Tuesday, July 28, 2015

భారత ' జాతి ' రత్నం

 ఆయనకు పిల్లలంటే అమితమైన ఇష్టం.
వారిలో భావి భారతాన్ని చూడగలిగిన దార్శనికుడాయన.
పిల్లలని, యువకులని కలలు కనమన్నారాయన.
ఆ కలల్ని సాకారం చేసుకునేందుకు కృషి చెయ్యమన్నారు. 




ఆయన నిజమైన, స్వచ్చమైన లౌకిక వాది.
ఏ మత సిద్ధాంతాన్నైనా, సంప్రదాయన్నైనా గౌరవించగల సంస్కారం ఆయన స్వంతం.
ఉన్నత శిఖరాలు అందుకోవడానికి ఉన్నతమైన లక్ష్యం, నిబద్ధత కావాలి గానీ అడ్డదారులు కావని నిరూపించిన మహనీయుడు.



రాష్ట్రపతి అయినా ప్రజలకు దూరంగా అద్దాల సౌధంలో గడపనవసరం లేదని, ప్రజల మధ్యనే వుండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యవచ్చని తెలియజేసిన మహా నాయకుడు ఆయన.




పదవి అందరికీ అలంకారం. ఆయన పదవికే అలంకారం.
ఇటీవలి కాలంలో భారతజాతి గర్వించదగ్గ ఏకైక ' భారతరత్నం ' ఆయన. 
తన వ్యక్తిత్వాన్ని, ఆదర్శాలను, ఆకాంక్షలను మనకి వదలి, నా పని అయిపోయింది.... ఇక అనుసరించడం మీ పని అన్నట్లుగా నిన్ననే ( 27 జూలై 2015 ) వెళ్లిపోయారాయన.



ఆయన చెప్పిన మార్గంలో మన పిల్లల్ని తయారుచేసి, భవిష్యత్తులోనైనా ఆయన లాంటి నాయకులను, శాస్త్రజ్ఞులను, పండితులను దేశానికి అందించడమే అబ్దుల్ కలామ్ గారికి నిజమైన నివాళి.



అప్పుడే మన దేశాన్ని బయిటి ముష్కరుల నుంచి, లోపలి రాబందుల నుంచి మనమే రక్షించుకోగలుగుతాము.
 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 029

Saturday, July 25, 2015

బృహస్పతి అష్టోత్తరమ్... తుంగభద్ర... ప్రాతః స్మరణీయుడు... ఇంకా


గోదావరికి మహా పుష్కరాలు మహా వైభవంగా జరిగాయి. పుష్కరానికి, బృహస్పతికి అవినాభావ సంబంధం వుంది.
పుష్కరాల నేపథ్యంలో బృహస్పతి అష్టోత్తర నామావళి, పుష్కర సమయంలో ఇవ్వవలసిన దానముల గురించి వివరణ.....


మన దేశానికి స్వాతంత్ర్యము సిద్ధించిన తొలినాళ్లలో సాహిత్యం  కొంతకాలం ప్రభావితమయింది.  మన జీవితాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో  నదులతో పెనవేసుకుని వుంటాయి. అందుకే నదీమతల్లిని మన ప్రజలు అంత భక్తితో కొలుస్తారు. ఈ రెండు విషయాలను ముడివేసి అధ్బుతమైన ప్రేమ కథను ‘ జాతీయ విజ్ఞానం ‘ అనే పత్రిక 1948 జూన్ సంచికలో రావూరు వ్రాసిన కథ " తుంగభద్ర "........  

పాలకునికి దార్శనికత వుండాలి. ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతాన్ని సరైన తీరులో అభివృధ్హి చేస్తే దేశానికే ధాన్యాగారం అవుతుందని, దానికి వృధాగా సముద్రంలోకి పోయే జలాలను ఒడిసి పట్టి పొలాలకు మళ్ళించడం కోసం ఎన్నో ప్రణాళికలు రచించి అమలు చేసి, కరువు కోరల్లో చిక్కుకున్న ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన మహనీయుడు కాటన్. ఆయన వర్థంతి సందర్భంగా " ప్రాతః స్మరణీయుడు సర్ ఆర్థర్ కాటన్ " ........  ఇంకా చాలా...... ఈ క్రింది లింక్ లో.....


" బాలల కథల పోటీ - 2015 " కి పొడిగించబడిన గడువు తేదీ 31 జూలై సమీపిస్తోంది. 
మీ పిల్లల్ని లేదా మీ బంధు మిత్రుల పిల్లల్ని ప్రోత్సహించి ఈ పోటీలో పాల్గొనేటట్లు చేయండి. భావి తరానికి భాషా వారసత్వాన్ని కూడా అందించండి. తెలుగు భాషను ఎప్పటికీ సజీవంగా వుంచడంలో మీ వంతుగా తోడ్పడండి. 

భవదీయుడు
శి. రా. రావు



​Visit web magazine at www.sirakadambam.com 


Vol. No. 06 Pub. No. 028

Sunday, July 12, 2015

గోదావరి మహత్మ్యం.... బాటసారి.... ముద్దుగారే యశోదా.... ఇంకా

గోదావరి మహా పుష్కరముల సందర్భంగా " గోదావరి పుష్కర మహత్మ్యం, గోదావరి అష్టోత్తర నామావళి " లను వినిపించారు డా. గోలి ఆంజనేయులు గారు తాజా సంచిక 56 వ పేజీలో.......
పల్లె జీవితాలను, పశువులతో... ప్రకృతితో పల్లె వాసుల అనుబంధాన్ని ఆవిష్కరించిన రావూరు వారి కథ " బాటసారి "  తాజా సంచిక 35 వ పేజీలో.......
మహీధర నళినీమోహన్ రావు గారు, ' బాలబంధు ' బి. వి. నరసింహారావు గారి గురించి " బాల సాహిత్య సృష్టికర్తలు " తాజా సంచిక 59 వ పేజీలో.......
అన్నమయ్య పద కీర్తన " ముద్దుగారే యశోదా " ఉషవినోద్ రాజవరం గారి స్వరంలో తాజా సంచిక 53 వ పేజీలో.......
ఇంకా చాలా విశేషాలతో తాజా సంచిక ఈ క్రింది లింక్ లో...... 
శిరాకదంబం 04_024
" బాలల కథల పోటీ - 2015 " కి రచనలు చేరవలసిన చివరి తేదీ 31 జూలై 2015 వరకూ పొడిగించడమైనది. మీ పిల్లల్ని, మీ బంధుమిత్రుల పిల్లల్ని తెలుగులో వ్రాసేలా ప్రోత్సహించి, తెలుగు భాషను సజీవంగా వుంచడానికి మీ వంతు కృషి చేయండి. 
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 06 Pub. No. 027
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం