కనుక్కోండి చూద్దాం - 38_జవాబులు
1 . ఈ ప్రక్క ఫోటోలో వున్న నటి, నర్తకి ఎవరు ?
జవాబు : అనురాధ
2 . ఆమె అసలు పేరు ఏమిటి ?
జవాబు : రాజ్యలక్ష్మి
3 . ఆమె కథానాయికగా నటించిన చిత్రం ఏది ?
జవాబు : పంచకల్యాణి.
అప్పట్లో ముగ్గురు రాజ్యలక్ష్మిలు చిత్ర పరిశ్రమకు వచ్చారు. మొదటి ఇద్దరూ శంకరాభరణం రాజ్యలక్ష్మి, హరిజన్ రాజ్యలక్ష్మి కాగా, మూడవవారు పంచకల్యాణి రాజ్యలక్ష్మి అనే అనురాధ.
ఒకటో క్లూ - మూడవ ప్రశ్నకు జవాబును అప్పట్లో రెండవ ప్రశ్న జవాబుకు జతచేసి పిలిచేవారు.
రెండో క్లూ - ఆమె అసలు పేరుతో అప్పట్లో ముగ్గురు నటీమణులు చిత్రరంగంలోకి వచ్చారు. Vol. No. 02 Pub. No. 169a
2 comments:
హరిజన్ రాజ్యలక్షి ఎవరండీ? ఎందులో నటించారు?
ఆ. సౌమ్య గారూ !
హరిజన్ రాజ్యలక్ష్మి ' హరిజన్ ' అనే చిత్రంలో కథానాయికగా నటించింది. ఆ చిత్రం విజయవంతం కాకపోవడంతో పెద్దగా ప్రచారం కాలేదు. తర్వాత రంగనాథ్, కవితల ' ఇన్స్పెక్టర్ ప్రతాప్ ( ? ) అనే చిత్రంలో సత్యేంద్రకుమార్ ప్రక్కన నటించింది గానీ నాకు గుర్తున్నంతవరకూ ఆ చిత్రం విడుదల కాలేదు. ఈ రాజ్యలక్ష్మికి వాణిశ్రీ పోలికలు బాగా ఉండేవి. ఒకే సమయంలో ముగ్గురు రావడం వలన అలా మొదటి సినిమా పేర్లతో అప్పట్లో పిలిచేవారు.
మీ ఆసక్తికి ధన్యవాదాలు.
Post a Comment