కనుక్కోండి చూద్దాం - 39 - జవాబు
జగపతి వారి ఈ చిత్రం 1970 లో వచ్చింది.
1 ) ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఎవరు ?
జవాబు : అక్కినేని సంజీవి. ఆయన ఇంకా ధర్మదాత, అత్తగారు కొత్తకోడలు, నాటకాలరాయుడు, మల్లమ్మ కథ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
2 ) ఆ దర్శకుడు అంతకుముందు ఏ శాఖలో ప్రసిద్ధుడు ?
జవాబు : ఎడిటింగ్. అక్కినేని సంజీవి గారు ఎడిటింగ్ లో నిష్ణాతుడు. విదేశీ చలన చిత్రోత్సవాల్లో పాల్గొనే చిత్రాలకు మన తెలుగు చిత్రాల నిడివి ఎక్కువైనపుడు వాటిని అర్థవంతంగా కుదించి పంపించిన ఘనత సంజీవి గారిది.
అంతేకాదు. అప్పట్లో మనకు కొత్తైన సబ్ టైట్లింగ్ ప్రక్రియను సరైన పరికరాలు లేకుండా మామూలు లాబరేటరీలో అత్యంత ప్రతిభావంతంగా రూపొందించి చిత్రోత్సవాలకు పంపించారు. ఆ తర్వాత చాలా కాలానికి గానీ సబ్ టైట్లింగ్ పరికరం మన దేశానికి రాలేదు. సంజీవి గారు అలా నిడివి కుదించి సబ్ టైట్లింగ్ చేసిన చిత్రాల్లో నమ్మినబంటు, అంతస్తులు, పదండి ముందుకు, సాక్షి లాంటి చిత్రాలు వున్నాయి.
పైన ఇచ్చిన ప్రశ్నలకు రాజేంద్రకుమార్ దేవరపల్లి గారు సరైన సమాధానమే ఇచ్చారు. వారికి ధన్యవాదాలు.
మనవి : అక్కినేని సంజీవి గారి ఫోటో నాకు దొరకలేదు. మిత్రులు ఎవరిదగ్గరైనా వుంటే పంపగలరు.
Vol. No. 02 Pub. No. 180a
No comments:
Post a Comment