Thursday, November 5, 2009
న భూతో న భవిష్యతి ' నాగయ్య '
పాత్రలో జీవించడం అనే మాటకు భాష్యం చెప్పిన నటుడు నాగయ్య. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన నట జీవితంలో 1942 లో వచ్చిన ' భక్త పోతన ' ఓ మైలు రాయి. ఆ చిత్రంతో ఆయన అందుకున్న సత్కారాలు, పురస్కారాలు నభూతో నభవిష్యతి. బహుశా ఏ నటుడు ఆ స్థాయిని అందుకోలేరేమో ! గొప్ప పండితుడు, మాజీ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ అంతటి మహానుభావుడు కూడా ఆ చిత్రంతో నాగయ్య అభిమాని అయిపోయారంటే ఆయన గొప్పతనం అర్థం చేసుకోవచ్చు.
అభినవ పోతనగా ఒకవైపు ప్రజల నీరాజనాలందుకున్న నాగయ్యకు కనకాభిషేకాలు, గజారోహణలు, గండ పెండేరాలు... ఇలా ఒకటేమిటి, అడుగడుగునా అభినందనాలే ! తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్ళిన నాగయ్యకు అప్పటి మహంతి రత్నకంబళి పరచి స్వాగతం చెప్పారట. ఇంత అద్భుతమైన సత్కారం ఏ కళాకారుడికి జరుగలేదు, జరుగబోదు. మైసూరు మహారాజా వెండి పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి, ఆ నీళ్లు తన నెత్తిన చల్లుకున్నారట. పిఠాపురం రాజా అప్పటి రోజుల్లోనే ఆయనకు లక్ష రూపాయలు బహుకరించారట. తిరువాన్కూర్ సంస్థానాధిపతి కనకాభిషేకం చేసారట. పోతన చిత్రం చూసి పరమ నాస్తికుడైన తమిళ హాస్య నటుడు ఎస్. ఎన్. కృష్ణన్ ఒక వెండిపళ్లెంలో వెండి నాణాలు పోసి పట్టు వస్త్రాలతో నాగయ్య గారిని సత్కరించాడట. ఏ కళాకారుడికైనా ఇంతకంటే ఏం కావాలి ? అందుకే నాగయ్యగారి లాంటినటుడు నభూతో నభవిష్యతి. అందుకే ఏ రాజకీయ పైరవీలు లేకుండానే ఆయన్ని ' పద్మశ్రీ ' వరించింది. ఆ అభినవ పోతన నాగయ్యగారి కీర్తన ఇదిగో ......
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
3 comments:
నాకూ నాగయ్య గారు ఇష్టమేనండీ. త్యాగయ్య లో ఆయన పాడిన కృతులు ఎంత బాగుంటాయని..
మీ దగ్గర భక్తపోతన సినిమా గనక వుంటే అందులోంచి శ్రీనాథుడు ఉండే దృశ్య శకలం ఏదైనా చూపించగలరా?
తృష్ణ గారూ !
ధన్యవాదాలు. మరోసారి త్యాగయ్య ను అందిస్తాను.
కొత్త పాళీ గారూ !
భక్తపోతన లో మీరడిగిన శకలం సిద్ధం చేసి తప్పక చూపిస్తాను.
Post a Comment