Friday, August 12, 2011

వరలక్ష్మీవ్రత పుణ్యకథ


వరలక్ష్మీవ్రత పుణ్యకథ
వరములనోసగే  తల్లి కథ
పసుపు కుంకుమ సిరిసంపదలు
పెంపొందించే ప్రేమసుధ

సర్వమంగళ మాంగల్యే
విష్ణువక్ష స్థలాలయే
ఆవాహయామి దేవీత్వమాం
వరలక్ష్మి నమోస్తుతే

చల్లని తల్లీ ఓ కల్పవల్లీ !
వరలక్ష్మీ నీ యెద పాలవల్లీ !
 శుక్రవారము నిను పూజింతుము
శుభములియ్యవే మాతల్లీ !          
                .......  వరలక్ష్మీవ్రత పుణ్యకథ

సతి చారుమతిని కరుణించి
కలలో ఆమెకు కనిపించి
వ్రతము చేయమని ఆజ్ఞాపించి
సిరిసంపదల తులతూగించి
ఏలితివట సౌభాగ్యము నింపి

శ్రావణమాసము శుక్రవారమున
స్నానము చేసెను చారుమతి
అలికి ముగ్గులిడి ఆసనముంచి
బియ్యము పోసి కలశముంచి

పద్మాసనే పద్మకరే
సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవీం
సుప్రీతా భవసర్వదా

అని చెలికత్తెలతో వరలక్ష్మిని
ధ్యానించెను ఆ చారుమతి
షోడశోపచారమున పూజలిడి
తోరము దాల్చెను పుణ్యవతీ !

రూపము దాల్చిన భక్తిగ నిలబడి
కర్పుటపుటారతి శ్రీదేవి కిడి
పంచభక్ష్య పరమాన్నంబులతో
వరలక్ష్మికి నైవేద్యమిడి

తొలి ప్రదక్షిణముతో సతి పదముల
ఘల్లు ఘల్లని గజ్జెలు వెలిసే
మలి ప్రదక్షిణము చేయునంతలో
కరముల మణికంకణమున మెరిసే

రంగవుబంగరు దేహములు
రథగజతురంగ వాహములు
పుత్రపౌత్రధనధాన్యములు
భోగభాగ్య సౌభాగ్యములు
వ్రతము చేయు ఆ సతులకు కలిగెను
వరలక్ష్మి కృప వారికి కలిగెను         
                ........ వరలక్ష్మీవ్రత పుణ్యకథ
  డా. వక్కలంక లక్ష్మీపతిరావు గారి కలం నుంచి జాలువారిన ఈ గీతం శ్రీమతి ఎస్. జానకి గారి గళంలో వినండి.... 

 ఈరోజు వరలక్ష్మీవ్రతం జరుపుకుంటున్న సోదరీమణులకు శుభాకాంక్షలతో.............. 

Vol. No. 02 Pub. No. 315

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం