Tuesday, November 3, 2009

తారల వేట


సి. పుల్లయ్య గారు అనగానే గుర్తుకొచ్చేది తెలుగులో తొలి రంగుల చిత్రం ' లవకుశ ' . విశేషమేమిటంటే 1934 లో వచ్చిన ' లవకుశ ' కూడా ఆయన నిర్మించినదే ! టాకీలు ప్రారంభమైన రోజుల నుంచి తెలుగు చిత్రసీమ అభివృద్ధికి దోహదపడిన మహనీయుల్లో ఆయన కూడా ఒకరు. ఎంతోమంది తారల్ని తెలుగు తెరకు అందించారాయన. ఆ క్రమంలో ఆయన తారల వేటలో ఉన్నపుడు జరిగిన తమాషా సంఘటన.
ఓసారి ఆయన రాజమండ్రిలో ఓ సంతకు వెళ్ళారు. అక్కడ తిరుగుతుండగా ఒకమ్మాయి చెరుకుగడ నములుతూ కనబడింది. ఆ అమ్మాయిని చూడగానే ఆయనకు మరో హీరోయిన్ దొరికింది అనిపించింది. వెంటనే కూడా ఉన్న తన అసిస్టంట్లను ఆ అమ్మాయిని పిల్చుకు రమ్మన్నారు. వాళ్లు వెళ్లి ఆ అమ్మాయితో మాట్లాడి పుల్లయ్య గారి దగ్గరకు తీసుకుని వచ్చారు. ఇది చూసిన ఆ అమ్మాయి తాలుకు వాళ్ళు కంగారుపడి తమ పిల్లనెవరో ఎత్తుకుపోతున్నారనుకుని అక్కడే వున్న పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలిసులు పుల్లయ్య గారిని, ఆయన శిష్యుల్ని స్టేషన్ కి తీసుకుపోయారు. తను చిత్ర దర్శకుడినని ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. చివరికి ఆ ఊర్లోనే పోలీస్ డిపార్టుమెంటులో ఉన్నతదికారిగా పనిచేస్తున్న పుల్లయ్యగారి బంధువొకాయన వచ్చి వాళ్ళని రక్షించారు. ఇంతకీ అప్పటికే ప్రముఖ దర్శకునిగా పేరు గడించిన పుల్లయ్య గారిని కాసేపు పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా నాయకునిగా చేసినది ఆ తర్వాత కాలంలో ఆయనే పరిచయం చేసిన అందాల నటి పుష్పవల్లి. ఇప్పటి ఎవర్ గ్రీన్ నటి రేఖ తల్లి.

1 comment:

mesnehitudu said...

hai friends
nenu na friends kalisi 5 minits short film prayatnam chesam.
ee link lo choosi me comments teliyajeyandi.

http://okkaavakasam.blogspot.com/2009/12/original-video-more-videos-at-tinypic.html

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం