కనుక్కోండి చూద్దాం - 34
1 . గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వర రావు గారి జయంతి సందర్భంగా ప్రచురించిన టపాలో ఆయన చిత్రాల్లో పాడిన కొన్ని పద్యాలు ఇవ్వడం జరిగింది. అవి ఈ లింకులో వినవచ్చు.
http://sirakadambam.blogspot.com/2010/12/blog-post_04.html
విన్నాక అవి వరుసగా ఏయే చిత్రాల్లోనివో చెప్పడానికి ప్రయత్నించండి ?
2 . మామ మహదేవన్ జయంతి సందర్భంగా ప్రచురించిన టపాలో ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చిన కొన్ని ఆణిముత్యాల శకలాలు వుంచడం జరిగింది. అవి ఈ క్రింది లింకులో వినవచ్చు.
http://sirakadambam.blogspot.com/2010/12/blog-post_552.html
విన్నాక అవి వరుసగా ఏయే చిత్రాల్లోనివో చెప్పడానికి ప్రయత్నించండి ?
Vol. No. 02 Pub. No. 078
3 comments:
ఘంటసాల పాడిన పాటలు వరుసగా...(_ అని పెడితే తెలీదని అర్థం)
తెనాలి రామకృష్ణ,శ్రీకృష్ణార్జున యుద్ధం,పాండవవనవాసం,___,పాండురంగమహత్యం,నర్తనశాల,భూకైలాస్,___,శ్రీవెంకటేశ్వర మహత్యం,___,శ్రీకృష్ణసత్య ( iam not sure),శ్రీకృష్ణపాండవీయం,( ఇది కూడా నాకు డౌటే),___, హరిశ్చంద్ర.
చాలాబావున్నాదండీ పద్యాల మెడ్లీ. అన్ని వినేసరికి మనసు ఆనందపారవశ్యమైంది. :)
అయిన నేను అలిగాను. మీరు లవకుశ పద్యాలు పెట్టకపోవడం ఏమీ బాలేదు. :(
శ్రీ కృష్ణ సత్య లోని పద్యాలున్నట్టు నాకనిపించలేదు ."కస్తూరికా తిలకమ్మును బోనాడి....ఏమేమి సేయుమనునో ఆ సంయ మీoద్రుడు " క్షమించాలి నాకు పద్యం సరిగా గుర్తులేదు, ఆపద్యంపాడిన తీరు ,దానిపై NTR గారి నటన చాలా బావుంటాయి. ఆ సినిమాలోని రాయబార పద్యాలు కూడ బాగుంటాయి.సౌమ్య గారన్నట్లు లవకుశ చిత్రంలోని పద్యాలు లేవు. భీష్మ చిత్రం లోని "కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి." అనే పద్యం ,అలాగే శ్రీక్రిష్ణావతారము లోని యుద్దరంగంలో పాడిన
"గీతోపదేశం" పాట పెడితే బావుండు ననిపిస్తుంది .మీరు పెట్టిన అన్నీ పద్యాలు ఆణిముత్యాలు .విని ఆనందించాను.మీకు ధన్య వాదములు.మీరేదో చెప్పమంటే నేనేదో చెబుతున్నాను క్షమించాలి.
* ఆ. సౌమ్య గారూ !
మీ ప్రయత్నానికి ధన్యవాదాలు. ఇది తయారుచెయ్యడం వాయిదాలలో జరిగింది. అన్నీ పెట్టినా చివరలో ఎడిట్ చేసి కలిపేటపుడు ఒక ఫైల్ మాత్రం మిస్ అయింది. అందులో లవకుశ పద్యాలు కూడా వున్నాయి. మీ అలక తీర్చేందుకైనా త్వరలో అవి కూడా ఇస్తాను.
* పీతాంబర్ గారూ !
మీ ప్రయత్నానికి ధన్యవాదాలు. కొన్ని నేను మిస్ అయిన పద్యాలు గుర్తు చేశారు. సందర్భాన్ని బట్టి త్వరలో అవి కూడా అందించడానికి ప్రయత్నిస్తాను. కొన్ని నా దగ్గరున్నాయో లేదో అనుమానం. చూడాలి.
అన్నిటికీ విని గుర్తుపట్టి జవాబు చెప్పడం కొంచెం కష్టమే అయినా మిత్రులెవరైనా ప్రయత్నించడానికి మరో రెండు రోజులు చూసి సమాధానాలు ప్రచురిస్తాను.
Post a Comment