- The Free Press Journal ( 24th March 1931 )
పరాయిపాలనలో మగ్గుతున్న భారతమాతకు విముక్తి కల్పించడానికి తమ ప్రాణాలకు తెగించి పోరాడిన ముగ్గురు స్వాతంత్య వీరులు షహీద్ భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు లు చివరకు ఆ ప్రాణాలనే త్యాగం చేసిన రోజు ఈరోజు.
ఉద్యమానికీ, యువతకూ నేటికీ నమూనాగా నిలిచిన మహావీరులను పరాయి పాలకులు నిర్దాక్షిణ్యంగా ఉరి తీసిన రోజు ఈరోజు.
జీవించింది అతి తక్కువకాలమైనా తరతరాలుగా ప్రజల గుండెల్లో కొలువు దీరిన స్వాతంత్ర్య పోరాట వీరుల బలిదానం జరిగిన రోజు
భారత స్వాతంత్ర్య పోరాట యోధులైన షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల ఉరి శిక్షను ప్రజల ఆగ్రహానికి గురికావలసి వస్తుందనే భయంతో అమలు చెయ్యాల్సిన సమయానికంటే ముందుగా అమలు చేసింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం.
మనం ఈనాడు అనుభవిస్తున్న స్వేచ్చకు ఆనాటి స్వాతంత్య పోరాట యోధుల త్యాగమే కారణం. ఆ స్వేచ్చ అయాచితంగా ఒక్కరోజులో రాలేదు. ఎన్నెన్నో పోరాటాలు. మరెన్నో బలిదానాలు. ఫలితమే ఈనాటి ఈ స్వేచ్చ.

దాదాపుగా ఈనాటి తరం ఈ స్వేచ్చ వెనుక చరిత్రను, దాన్ని ప్రసాదించిన మహనీయుల త్యాగాలను తెలుసుకోలేని ఈ తరుణంలో వారిని, వారి త్యాగాలను స్మరించుకోవడం, నవతరానికి తెలిసేటట్లు చెయ్యడం చాలా అవసరం. లేకపోతే దశాబ్దాల స్వాతంత్ర్య పోరాట స్పూర్తికి తూట్లు పోడిచినట్లే !
గత తరాలనుంచి ప్రస్తుత తరాలు...... ప్రస్తుత తరాల నుంచి భావి తరాలు... ఈ స్పూర్తిని గురించి తెలుసుకోవాలి. అప్పుడే మనమేమిటో మనం తెలుసుకోగలుగుతాం. మన పరిస్థితి ఏమిటో మనకి అర్థమవుతుంది. ఉద్యమ లక్ష్యాలంటే ఏమిటో తెలుస్తుంది. నిజమైన త్యాగం అంటే ఏమిటో అర్థం చేసుకుంటాం. ఎలాంటి విషయాల మీద, ఏ పద్ధతిలో పోరాటం చెయ్యాలో దిశా నిర్దేశం జరుగుతుంది. ఉద్యమాలు వ్యాపారమైపోయిన ఈ రోజుల్లో భావితరాలైనా దేనికి ఉద్యమాలు చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఉద్యమ లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకోవాలో అర్థం చేసుకోగలుతారు. ఈ విచక్షణా జ్ఞానం వలన నాయకుల మాటలను గొర్రెల్లా అనుసరించే అవసరం వుండదు.
అమరవీరులు షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లను ఉరి తీసి ఎనభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ...........
Vol. No. 02 Pub. No. 179
3 comments:
కారణజన్ములు మహామహితాత్ములు ఆ మువ్వురు మెరికలు,వారి పవిత్ర స్ఫూర్తికి వేనవేల పాదాభివందనాలు.
My silent tribute to the great leaders.
madhuri.
* రాజేంద్ర కుమార్ గారూ !
* మాధురి గారూ !
ధన్యవాదాలు
Post a Comment