Tuesday, November 19, 2019

దానత్రయం... తానొకటి తలస్తే... దైవమొకటి... ' శకపురుష ' వేదాంతం... ఇంకా ....

* ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టి ఆకలి తీరిస్తే, ఆ ఆకలి తీరిన కొద్ది గంటల్లోనే అవతలి వ్యక్తి ఆ సహాయాన్ని మరవచ్చు. కట్టుకోడానికి గుడ్డముక్క లేదని యాచించిన వాళ్ళకి కొత్త బట్టలు కుట్టించి ఇస్తే ఆ బట్టలు మాసి, చిరుగులు పడితే ఆ సహాయానికి అంతటితో ‘ తెర ’ పడినట్లే ! కానీ, ప్రాణాపాయ స్థితిలో వున్న వ్యక్తికి రక్తదానం చేసి ఆ మనిషిని ఆదుకొని, తద్వారా ఓ సంసారాన్ని నిలబెట్టగలిగితే, ఆ సహాయాన్నందుకొన్న వ్యక్తి తను జీవించి వున్నంత కాలం తాను పొందిన సహాయాన్ని, ఆ సహాయాన్నందించిన మహానుభావుణ్ణి మరచిపోడు. మరువలేడు. ( రచయిత స్వరంలో కూడా... ) - దానత్రయం
* “ మొదట్లో జీవితంలో కొన్ని నియమాలు, నిబంధనలు పెట్టుకొన్నాను. కొన్నిటి విషయంలో నిషేధాలు కూడా పెట్టుకొన్నాను. వాటిని చాలవరకు అమలులో పెట్టడానికి ప్రయత్నించాను. కాని వయస్సు పెరిగేకొద్దీ, వృద్ధాప్యం పెరిగిన కొద్దీ వీటిలో కొన్నిటిని ఉల్లంఘించవలసి వస్తోంది. కొన్నాళ్ళకు అసలు జాబితా అంతా ఎత్తివెయ్యటం జరుగుతుందేమో ” అన్నారు శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. - రావూరు కలం శీర్షికన తానొకటి తలస్తే... దైవమొకటి...
* 1932 లో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు, డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు గార్ల సమక్షంలో మద్రాసులో జరిగిన నాట్య కళాపరిషత్తు లో రాఘవయ్య గారి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసారు గూడవల్లి రామబ్రహ్మం గారు. నాగేశ్వరరావు పంతులుగారు ఆ ప్రదర్శనకు ముగ్ధులై రాఘవయ్యగారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చెయ్యాల్సిందిగా రామబ్రహ్మం గారికి సూచించారు. అయితే దీనికి గురువుగారి అనుమతి లభించలేదు రాఘవయ్యగారికి. అయినా పలువురి ప్రోత్సాహంతో ' మోహిని రుక్మాంగద ' చిత్రంలో నాట్యం చేసారు. కానీ అనుకున్నంత పేరు రాలేదు. దాంతో నిరుత్సాహపడినా రామబ్రహ్మం గారి ప్రోత్సాహంతో ' రైతుబిడ్డ ' చిత్రంలో చేసిన దశావతారాలు నృత్యం ఆయనకి చిత్రసీమలో గుర్తింపు తెచ్చిపెట్టింది. - ' శకపురుష ' వేదాంతం. 
 ఇంకా చాలా... ఈ క్రింది లింక్ లో.... 


Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 11 Pub. No.006
Thursday, November 7, 2019

కార్తీకమ్... ట్రంకు పెట్టె... బాపూ ! నీకోసం... దాశరథీ ! కవితా పయోనిధీ !... ఇంకా...

 * ఆ రాత్రి – ఉండబట్టలేక – అటు ఇటు ఎవరూ తనని గమనించడంలేదని నిర్ధారణ అయాక ఇల్లంతా చుట్టబెట్టి, ప్రతీ గదీ గాలించింది తన ట్రంకు పెట్టె కోసమని ! ఎక్కడయినా కనిపిస్తేగా అది ! ఇంకెక్కడి పెట్టె !- " ట్రంకు పెట్టె " ( రచయిత స్వరంలో ఈ కథ వినండి )
* “ సత్యమే పలకడం, ప్రతి జీవిని సమానంగా చూడడం, అహింసావాదం అంటే, ఏదీ కొట్లాడకుండా నిరాహారదీక్ష చేస్తూ సత్యాగ్రహమే తన ఆయిధం గా చేసుకుని తెల్లదొరలమీద, అంటరానితనమనే జాడ్యం మీద యుధ్ధం చేసాడు కనకనే ఆయనని మహాత్మా అని ప్రజలు నాయకులు అన్నారు నాయనా! ” - " బాపూ ! నీకోసం... "
* తెలుగు చలనచిత్ర ప్రపంచంలోకి ఎందఱో కవులు వచ్చారు. కొందరే ప్రేక్షక శ్రోతల మదిలో నిలిచిపోయారు. శ్రోతలు పాట వింటూ దృశ్యం ఊహించుకునేలా రాయగలగడం అందరికీ సాధ్యం కాదు. అందులో దాశరథి అగ్రగణ్యులు. ఆయన పాట వింటే చాలు....దృశ్యం మన కళ్ళముందు కదలాడుతుంది. - " దాశరథీ ! కవితా పయోనిధీ ! "

ఇంకా.... ఈ క్రింది లింక్ లో......
శిరాకదంబం 09_005  
Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 11 Pub. No. 005
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం