Monday, December 6, 2010

మామ పుట్టినరోజు

 సంగీతం విశ్వ జనీనం దానికి భాష లేదు
సంగీతానికి భావం ప్రధానం కానీ భాష కాదు

భావాన్ని, అందులోని మాధుర్యాన్ని అందుకొన్న మహానుభావుడు
మాతృభాష కాకపోయినా తెలుగు సంగీతాన్ని స్వంతం చేసుకున్న మహాదేవనుడు 

ఆయనే కృష్ణన్ కోవిల్ వేంకటాచల భాగవతార్ మహదేవన్
మనం ముద్దుగా మామ అని పిలుచుకునే కె. వి. మహదేవన్

 తమిళనాడుకు ఆ కొసన వున్న నాగర్ కోవిల్ ప్రాంతం నుంచి మద్రాస్ కు వచ్చి సినిమాల్లో పనిచెయ్యాలని ఉబలాట పడిన ఆయనకు ఆ పని అంత సులువు కాలేదు. నెలకు పదిహేను రూపాయిల జీతం మీద రెండు మూడు చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేశారు. నాటకాల్లో నటించారు. హరికథలకు సహకారమందించారు. హోటల్ సర్వర్ గా పనిచేశారు. సైకిల్ మేసేంజేర్ గా పనిచేశారు. గ్రామఫోన్ కంపెనీలో రోజు వారీ వేతనానికి వాయిద్యకారుడిగా పనిచేశారు. ఇలా ఎన్నో కష్టాలు పడి తన సంగీత సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు మహదేవన్.

వైవిధ్యం ఆయన జీవితంలోనే వుంది. పుట్టింది కేరళలో... పెరిగింది తమిళనాడులో... సంగీత దర్శకుడిగా ప్రఖ్యాతి పొందింది ఆంద్ర దేశంలో.... ఇంతకంటే వైవిధ్యం ఉంటుందా ? ఎన్ని భాషల్లో సంగీతం చేసినా తెలుగు భాషలో చేసినన్ని పాటలు ఇంకే భాషలోను చెయ్యలేదు.

మహదేవన్ ది రెడీమేడ్ సంగీతం కాదు. సాహిత్యానికి స్వరం చెయ్యడమే ఆయనకు తెలుసు. అంతేకాదు. కథ, కథనాలు, సన్నివేశ ప్రాధాన్యాలు క్షుణ్ణంగా తెలుసుకుని స్వరకల్పన చేసేవారు. అందుకే అవి కథలో మమేకం అయ్యేవి. దర్శకుని కల్పనతో సన్నివేశానికి ఎంత బలమొస్తుందో మామ తన సంగీతంతో అంతకంటే ఎక్కువ ప్రభావితం చేసేవాడు. బహుశా ఆధునిక కీ బోర్డు సంగీత దర్శకులకి ఇదంతా చాదస్తంగా కన్పించవచ్చు. కానీ మామ స్వయంగా సృష్టించిన పాటలు ఇప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉండడానికి, మనం హాయిగా పాడుకోగలగడానికి కారణం మాత్రం కథ మీద, సాహిత్యం మీద ఆయన తీసుకున్న శ్రద్ధ. లేకపోతే ఇన్ని వేల పాటలు కాలగర్భంలో కలసి పోయేవి.

సుమారు మూడున్నర దశాబ్దాలు తన సంగీతంలో మనల్ని ఓలలాడించిన కె. వి. మహదేవన్ జన్మదినం ( డిసెంబర్ 6 వతేదీ ) సందర్భంగా ఆయన తొలిసారిగా తెలుగులో సంగీత దర్శకత్వం చేసిన దొంగలున్నారు జాగ్రత్త, బొమ్మల పెళ్లి ( 1958 ) చిత్రాలనుంచి ఆయన చివరి చిత్రం స్వాతికిరణం  ( 1992 ) వరకూ కొన్ని వైవిధ్యభరితమైన పాటలను జ్ఞప్తికి తెచ్చే స్వర నీరాజనం మీకోసం.........



Vol. No. 02 Pub. No. 076

6 comments:

susee said...

maama puttina roju- mana andarikee panduga roju-

కొత్త పాళీ said...

చాలా బావుంది సార్ మీ నీరాజనం + మెడ్లీ

Dr.Suryanarayana Vulimiri said...

రావు గారు, మీరు సమకూర్చిన మామ పాటల రూపకం అపురూప(క)ము, అపూర్వం. హుషారు పాటలలో - మావ మావ మావ (మంచి మనసులు), గౌరమ్మ నీ మొగుడెవరమ్మా (మూగ మనసులు), నేను పుట్టాను లోకం మెచ్చింది (ప్రేమ నగర్) మరవలేనివి. మీ ఓపికకు, కళాభిమానానికి జోహార్లు. నాకు కూడ ఏదయినా వ్రాయాలనిపిస్తోంది. ప్రయత్నిస్తా.

Rao S Lakkaraju said...

Really a trilling compilation of music of the master. Thanks for the time you spent on this project.

Rao S Lakkaraju said...

Really a thrilling compilation of music of the master. Thanks for the time you spent on this project.

SRRao said...

* సుబ్బారావు గారూ !
* కొత్తపాళీ గారూ !
* సూర్యనారాయణ గారూ !
* రావు గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం