్తూ ఆ స్వరం ఓసారి ......



జగ్గయ్య గారిపై గతంలోని టపా ...........

కళా వాచస్పతి

Vol. No. 02 Pub. No. 166

Friday, March 4, 2011

వెండితెర నవలలపై రమణ

 
ముళ్ళపూడి వెంకటరమణగారు రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగినవి వెండితెర నవలలు. ఒక కథని వెండితెరకేక్కించడం సులువేనేమో గానీ వెండితెర మీద దృశ్యకావ్యంగా ఒదిగిన కథని ఒక నవలగా మలచి పాఠకులను ఒప్పించడం చాలా కష్టం. నవల పఠనంలోనే పాఠకునికి సినిమా చూపించగలగాలి. ఆ శైలి ముళ్ళపూడి గారి ప్రత్యేకత. ఆయన రాసిన ' భార్యాభర్తలు ' వెండితెర నవల చదివి ఆ చిత్ర దర్శకుడు కె. ప్రత్యగాత్మ " సినిమా తియ్యడానికి ముందే ఈ నవలను చదివివుంటే సినిమాను ఇంకా బాగా తీసేవాడిని " అన్నారంటే ముళ్ళపూడి వారు ఆ చిత్ర సన్నివేశాల్ని ఎంత బాగా కాగితం మీద పరిచారో అర్థం చేసుకోవచ్చు. 

తాను రాసిన వెండితెర నవల గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు ఏమంటున్నారో చదవండి.....

" నిర్మాతగా మారక ముందు ఆదుర్తి, ప్రత్యగాత్మ, వి. మధుసూదనరావు సినిమాలకు వెండితెర నవలలు రాసాను. నాకు గుర్తుండి నేను రాసినవి నాలుగు వెండితెర నవలలే ! వాటితో బాటు కొన్ని సినిమా స్క్రిప్ట్ లు కూడా ప్రచురించాం. నేను నిర్మాతగా మారాక మా బ్యానర్ లో వచ్చిన కొన్ని సినిమాలకు ఎమ్వీయల్, శ్రీరమణ తో వెండితెర నవలలు రాయించాను. 
అప్పుడు ఈ నవలల్ని రాయడంలోనే కాదు, ప్రచురణలోనూ కొత్త పోకడలను అనుసరించాం ! ' ఇద్దరు మిత్రులు ' నవల చూడండి. అందులో అక్కినేనిది ద్విపాత్రాభినయం. పేజీల కార్నర్ లో అక్కినేని ఫోటోలను ప్రచురించాం. పేజీలను వేగంగా తిప్పినపుడు ఇద్దరు నాగేశ్వరరావు లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నట్లు కనిపించేది. 1962 జనవరిలో విడుదలైన ఈ పుస్తకాన్ని డెబ్భై అయిదు పైసలకు అందించాం. విడుదలైన రెండో నెలలోనే పునర్ముద్రణ కూడా జరిగింది. సినిమా స్టిల్స్ తో బాటు బాపు రేఖాచిత్రాలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. అలానే ' బుద్ధిమంతుడు ' వెండితెర నవలను అక్కినేని నాగేశ్వరరావు ఆటోగ్రాఫ్ తో 1969 సెప్టెంబర్ 20 న ఆయన జన్మదిన కానుకగా విడుదల చేసాం. సినిమా కూడా అదే రోజున విడుదలయింది "   

మనవి : ' ఇద్దరు మిత్రులు ' వెండితెర నవలలో రమణగారు చెప్పిన ఇద్దరు అక్కినేని గార్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నట్లు కనిపించే ఫోటోలను గమనించిన వారెవరైనా వున్నారా ?  వుంటే దయచేసి వారి అనుభూతుల్ని తెలియజెయ్యండి.  

సాక్షి జంట గురించి ఆరుద్ర టపా గురించి వ్యాఖ్యానిస్తూ పెద్దలు, మిత్రులు వోలేటి వెంకట సుబ్బారావు గారు బాపురమణ ల జంట గురించి మరో మంచి విషయాన్ని చెప్పారు. వారికి కృతజ్ఞతలతో ఇక్కడ ఆ విషయాన్ని అందిస్తున్నాను. 

" ఇద్దరూ ఒకటేననీ .... అందువల్ల ఇద్దరికీ మధ్య - ( గీత ) ఉండకూడదని...... ఒకచోట చదివిన మీదట బాపురమణ అని ఏకపదంగా ఉపయోగిస్తున్నాను " 

నిజమే ! మనుషులనే కాదు బాపురమణ పేర్లను కూడా విడదీసి చూడలేం కదా ! 

 Vol. No. 02 Pub. No. 165

Thursday, March 3, 2011

చిత్తశుద్ధి గల ప్రజా ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ కు ప్రకృతి ప్రసాదించిన వరం కోనసీమ 
గోదావరి పాయల మధ్య అందంగా ఒదిగిన కోనసీమ కొంతకాలం క్రితం వరకూ సముద్రంలోని ఒక ద్వీపంలా చుట్టూ నీటితో నిండి వుండేది. అక్కడినుంచి బయిట ప్రపంచంలోకి రావాలంటే గోదావరి నదిని పడవలపైన దాటవలసిందే ! దేశంలోని మారుమూల ప్రాంతాలు కూడా విద్యుత్ వెలుగులతో వెలిగిపోతున్న రోజుల్లో కూడా ఆముదం దీపాలు, కిరోసిన్ దీపాలతో గడిపింది కోనసీమ. ఆ ప్రాంతానికి చెందిన అప్పటి రెవిన్యూ మంత్రి కళా వెంకటరావు గారి పుణ్యమాని యాభైవ దశకంలోననుకుంటాను విద్యుత్ వెలుగులకు నోచుకుంది. ఆయన చొరవతో గోదావరి పాయలపై రెండు వంతెనలకు అనుమతి లభించింది. తర్వాత కాలంలో వాటి నిర్మాణం జరిగి బాహ్య ప్రపంచానికి చేరువయ్యింది కోనసీమ. అప్పటినుంచి విడిగా విసిరేసినట్లు మూలగా వుందని అనిపించే కోనసీమ బయిట ప్రపంచాన్ని ఆకర్షించడం మొదలైంది. అక్కడి కొబ్బరి అందరికీ ప్రియమైంది. అక్కడి సహజవాయువు, పెట్రోలియం  ఉత్పత్తులు దేశ ఆర్ధిక వ్యవస్థకు ఆశాదీపాలుగా కనబడ్డాయి.

తరవాత ఎంతమంది రాజకీయనాయకులు వచ్చినా తమ రాజకీయ ప్రయోజనాలకే గానీ ఆ ప్రాంతాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసిన వారు దాదాపుగా లేరు. ఆ ప్రాంత సహజ వనరుల్ని తరలించుకు పోయే క్రమంలో అక్కడి ప్రజలకు కనీస సౌకర్యాల కల్పన మాట అలా వుంచి వున్న సౌకర్యాలు ఊడుతున్నా పట్టించుకోని నాయకులున్న తరుణంలో నేనున్నానంటూ ముందుకొచ్చిన నాయకుడు గంటి మోహనచంద్ర బాలయోగి.     

అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్యుడిగా ఎదిగిన నాయకుడు బాలయోగి. 
నిజమైన ప్రజా సేవకుడు మాటలకన్నా చేతలకే ప్రాధాన్యం ఇస్తాడు అని నిరూపించిన నేత బాలయోగి.  
భారత లోక్ సభకు ఎన్నికైన మొదటి దళిత సభాపతి బాలయోగి.
కులమత రహిత లౌకిక రాజ్యంగా చెప్పుకునే మనదేశ రాజకీయాల్లో అత్యంత ప్రాముఖ్యంగల అంశం కులమతాలే !
ఏ నాయకుడైనా మొదటగా చూసేది తన మతం లేదా కులం వైపే !
ఏ కులం వాడైనా, మతం వాడైనా చూసేది నాయకుడి కులం లేదా మతం వైపే ! 
కానీ బాలయోగి మాత్రం ఈ కుల మతాలకు అతీతం 
ఆయన అందర్నీ అభిమానించాడు... ఆయన్ని అందరూ అభిమానించారు 
అప్పటికీ...ఇప్పటికీ..... ఎప్పటికీ.... ఎందుకు ?   
 సుమారు మూడు దశాబ్దాలుగా జరగని కోనసీమ అభివృద్ధి కేవలం రెండు మూడు సంవత్సరాల్లో జరిగింది. దానికి సాక్ష్యాధారాలు నేటికీ సజీవంగా కనబడుతున్నాయి.

అప్పట్లో కోనసీమ ప్రజలు జిల్లా ముఖ్యపట్టణమైన కాకినాడ చేరాలంటే చుట్టూ తిరిగి 100 కిలోమీటర్లు పైన ప్రయాణం చెయ్యాల్సివచ్చేది. దానికి పరిష్కారంగా ఎప్పటినుంచో ఆ ప్రాంత ప్రజలు కోరుకున్నట్లు కోటిపల్లి వద్ద గానీ, ఎదుర్లంక వద్దగానీ గోదావరి నది మీద వంతెన నిర్మించాలి. ఎదుర్లంక వద్ద అయితే కోనసీమలో మరో అంతర్భాగంగా వున్న ఐలాండ్ పోలవరం ప్రాంతానికి కూడా బయిట ప్రపంచంతో సంబంధాలు కలుస్తాయి. తూర్పు గోదావరి జిల్లా సరిహద్దుగా వున్న కేంద్ర పాలిత ప్రాంతం యానాం తో కూడా సంబంధం ఏర్పడుతుంది. ఇలా ఓ నిశ్చయానికి వచ్చి అప్పటి ఎన్టీరామారావు ప్రభుత్వం ఎదుర్లంక - యానాం వంతెనకు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే అనేక అభ్యంతరాలు, అడ్డంకులు వల్ల చాలా కాలం ఆ ప్రతిపాదనలో కదలిక లేదు. బాలయోగి గారు లోక్ సభ స్పీకర్ అయ్యాక ఆ ప్రతిపాదనను వెలికి తీయించి వున్న అభ్యంతరాలను పరిష్కరించే దిశగా కృషి చేసి డిజైన్ లో అవసరమైన మార్పులు చేయించి వెంటనే పని ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమం చేసారు.

అప్పటివరకూ కోనసీమ ప్రాంతంలో వున్న ప్రధాన సమస్యల్లో మరొకటి రహదారుల సమస్య. ఓఎన్జీసీ పుణ్యమాని అవి మరింత హీనదశకు చేరుకున్నాయి. వాటి బాగును పట్టించుకున్న నాధుడు లేడు. ఇప్పుడు అక్కడ జాతీయ సంపద పుష్కలంగా లభిస్తోంది. అందుకే బాలయోగి తన హయాంలో కోనసీమ ప్రాంత ప్రధాన రహదారి అయిన కత్తిపూడి - నర్సాపురంరేవు రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించేటట్లు చేసారు.

కోనసీమ ప్రజల చిరకాల స్వప్నం... అక్కడి నాయకుల నిర్లక్ష్యం రైలు. అపారమైన సహజవనరులు కలిగి వున్నా సరైన రవాణా వ్యవస్థ లేక దళారుల చేతిలో మగ్గిపోతున్న రైతులకు ప్రయోజనం కలిగించే రైల్వే లైన్ ఏర్పాటు విషయంలో అక్కడి ప్రజాప్రతినిధులేవ్వరూ అప్పటివరకూ సరైన శ్రద్ధ చూపలేదు. కానీ బాలయోగి పదవిలో వున్న కాలంలో రెండవ ప్రపంచ యుద్ధకాలంలో తొలగింపబడి, పునర్నిర్మాణానికి దశాబ్దాలుగా చేసిన పోరాటాల ఫలితంగా ప్రారంభయిన కాకినాడ - కోటిపల్లి రైల్వే లైన్ పనులు పూర్తి చేయించారు. చెన్నై - కొలకత్తా మెయిన్ లైన్ కు ప్రత్యామ్నాయ మార్గంగా వుండే విధంగా కాకినాడ, భీమవరం మీదుగా సామర్లకోట నుంచి విజయవాడ వరకూ లైన్ నిర్మాణానికి మధ్యలో మిగిలిన కోటిపల్లి నుంచి నర్సాపురం వరకూ రైల్వే లైన్ సర్వే, స్థల సేకరణ కూడా దాదాపుగా పూర్తి చేయించి కోనసీమకు రైలు వచ్చేందుకు మార్గం సుగమం చేయించారు. అయితే ఆయన అకాల మరణం ఆ ప్రాజెక్ట్ కు శాపంలా మారింది.

గత కొంతకాలంగా రైల్వే బడ్జెట్ లో ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతోందనేది కాదనలేని సత్యం. దీనికి రైల్వే మంత్రుల్ని బాధ్యులుగా అందరూ మాట్లాడుతుంటారు. కానీ ప్రజాప్రతినిదులనేవారు తమ ప్రాంత ప్రజల అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే దిశగా కృషి చెయ్యాలి. అందుకే వాళ్ళను వాళ్ళ ప్రాంత ప్రజలు ఎన్నుకుని చట్ట సభలకు పంపుతారు. సరైన పద్ధతిలో, సరైన రీతిలో ప్రభుత్వానికి తమ ప్రాంత అవసరాలు, సమస్యలు తెలిపితే ఆయా శాఖల మంత్రులకు అర్థం అవుతుంది. పరిష్కారం దిశగా ఆలోచిస్తారు. పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. దీనికి ఉదాహరణే కోనసీమ రైల్వే లైన్. ఈ లైన్ వల్ల అక్కడి వ్యవసాయ ఉత్పత్తులు బయిట ప్రాంతాలకు సులువుగా, దళారుల ప్రమేయం లేకుండా చేరడం వలన తక్కువ ఖరీదుకు దొరికే అవకాశం ఉంది. అలాగే జాతీయ సంపద తరలింపు విషయంలో కూడా ఖర్చు తగ్గే అవకాశం ఉంది. బాలయోగి గారి ముందు వరకూ పనిచేసిన అక్కడి ప్రజాప్రతినిధులందరూ ఎన్నికల వాగ్దానాల వరకే ఈ అంశాన్ని పరిమితం చేసారు తప్ప చిత్తశుద్ధితో కృషి చెయ్యలేదు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా మన రాష్ట్రం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధుల పరిస్థితి అదే !

బాలయోగి గారి హయాంలో కూడా రైల్వే మంత్రి మమతా బెనెర్జీనే ! ఆవిడ స్వహస్తాలతో కోనసీమ నడిబొడ్డు, ప్రధాన పట్టణం అయిన అమలాపురంలో రైల్వే లైన్ కు శంకుస్థాపన చేసారు. అంతకుముందు దశాబ్దాలుగా సాధ్యం కానిది కేవలం ఆయన లోక్ సభాపతిగా వున్న అతి కొద్ది కాలంలో ఎలా సాధ్యమైంది ? ఇప్పుడెందుకు సాధ్యం కావడం లేదు ?

అప్పటి మమతా బెనేర్జీనే ఇప్పుడు కూడా రైల్వే మంత్రిగా వున్నారు. కానీ ఆ లైన్ బాలయోగిగారి తర్వాత ఒక అంగుళం కూడా ఎందుకు కదలలేదు ? అంటే అది బాలయోగి గొప్పతనమా ? తర్వాత ప్రజాప్రతినిధుల చేతకానితనమా ? కాదు.... చిత్తశుద్ధి లోపించడమే ప్రధాన అవరోధం. తమ రాజకీయ ప్రయోజనాలను, స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల అవసరాలను, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించకపోతే వారిని ఎన్నుకున్న ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం కలుగదు.

పేద దళిత కుటుంబంలో, మారుమూల పల్లెలో పుట్టిన బాలయోగి కార్యదీక్షగల నాయకుడిగా ఎదగడానికి ఆయన క్రమశిక్షణ, పట్టుదల కారణం. దీక్షగా చదివి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లా పట్టా తీసుకున్నారు. సైకిల్ మీద కోర్ట్ కెళ్ళిన దశ నుండి ప్రభుత్వ వాహనంలో లోక్ సభకు వెళ్ళిన దశకు చేరుకున్న క్రమంలో ఎంతో పట్టుదల, దీక్ష కనిపిస్తుంది. ఆయన మిత్రుడు, తెలుగు దేశం నాయకుడు యనమల రామకృష్ణుడు తోడ్పాటుతో రాజకీయాల్లో ప్రవేశించి మెట్టు మెట్టు చాలా వేగంగా అధిరోహించి ఉన్నత స్థానానికి చేరారు. లోక్ సభ సమావేశాల సమయంలో తప్ప మిగిలిన సమయంలో చాలా భాగం నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఆయన స్నేహితుల జాబితా కుల, మత రహితం. అన్ని వర్గాల వారు ఆయన స్నేహితులే ! అందర్నీ పేరు పేరునా ఆప్యాయంగా పలకరించడం ఆయన ప్రత్యేకత. అందరి సమస్యలూ ఓపికతో విని పరిష్కారానికి ప్రయత్నించడం ఆయన నైజం. లోక్ సభాపతి స్థాయిలో కూడా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో తమ ఇంట్లో శుభకార్యానికి ఎవరు ఆహ్వానించినా అవకాశం ఉన్నంతవరకూ తప్పక హాజరయ్యేవారు.

బాలయోగి ఎస్టేట్లు సంపాదించుకోలేదు. ఆయన సంపాదించింది అంతకంటే విలువైన ప్రజాబలం. అదే ఆయన ధనం. దాన్ని ఆయన డబ్బు పోసి కొనుక్కోలేదు. ప్రజాసేవ పట్ల అంత చిత్తశుద్ధి కలిగిన నాయకుడిని మళ్ళీ మనం చూడలేమేమో ! ఆయన హయాంలో నాలుగు లైన్ల జాతీయ రహదారుల్నీ, పాత రహదారులకు కొత్తగా జాతీయ హోదాను, దూరంగా వున్న ప్రాంతాలను దగ్గర చేసే భారీ వంతెనలను, సుందరంగా మారిన కోనసీమ గ్రామాలను చూసాం గానీ...... ఆయన ఇంకొంతకాలం జీవించి వుంటే కోనసీమలో రైలు కూత తప్పక వినబడేది. మళ్ళీ మరొక బాలయోగి పుడితే తప్ప అది సాధ్యం కాదేమో !
మన దేశానికి చిత్తశుద్ధి, నిబద్ధత వున్న ప్రజానాయకులు అవసరం లేదనుకుంటాను. అందుకే బాలయోగిని కూడా దేవుడు ఇక్కడ నీ అవసరం లేదని అక్కడ తనకవసరమని అత్యవసరంగా తీసుకెళ్ళిపోయాడు.

 2002 మార్చి 3 వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మాజీ లోక్ సభ సభాపతి గంటి మోహనచంద్ర బాలయోగి గారిని సంస్మరించుకుంటూ ................

Vol. No. 02 Pub. No. 164

'వాహినీ' కుమారి

 ' వాహినీ ' కుమారిగా ప్రసిద్ధి చెందిన రాజకుమారి.......మద్దెల నాగరాజకుమారి గత తరం ప్రేక్షకులకు అప్పటి నటీమణులలో చిరపరిచితమైన పేరు. 

తెనాలికి చెందిన మద్దెల నాగరాజకుమారి అందం 1934 లోనే సి. పుల్లయ్య గారి ' శ్రీకృష్ణ తులాభారం ' చిత్రంలోను, వేల్ పిక్చర్స్ వారి ' సీతాకళ్యాణం ' చిత్రంలోనూ అవకాశాలు వెదుక్కుంటూ వచ్చేటట్లు చేసింది. అయితే నటన, చిత్ర పరిశ్రమ అంటే భయపడ్డ ఆమె తల్లి వాటిని తిరస్కరించింది. 1937 లో ఒక బంధువు ప్రోద్బలంతో ' దశావతారాలు ' చిత్రానికి జరిగిన సెలక్షన్లో కుమారి ఎంపికయ్యారు. తోలి చిత్రంలోనే లక్ష్మి, సీత, యశోధర పాత్రలు ధరించి త్రిపాత్రాభినయం చేసారు. ఆ తర్వాత 1939 లో ' అమ్మ ' , ' ఉష '  అనే చిత్రాల్లో నటించారు. అయితే ఆ చిత్రాలు అంతగా విజయం సాధించలేదు. ' ఉష ' ఘోరంగా పరాజయం పాలైంది. 

ఇక కుమారి గారి జీవితంలో ముఖ్యమైన ఘట్టం..... వాహినీ పిక్చర్స్ లో అడుగుపెట్టడం. వితంతు పునర్వివాహం ప్రధానాంశంగా వాహినీ వారు 1940 లో నిర్మించిన ' సుమంగళి ' లో ఆమె పోషించిన కథానాయిక పాత్ర ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టింది. తర్వాత వాహినీ వారు పతిత జనోద్దరణ ప్రధానాంశంగా నిర్మించిన ' దేవత ' చిత్రం ఆమెను వాహినీ కుమారిని చేసింది. ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. అయితే అనూహ్యంగా ఆ చిత్రం తర్వాత అయిదేళ్లపాటు ఆమె కనుమరుగైపోయింది.
మళ్ళీ 1946 లో ఘంటసాల బలరామయ్య గారి ' ముగ్గురు మరాటీలు ' చిత్రం ద్వారా పునః ప్రవేశం చేసారు. ఆ చిత్రం ఘన విజయం సాధించినా ఆ తరవాత కుమారి కొండచిలువతో పోరాటాలు వగైరా సాహసాలు చేసిన ' మాయపిల్ల ' ( 1951 ) పరాజయం పాలయ్యింది. ఇంకా కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచన చేసిన ' ఆకాశరాజు ' చిత్రంలో గౌరీనాథశాస్త్రి గారి సరసన నటించారు. ఇలా ఆమె నటించిన బయిట చిత్రాలలో కొన్ని పరాజయం పొందగా, మరికొన్ని నిర్మాణ దశలోనే ఆగిపోయాయి. 

మళ్ళీ వాహినీ వారి ' మల్లీశ్వరి ' చిత్రంలో రాణి తిరుమలదేవి పాత్ర కుమారికి మరోసారి గుర్తింపు తెచ్చింది. ఆ చిత్రంలో కుమారిది చిన్న పాత్రే అయినా ఆమెకు వాహినీ కుమారి అనే పేరును శాశ్వతం చేసింది. ఆ తర్వాత మరో మూడు చిత్రాల్లో నటించిన కుమారి 1958 లో మద్రాస్ వదలి విజయవాడ కొచ్చి స్థిరపడ్డారు. శేష జీవితం బెజవాడ లోనే గడిపి 2009 మార్చి 3 న స్వర్గస్తులయ్యారు.  

వాహినీ కుమారి వర్థంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తూ యుట్యూబ్ లో ప్రణీత్ ఛానల్ లోని ' దేవత '  చిత్రంలోని ఈ పాట చూడండి ............



Vol. No. 02 Pub. No. 163

Wednesday, March 2, 2011

శివ శివ మూర్తివి నీవేనయ్యా !

 బ్లాగ్మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు 


గతసంవత్సరం శివరాత్రి టపా ..............

 శివోహమ్ !



Vol. No. 02 Pub. No. 162

Tuesday, March 1, 2011

రమణ చలవ


సూర్యకాంతమ్మ గారికి అసలు కొడుకు బాపు అయితే ... పెద్దకొడుకుగా చలామణీ అయినది రమణ. బాపురమణల అనుబంధం గురించి ఎంత చెప్పినా తరగదు. సూర్యకాంతమ్మ గారికి వారి అనుబంధం మీద ఎంత గురో చెప్పడానికి ఓ సంఘటన............





బాపు గారి ' సీతాకల్యాణం ' చిత్రం లండన్ చలన చిత్రోత్సవానికి ఎంపికయింది. ఆ కారణంగా ఆయన లండన్ ప్రయాణమయ్యారు. ఈ శుభవార్త చెప్పి తల్లి గారికి చెప్పి ఆమె ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళారు బాపు. ఆమె కాళ్ళకు నమస్కరించగానే సూర్యకాంతమ్మ గారు కొడుకుతో ..........

" నీక్కాస్త పేరేదైనా వస్తే అంతా రమణ చలవే ! అతని వల్లే ! అతనికి దణ్ణం పెట్టు ! " అన్నారట.

ఈ మాటోక్కటి చాలదూ ! బాపు గారి ఔన్నత్యం వెనుక రమణ గారి కృషి ఎంత వుందో.... బాపురమణల అనుబంధం ఎంత గొప్పదో ... ఇలాంటి అపురూపమైన స్నేహాన్ని మళ్ళీ చూడగలమా !

Vol. No. 02 Pub. No. 161
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం