Sunday, November 8, 2009

బాల ' కులం '

అలనాటి ప్రముఖ జానపద గాయనీమణులు సీత, అనసూయలు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మేనకోడళ్ళనె విషయం అందరూ ఎరిగినదే ! ప్రముఖ నాట్య కళాకారుడు బి.వి. నరసింహారావు కూడా ఆయన మేనల్లుడే ! ఆయన రచయిత కూడా ! బాలల గేయాలు రచించారు. ఇంతటి ప్రసిద్ధుడైన ఆయన కులం గురించి అప్పట్లో చాలామందికి అనుమానం ఉండేది. ఒకసారి కొందరు సాహిత్యకారులతో సమావేశమైనపుడు ఈ విషయం చర్చకు వచ్చింది. ఒకాయన ఉండబట్టలేక నేరుగా నరసింహా రావుగారినే అడిగేసాడు ' మీదే కులం ? ' అని. నరసింహారావుగారికి కోపం వచ్చింది. ఆయనకు కుల ప్రసక్తి ఇష్టం ఉండేది కాదు. తమాయించుకుని తన రచన అయిన బాల గేయాల సంపుటిని చూపిస్తూ " మాది వ్యాకులం లేని కులం . బాల కులం " అన్నారు. అంతే ! ఇంకెవరికీ నోట మాట లేదు.
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం