

తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసులో వెలుగుతున్న రోజుల్లో టి. నగర్ లో ఉన్న పానగల్ పార్క్ లో చెట్ల మీద పక్షులతో బాటు చెట్ల క్రింద సినీ పక్షులు కూడా కాలక్షేపం చేసేవారు. ఒకరోజు సాయింత్రం అక్కడ ఎప్పటిలాగే కొంతమంది సాహితీ మిత్రులు సమావేశమయ్యారు. కబుర్లు పూర్తయ్యాయి. ఎవరిదోవన వాళ్లు ఇళ్ళకి బయిలుదేరారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని ఆరుద్ర గారు తన ఇంటికి ఆహ్వానించారు. చక్కగా రాచబాటలో..... అదేలెండి రోడ్డు మీదనుంచి కాకుండా అడ్డదారిలో మల్లాదిగారిని తీసుకేడుతున్నారు. పైగా అది తమ ఇంటికి చాలా దగ్గర దారని సంజాయిషీ కూడా ఇచ్చారు.
కొంత దూరం వెళ్ళాక ఒకచోట ముళ్ళ తీగ దారికి అడ్డువచ్చింది. ఆరుద్ర గారు వంగి ఆ తీగ క్రింద నుంచి దూరి అవతలికి వెళ్లిపోయారు. ఆ తీగను అలాగే పట్టుకుని మల్లాదిగారిని కూడా రమ్మన్నారు. ఆయన కూడా తల వంచి ఇవతలికి వచ్చారు.
" ఆరుద్రా ! మొత్తానికి నాకు తలవంపులు తెచ్చావయ్యా ! " అన్నారు మల్లాదివారు.
ఆరుద్ర గారేమైనా తక్కువ తిన్నారా !
" అడ్డదారులు తొక్కితే ఎవరికైనా, ఎప్పుడైనా తలవంపులు తప్పవు గురువుగారూ ! " అన్నారట ఆరుద్ర.
అదండీ సంగతి ! మరి ఇద్దరూ కూడా ' వాక్ ' శూరులే కదా !!
2 comments:
BAAGUMDI..
సుభద్ర గారూ !
ధన్యవాదాలు.
Post a Comment