Thursday, November 12, 2009

సుస్వర సుసర్ల

మధురమైన, మనోహరమైన గీతాల స్వరకర్త సుసర్ల దక్షిణామూర్తి. ఆయన గీతాలు ఇప్పటికీ శ్రవణ ప్రియాలే ! ఆటా, పాటా కూడు పెడతాయా అనేవారు మనకి తరచుగా కనబడుతూనే ఉంటారు. దానికి జవాబు ఈ సంఘటన .
ఒకసారి సుసర్ల దక్షిణామూర్తి గారు రైలులో ప్రయాణం చేస్తున్నారు. రద్దీగా ఉంది. కాసేపటికి అందులో ' సంసారం ! సంసారం ! ప్రేమ సుధా పూరం ! ' అంటు సుసర్ల వారు స్వరపరచిన పాట వినబడింది. అందరు మైమరచి ఆ పాట వినసాగారు. సుసర్ల వారు కూడా ఆనందంగా ఆ పాట విన్నారు. పాట అయిపోయాక ఆ పాట పాడుతున్న బిచ్చగాడు అందరితో బాటు సుసర్ల గారి దగ్గరకు కూడా వచ్చాడు. అప్పటికే ఆయన్ని గుర్తుపట్టిన తోటి ప్రయాణికులు ఆ బిచ్చగాడితో ఆ పాట ఆయనదేనని చెప్పారు. అంతే వాడు చాలా ఆనందపడ్డాడు. ' మీ పాటలతో రొజూ పదిరూపాయిలు సంపాదించుకుంటున్నాను బాబయ్యా ! మీరు, మీ కుటుంబం చల్లగా ఉండాలి ' అన్నాడు. తనకు ఇంతకంటే గొప్ప సన్మానం జీవితంలో ఉండదని పొంగిపోయారు దక్షిణామూర్తి గారు.
ఆయన స్వరకల్పనలో వచ్చిన ఆణిముత్యాల్లోంచి ఏరిన నాలుగు ముత్యాలు మీకోసం.....................


2 comments:

Jalasutram said...

ఆయన్ని (సుసర్లవారిని) చిత్రసీమకు పరిచయం చేసింది శ్రీ సి.ఆర్.సుబ్బరామన్. "మనుచుగా తా ఖుదా తోడై" పాటతో.మాధవపెద్ది సత్యంగారికి కూడా అదే మొదటి పాట. ఇంతకీ ఆ పాట ఏ సినిమాలోదో చెప్పుకోండి చూద్దాం!

SRRao said...

జల సూత్రం గారూ !
చాలా సంతోషం. మరింత సమాచారాన్ని జోడించినందుకు కృతజ్ఞతలు. ఇక ఆ పాట ఏ చిత్రంలోదో తెలియదు. మీరు చెబితే నేను ఇది కూడా జోడించుకుంటాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం