
* విశాఖ జిల్లా మాడుగులలో ' తులాభారం ' నాటకం వెయ్యడానికి వెళ్ళినప్పుడు ఆయన మేకప్ ఒక ఇంట్లో వేసుకున్నారు. పూర్తయి బయిటకోస్తుండగా ఒకావిడ ఆయనకు బొట్టుపెట్టి మర్నాడు వాళ్ళింట్లో జరిగే పేరంటానికి పిలిచింది. అంతేకాకుండా స్థానం వారి చీర, నగలు పరిశీలించడం ప్రారంభించింది. ఇది చూసి ఆ ఇంటావిడ అసలు సంగతి బయిట పెట్టేటప్పటికి ఆశ్చర్యపోయింది. అంత సహజంగా ఉండేది ఆయన ఆహార్యం.
* ' తులాభారం ' నాటక ప్రదర్శన సమయంలోనే అనకాపల్లిలోమరో సంఘటన. కృష్ణుణ్ణి తూచడానికి రుక్మిణి తులసిదళంతో వచ్చింది. దాన్ని త్రాసులో వెయ్యగానే కృష్ణుడు కూర్చున్న వైపు త్రాసు పైకి లేవాలి. సరే కె. గోవిందరావుగారు అదే రుక్మిణి పాత్రధారి పద్యం పాడి తులసిదళం వేశారు. త్రాసు మొరాయించింది. లేవలేదు. అందరూ కంగారు పడ్డారు. వెంటనే సత్యభామ ( స్థానం ) అందుకుని " అక్కా ! మన భర్తకు ఇలాంటి గతి పట్టినదా అన్న ఆవేదనలో నీ ధ్యానము నిలకడ తప్పినట్లున్నది. మనసు లగ్నము చేసి మరల దళమును త్రాసునందుంచుము " అన్నారు. దాంతో గోవిందరావుగారు తేరుకుని మళ్ళీ పద్యం అందుకుని దళం వేసే లోపే త్రాసు పైకి లేచింది. మళ్ళీ స్థానం వారందుకుని " అక్కా ! నీ భక్తి పరాకాష్టకు చేరినది. చూచితివా ? " అంటూ పరిస్థితి సరిదిద్దారు.

Vol. No. 01 Pub. No. 108
2 comments:
పదవ తరగతి తెలుగు వాచకంలో "రంగస్థలంపై సమయస్ఫూర్తి" అని స్థానం వారు రాసిన పాఠం ఉంది. అందులో ఇలాంటి మరికొన్ని ఘట్టాలు ఉన్నాయి.
శంకరయ్య గారూ !
ఈ విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. అవి కూడా చూస్తాను.
Post a Comment