Sunday, March 27, 2011

రంగస్థల దినోత్సవం

కళలు మానవ జీవితంలో అంతర్భాగం. వినోదానికి, వికాసానికి ఆధారం కళలు. మానవుడి మేదోరూపం కళలు. ఒక్కో మనిషిలో ఒక్కో రకమైన సృజనాత్మకత వుంటుంది. వాటి బాహ్య రూపమే కళారూపం. ఒక ప్రాంతం లేదా ఒక దేశం యొక్క సంస్కృతికి ప్రతీకలు కళారూపాలు.  వాటిని కలిపే వారధి కూడా ఈ కళారూపాలే ! 

భాషకు అందనిది కళ 
ప్రాంతాలకు అతీతం కళ

రంగస్థలం అనగానే మనకి సాధారణంగా గుర్తుకొచ్చేవి నాటకాలు. నిజానికి రంగస్థలం మీద ప్రదర్శించేవి కేవలం నాటకాలు మాత్రమే కాదు. సంగీత కచేరీలు, నాట్య ప్రదర్శనలు, యక్షగానాలు, భాగవత మేళాలు, హరికథలు, బుర్రకథలు ..... ఇలా ఎన్నెన్నో రకాల కళారూపాలు రంగస్థలం మీద ప్రదర్శిస్తారు. అంతేకాదు మనుష్యులు అజ్ఞాతంగా వుండి ఆడించే బొమ్మలాటలు లాంటి ప్రక్రియలు కూడా రంగస్థలం మీద ప్రదర్శించేవే ! ఇవన్నీ సజీవ కళలు. కళాకారులు మన కళ్ళ ముందు ప్రదర్శించే కళారూపాలన్నీ దాదాపుగా రంగస్థలం మీద ప్రదర్శించేవే !
ఆ రంగస్థలం పరిస్థితి ఈనాడు అంత ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా తెలుగు రంగస్థలం. దానికి జవజీవాలు సమకూర్చాల్సిన బాధ్యత ప్రజలందరి మీదా వుంది.

ఈరోజు ( మార్చి 27 ) ప్రపంచ రంగస్థల దినోత్సవం
ఈ సందర్భంగా ప్రాంతాల, దేశాల మధ్య సాంస్కృతిక రాయబారులైన 
రంగస్థల కళాకారులందరికీ శుభాకాంక్షలు

గత సంవత్సరం టపా లింక్ - 




Vol. No. 02 Pub. No. 183

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం