మనకి ఎంత పవరున్నా చాలదు. అందుకే ఇప్పుడే కాదు. ఎప్పుడూ పవర్ కట్టులే ! పవర్ కట్ లేని రోజులు, జీవితం ఊహించలేమేమో !
ఆంధ్రకేసరిగా ఎంత గర్జించినా ప్రకాశం పంతులుగారిలో హాస్య చతురత కూడా పుష్కలంగానే ఉండేది. ఆయన ముఖ్యమంత్రిగా వుండగా కూడా పవర్ కట్ అమలులో ఉండేది. రాజీనామా చేసాక ఆయన ఓసారి సెక్రటేరియట్ కి పనుండి వెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళేటప్పటికి కరెంటు పోయిందట. సిబ్బంది అంతా పనులు ఆపేసి కూర్చున్నారట. వారిని చూసి ప్రకాశం పంతులు గారు........
" ఏమిటీ ఖాళీగా కూర్చున్నారు ? పని చెయ్యడానికి మీక్కూడా నాలాగే పవర్ కట్టయిందా ? " అన్నారట.
Vol. No. 02 Pub. No. 313
2 comments:
ఇప్పటి నాయకులకు వాళ్ళ పవర్ కట్టైతే భరించగలరా! వాళ్ళు నోరు తెరిస్తే అన్నీ చెత్తరోక్తులే !
చతురోక్తులెక్కడ ? ఆంధ్ర కేశరి గురించి మంచి విషయం చెప్పారు.
అప్పారావు గారూ !
వ్యాఖ్యలోనే కార్టూన్ చూపించారు సర్. ధన్యవాదాలు.
Post a Comment