Sunday, December 12, 2010

ఆంధ్రభాషోద్దారకుడు

 ఆంధ్ర మహాభారతము, ఆంధ్ర మహాభాగవతము లేని తెలుగును ఊహించగలమా ?
వేమన పద్యాలు, సుమతీ శతకము అనేవి లేకుండా తెలుగు భాష ఉంటుందా ?

ఆదికాలం నుంచి అనేక కావ్యాలు, గ్రంథాలు మన తెలుగులో వున్నాయని మనకు తెలియకపోతే...?
మనకొక వ్యాకరణం ఉందనీ, అనేక వేల పదాలు తెలుగులో వున్నాయని మనకు తెలియకపోతే...?

శ్రుత పాండిత్యమే గానీ, గ్రంథస్తం కాని ఎన్నో అపురూప గ్రంథాలు మనకు లభించకపోతే.....?
మనకున్న అంతులేని, అద్భుతమైన ప్రాచీన సాహిత్య సంపద మనకు లభించకపోతే...?

............ ఇవన్నీ ఊహించడం కష్టం.

ఎందుకంటే ఇవన్నీ మనకిప్పుడు లభ్యమవుతున్నాయి కనుక... !
కానీ ఇవన్నీ అంత సులువుగా మనకి లభ్యమయ్యాయా ?

లేదు.. నిజానికి ఒకప్పుడు ఈ సంపదను గురించి పట్టించుకునే నాథుడు లేడు
చాలా సాహిత్య సంపద కాలగర్భంలో కలసిపోయే దుస్థితి దాపురించింది

తెలుగు భాష వికాసాన్ని కోల్పోయి మరణించే స్థితికి చేరింది
తెలుగు సరస్వతి కళ కోల్పోయి దీనస్థితికి చేరింది

తెలుగును ఉద్ధరించి తెలుగు సరస్వతిని పునర్జీవింపజేసిన వ్యక్తి
తెలుగు భాషా వికాసానికి తన సర్వస్వాన్ని ఒడ్డిన మహనీయుడు

... అతను మాత్రం తెలుగు వాడు కాదు. అసలు భారతీయుడే కాదు 

" మినుకు మినుకు మంటున్న తెలుగు వాంగ్మయ దీపాన్ని స్నేహశిక్తం చేసి ప్రజ్వలింపచేసిన  ఆంద్రభాషోద్దారకుడు "
అని ప్రముఖ కవి జానమద్ది హనుమచ్చాస్త్రి కొనియాడిన మహనీయుడు చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్.

వ్యాపారం పేరుతో మన దేశ సంపదను కొల్లగొట్టిన బ్రిటిష్ సంతతి వాడు సి. పి. బ్రౌన్
తన సంపాదన మాత్రమే కాక అప్పులు చేసి మరీ తెలుగు భాషాభివృద్ధికి కృషిచేసిన దొర బ్రౌన్   

అవసరార్థం తెలుగు నేర్చుకుని అటు పిమ్మట తెలుగు మీద మక్కువ పెంచుకున్న ఆంగ్లేయుడు
భాషా పరిశోధన, పరిష్కారం, స్వీయ రచనలు, ప్రచురణ... అనే ప్రణాళికను పాటించిన వాడు



శిదిలమైపోతున్న ఎన్నో గ్రంథాలను వ్రాయసకాళ్ళను నియమించి తిరగ రాయించారు
కేవలం శ్రుత పాండిత్యానికే పరిమితమైన సాహిత్యాన్ని సేకరించి గ్రంథస్థం చేయించారు 


 భావితరాలు భాషార్థాలు మరచిపోకుండా ఉండేందుకు నిఘంటువులు వెలువరించారు
దేశం విడిచి తరలిపోయిన మన సాహిత్య సంపదను తిరిగి తెచ్చి మనకి అప్పగించారు

స్వంత డబ్బు ఖర్చు పెట్టి పరభాషైన తెలుగును బతికించిన మహానుభావుడు బ్రౌన్
ఆయన్ని మరచిపోవడం మన మాతృభాషను మరచిపోవడమే... మనల్ని మనం మరచిపోవడమే !

తెలుగు దొర, ఆంద్రభాషోద్ధారకుడు సర్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వర్థంతి సందర్భంగా స్మృత్యంజలి ఘటిస్తూ....... 

బ్రౌన్ దొర గురించి గతంలో రాసిన టపా ఈ క్రింది లింకులో .............

http://sirakadambam.blogspot.com/2009/11/blog-post_11.html 

పై టపాకు స్పందిస్తూ ప్రముఖ కవి, బ్లాగ్మిత్రులు ఆచార్య ఫణీంద్ర గారు బ్రౌన్ దొరపైన రాసి పంపిన పద్యాలు ఈ క్రింది లింకులో ....

http://sirakadambam.blogspot.com/2009/11/blog-post_5470.html


ఒక తియ్యని తెలుగు పాట విందాం .................



                       
Vol. No. 02 Pub. No. 081

5 comments:

Vinay Datta said...

He has done yeoman service.

SRRao said...

మాధురి గారూ !
ధన్యవాదాలు

రాం చెరువు said...

Ayya, naa daggara Brown doragaari samadhi photo vundi.. pampavantara?

SRRao said...

రాంచెరువు గారూ !
అంతకంటె భాగ్యమా ! తప్పక పంపండి. మీ అభిమానానికి ధన్యవాదాలు.

Unknown said...

ఆంద్రభాషొద్ధారకుడు
12/12/10

బ్రౌన్ దొర వారు మన భాషకు జాతికి చేసిన సేవ చిరస్మరణీయం. వారిని రోజూ తలుచుకుని మరీ గ్రంధాలను teరుస్తున్న వ్యక్తులు నాకు తెలుసు. నేను యువకుడుగా వున్నప్పుడు బ్రౌన్ సాహితీ సేవ అన్న్ హంసంపై సభలు జరిపి నప్పుడు వారి పైకల గౌరవం. పెద్దలు యువకులు సాహితీ వేత్తలు మొరొ మారు వారొచ్చవాలు జరిపితే చూడాలని ఉంది.

గుమ్మా రామలింగ స్వామి
26/07/2013

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం