Saturday, November 7, 2009

కార్నర్ సీటు

మనిషి ఎంత ఎదిగినా అతనిలో చిన్న పిల్లల మనస్తత్వం ఎక్కడో దాక్కుని ఉంటుంది. అప్పుడప్పుడు బయిటపడుతూ ఉంటుంది. ఆ మనస్తత్వానికి రావిశాస్త్రి గారి ఆవిష్కరణ......

గమనిక : స్పష్టత కోసం పైన క్లిక్ చెయ్యండి.

4 comments:

మాలతి said...

యస్.ఆర్.రావుగారూ, మొత్తంమీద సాధించేనండీ. నా IE సమస్య ఫైర్ ఫాక్స్ తో వదిలింది. ఇంతకీ, కథ, నాకు తోచలేదు. అది చిన్నపిల్లలమనస్తత్త్వం అంటారా? బాగుంది. మిగతావి కూడా చూస్తాను.
అభినందనలతో
మాలతి

SRRao said...

మాలతి గారూ !
మిమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెట్టిన బ్రౌజరు సమస్య తీరిపోయినందుకు సంతోషం. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
నాకు కాలేజీ రోజులనుంచి కథలు, నవలలు ఎక్కువగా చదవడం, అప్పుడప్పుడు కథలు, కవితలు రాసుకోవడం అలవాటు. ఎప్పుడూ ప్రచురణ గురించి ఆలోచించలేదు. సమీక్షలు అసలు అలవాటులేదు. నాటికలు మాత్రం రాసుకుని ప్రదర్శించేవాళ్ళం. తర్వాత కాలంలో కొన్ని టీవీ కార్యక్రమాలకు, ముఖ్యంగా నా సీరియల్ కు నేనే స్క్రిప్ట్ పని చేసుకునేవాడ్ని. అంతకంటే నాకు రచనలో పెద్దగా అనుభవం లేదు. అందుకని నావి సమీక్షలు మాత్రం కావు. పరిచయాలే !
రావిశాస్త్రి గారివే కాదు. మంచి కథలన్నీ నాకిష్టమే ! అప్పుడు చదువుకున్న వాటిని, సేకరించిన విశేషాలని ఈ తరానికి పరిచయం చెయ్యాలనే బ్లాగ్ లో రాయడం ప్రారంభించాను. మీ సలహాలు, సూచనలు అందిస్తే నాకు మహదానందం.

మాలతి said...

రావుగారూ, అవునండీ, అసలు ఆ పేర్లే విననివారికి ఇలా పరిచయం చెయ్యడం ఎంతో బాగుంది. మీస్పందనద్వారా మరొకరికి కూడా ఆకథల్లో ఆసక్తి కలిగించడం కూడా ఉచితమే.
పోతే, అసందర్భప్రలాపనే అయినా మరొకమాట చెపుతాను. కుడివేపు ప్రకటనలమూలంగా, కొన్నికంప్యూటర్లకి శ్రమ. మీయిష్టం అనుకోండి.

SRRao said...

మాలతి గారూ !
శ్రమ తీసుకుని నా కథా పరిచయాలు చదివి స్పందించినందుకు కృతజ్ఞతలు. ప్రకటనల విషయంలో వాటివలన ఆర్థికంగా ప్రయోజనం ఏమీ లేకపోయినా కొన్ని కారణాలవలన వుంచవలసి వస్తోంది. అయినా మీ సలహాననుసరించి ఒక తొలగించాను. దశలవారీగా మిగిలినవి కూడా తొలగిస్తాను. పెద్దలు, అనుభవజ్ఞులు మీ సలహాలు నాకు చాలా అవసరం. అవసరమనిపించినప్పుడు నన్ను హెచ్చరించడానికి సంకోచించకండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం