ప్రముఖ కవి శ్రీ ఇంద్రకంటి శ్రీకాంతశర్మగారు రచించిన ఈ గేయాన్ని శాస్త్రీయ సంగీత గాయకురాలు, విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో బి. హై కళాకారిణి శ్రీమతి విష్ణుభట్ల నీరజ గారు ఆలపించారు. ఈ పాటకు ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ బండారు చిట్టిబాబు గారు సంగీతం అందించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్న నీరజ ఇంజనీరింగ్ పట్టభద్రులు కూడా ! ఆమె పాడిన ఆ మధుర గీతాన్ని వినండి.........
మధురకవి డా. వక్కలంక లక్ష్మీపతి రావు గారు సుమారు నాలుగు దశాబ్దాల క్రితం రచించిన ' ఆంధ్ర పుణ్యక్షేత్రాలు ' అనే గేయం ఆంధ్రదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ సాగుతుంది. స్వర్గీయ సాలూరి హనుమంతరావు గారి స్వరకల్పనలో శ్రీమతి ఎస్. జానకి, శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గేయం ప్రైవేటు ఆల్బం గా గ్రామఫోను రికార్డులలో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందింది. అప్పట్లో ఆంధ్రదేశంలోని ప్రతి దేవాలయంలోను ప్రతిరోజూ తప్పనిసరిగా వినబడేది. ఆ అద్భుతమైన గేయం మీకోసం ................
ఇదే ఆంధ్ర భూమి ! ఇదే పుణ్య భూమి !
ఇది యోగులకు భోగులకు జన్మభూమి !
గౌతమీకృష్ణాతరంగాల పులకించు
మాతెలుగుసీమలో వెలయువేలుపులారా !
మాయిలవేల్పులారా !