Thursday, December 16, 2010

ఆశయ సాధనలో అమరజీవి

 ఆమరణ నిరాహార దీక్షకు నిజమైన నిర్వచనం పొట్టి శ్రీరాములు
ఆశయ సాధనలో ప్రాణాలే పణంగా పెట్టిన నాయకుడు శ్రీరాములు
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు శ్రీరాములు
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీరాములు

నాలుగు దశాబ్దాల తెలుగు వారి ఆకాంక్ష ప్రత్యేక ఆంద్ర రాష్ట్రం
గాండ్రింపులు, గర్జనలు కాదు...దూషణలు, బెదిరింపులు కాదు
కుటిల రాజకీయాలు కాదు.... హింసలూ, ప్రతి హింసలూ కాదు
తెలుగు వారి కలను నిజం చేసి సాధించింది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం 

ఆది కుహనా నాయకుల కల్లబొల్లి దీక్ష కాదు... కఠోర దీక్ష
ఆది స్వార్థపూరిత లక్ష్యాలున్న దీక్ష కాదు... ప్రజాశయ దీక్ష
ఆది రాజకీయ లబ్ది పొందే దీక్ష కాదు .... నిజమైన దీక్ష
ఆది ఆస్తులు పెంచుకునే దీక్ష కాదు .... ఆత్మగౌరవ దీక్ష

విద్యార్థుల్ని , ప్రజల్ని ఉద్యమంలో ముందుంచ లేదు ఆయన
వారి ముందు తనే నిలబడి ఉద్యమించాడు ఆయన
అందుకే ఆ ఉద్యమంలో ముందుగా ఆహుతయ్యింది ఆయన
అందుకే ఏ ఉద్యమకారులకైనా ఆదర్శం ఆయన

నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుల నిర్విరామ కృషి ఫలితం ఆంధ్ర రాష్ట్రం
యాభై ఎనిమిది రోజుల శ్రీరాములుగారి అకుంటిత దీక్ష ఫలితం ఆంద్ర రాష్ట్రం
అఖిలాంద్ర ప్రజల ఆశయ సాధన కోసం ఆయన ఆహుతయ్యాడు
అందుకే...తెలుగు ప్రజలందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచి పోయాడు

1952 వ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన పొట్టి శ్రీరాములు గారు డిసెంబర్ 15 వ తేదీ అర్థరాత్రి ( తెల్లవారితే 16 వ తేదీ ) అమరజీవులయ్యారు. ఆ అమరజీవికి నివాళులు అర్పిస్తూ....... అలాంటి మహానీయుల్ని ఓసారి తల్చుకుందాం !





అమరజీవి పొట్టి శ్రీరాములు గారిపై గతంలో రాసిన టపా లింక్ :

http://sirakadambam.blogspot.com/2009/12/blog-post_15.html

Vol. No. 02 Pub. No. 085

2 comments:

Saahitya Abhimaani said...

రాజకీయాలకోసం సమైక్యవాదం పాడుతూ ఉద్యమాన్ని రెచ్చగొట్టిన ప్రతివాడూ కిందటేడు శ్రీరాములుగారి విగ్రహాలను వెతీకివెతికి తెలిసిన వారి సాయంతో గుర్తుపట్టి తెగ దండలు వేశారు. ఈసారి అలాంటి హడావిడి ఏమన్నా ఉన్నదా? పేపర్ చూడాలి. ఒక నిబధ్ధత గల నాయకుడి గురించి జ్ఞాపకం చేశారు.ధన్యవాదాలు.

ఈ రోజున ఆమరణ నిరాహార దీక్ష అంటే హాస్యాస్పదమైపోయింది.ప్రతివాడూ అదేమాట, రెండ్రోజుల్లో తంటాలుపడి పోలీసుల చేత బలవంతంగా లాగెయ్యబడినట్టు నటిస్తూ ఆవతలకి పోవటం,

SRRao said...

శివ గారూ !
అవసరాన్ని బట్టి ఊసరవెల్లుల్లా మారే రాజకీయనాయకులకు కిందటేడు వున్న ఆత్రత, అవసరం ఈ ఏడు లేదు. అందుకే అంత హడావిడి లేదు. ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం