తెలుగు నాటక రంగంలో సత్యభామ అనగానే గుర్తుకొచ్చేది స్థానం నరసింహారావు గారే ! వివరాలు తెలుసుకోకుండా రంగస్థలం మీద సత్యభామగా చూసిన వారెవరూ పురుషుడే ఆ వేషం వేసాడంటే నమ్మేవారు కాదు. అంత సహజమైన రూపం. మరింత సహజమైన నటన. ఆయన నాటకానుభావంలో కొన్ని తమాషా సంఘటనలు......
* విశాఖ జిల్లా మాడుగులలో ' తులాభారం ' నాటకం వెయ్యడానికి వెళ్ళినప్పుడు ఆయన మేకప్ ఒక ఇంట్లో వేసుకున్నారు. పూర్తయి బయిటకోస్తుండగా ఒకావిడ ఆయనకు బొట్టుపెట్టి మర్నాడు వాళ్ళింట్లో జరిగే పేరంటానికి పిలిచింది. అంతేకాకుండా స్థానం వారి చీర, నగలు పరిశీలించడం ప్రారంభించింది. ఇది చూసి ఆ ఇంటావిడ అసలు సంగతి బయిట పెట్టేటప్పటికి ఆశ్చర్యపోయింది. అంత సహజంగా ఉండేది ఆయన ఆహార్యం.
* ' తులాభారం ' నాటక ప్రదర్శన సమయంలోనే అనకాపల్లిలోమరో సంఘటన. కృష్ణుణ్ణి తూచడానికి రుక్మిణి తులసిదళంతో వచ్చింది. దాన్ని త్రాసులో వెయ్యగానే కృష్ణుడు కూర్చున్న వైపు త్రాసు పైకి లేవాలి. సరే కె. గోవిందరావుగారు అదే రుక్మిణి పాత్రధారి పద్యం పాడి తులసిదళం వేశారు. త్రాసు మొరాయించింది. లేవలేదు. అందరూ కంగారు పడ్డారు. వెంటనే సత్యభామ ( స్థానం ) అందుకుని " అక్కా ! మన భర్తకు ఇలాంటి గతి పట్టినదా అన్న ఆవేదనలో నీ ధ్యానము నిలకడ తప్పినట్లున్నది. మనసు లగ్నము చేసి మరల దళమును త్రాసునందుంచుము " అన్నారు. దాంతో గోవిందరావుగారు తేరుకుని మళ్ళీ పద్యం అందుకుని దళం వేసే లోపే త్రాసు పైకి లేచింది. మళ్ళీ స్థానం వారందుకుని " అక్కా ! నీ భక్తి పరాకాష్టకు చేరినది. చూచితివా ? " అంటూ పరిస్థితి సరిదిద్దారు.
* మళ్ళీ అదే ' తులాభారం ' నాటకం. ఈసారి మద్రాసులో ! స్థానం వారి సత్యభామ ప్రక్కన కృష్ణుడు ఈలపాట రఘురామయ్య. ఈయనకు స్థానం వారంటే భక్తి, గురు భావం. సత్యభామ కృష్ణుణ్ణి కాలితో తన్నే సన్నివేశం. సరే ! తన్నడం అయిపోయింది. వెంటనే సత్యభామగా " స్వామీ ! అపచారం చేసితిని కదా ! " అంటూ సన్నివేశం రక్తి కట్టించడానికి కృష్ణుడి పాదాలకు నమస్కరించారు. ఇది ఉహించని రఘురామయ్యగారు కంగారుపడి అది నాటకమన్న విషయం మరిచిపోయి లేచి స్థానం వారి కాళ్ళకు నమస్కరించారు. ఆ పరిస్థితి సరిదిద్దడానికి స్థానం వారు " కృష్ణా ! ఏకాంతములో నేను నీకు గురువునే ! కానీ ఆ సంగతి ఇంకెప్పుడూ అనకుము " అన్నారు.
Vol. No. 01 Pub. No. 108
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
2 comments:
పదవ తరగతి తెలుగు వాచకంలో "రంగస్థలంపై సమయస్ఫూర్తి" అని స్థానం వారు రాసిన పాఠం ఉంది. అందులో ఇలాంటి మరికొన్ని ఘట్టాలు ఉన్నాయి.
శంకరయ్య గారూ !
ఈ విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. అవి కూడా చూస్తాను.
Post a Comment