Saturday, November 14, 2009
శుక్ల అంబర ధరం....
మహామహోపాధ్యాయ ' వేదం వెంకటరాయ శాస్త్రి ' గారు సంస్కృతాంధ్ర పండితులు. గురజాడవారి కన్యాశుల్కం తర్వాత తెలుగు ప్రజల్ని అంతగా ప్రభావితం చేసిన నాటకం ' ప్రతాపరుద్రీయం '. ఆ నాటక సృష్టికర్త శాస్త్రి గారే ! ఆ నాటకంలోని యుగంధరుడు పాత్రను నాటకప్రియులు ఎప్పటికీ మర్చిపోలేరు. 1890 ప్రాంతం నుంచి సుమారు పాతికేళ్ళు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో సంస్కృత పండితులుగా పనిచేశారు.
ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ " మనం మాట్లాడే ప్రతి మాటకు చెప్పినట్లుగానే శ్లోకాలకు కూడా అర్థమూ, విపరీతార్థమూ చెప్పవచ్చు " అన్నారు. శ్రోతలు ఈ విషయాన్ని వివరించమని అడిగారు.
వేదం వారు " శుక్లాంభరధరం శ్లోకానికి అర్థం తెలుసు కదా ! ఇప్పుడు విపరీతార్థం చెబుతాను. ' శుక్ల ' - తెల్లనైన, ' అంబర ' - వస్త్రములను, ' ధర ' - ధరించునదియు లేక మోయునదియు, ' విష్ణు ' - వ్యాపించుచున్నట్టిదియు అంటే స్థిరముగా ఒకచోట ఉండక తిరుగునదియు, ' శశివర్ణం ' - బూడిదరంగు కలిగియున్నట్టిదియు, ' ప్రసన్న వదనం ' - ప్రసన్నమైన ముఖం కలది అయిన, ' ధ్యాయే ' - నిన్ను ధ్యానించుచున్నాము అని ' గాడిద ' ను ప్రార్తిస్తున్నట్లు అన్వయించవచ్చు " అన్నారు.
అందరూ వినాయక ప్రార్థనగా చదువుకునే ' శుక్లాంభరధరం ' శ్లోకాన్ని గాడిదపరంగా చెప్పేటప్పటికి ఆనందించారు. అయితే ఒక శ్రోతకు ఇది అసంబద్ధంగా తోచింది.
" శాస్త్రి గారూ ! విఘ్నాలేమీ రాకూడదని వినాయకుణ్ణి ప్రార్థిస్తాం గానీ గాడిదను ప్రార్థించడమెందుకండీ ? " అని అడిగాడు.
దానికి శాస్త్రి గారు సమాధానం చెబుతూ " ముందు జాగ్రత్తగా మాకు అడ్డు వచ్చి విఘ్నాలు కలిగించవద్దని ప్రార్థించాలి " అని చెప్పారు.
Vol. No. 01 Pub. No. 106
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
2 comments:
ఈ విపరీత వ్యాఖ్యానం గణపతి నవలలో మొదటిపేజీలోనే ఉంది.
శంకరయ్య గారూ !
స్పందించినందుకు చాలా సంతోషం. మీరు చెప్పింది నిజమే ! ఇక్కడో విషయం. వేదం వారి జీవన కాలం 1853-1929. చిలకమర్తి వారిది 1867-1946. ' గణఫతి ' రచనా కాలం 1916 తర్వాత. ఇద్దరూ పూర్తిగా కాకపోయినా సమకాలికులే ! మహాకవి శ్రీశ్రీని తర్వాత కాలంలో చాలామంది అనుసరించినట్లు అప్పట్లో వేదం వారిని చిలకమర్తి వారు అనుసరించి ఉండవచ్చు. ఏమైనా మొదట ఎవరు చెప్పి ఉంటారనేది నిర్ణయించడం కొంచెం కష్టమే!
Post a Comment