యక్షలోకం నుంచి భూలోకానికి దిగి వస్తుంది మోహిని.
ఇక్కడ కనిపించిన యువరాజును మోహిస్తుంది.
.... అలా దిగివచ్చిన మోహిని గొల్లభామగా అలరించింది.
దుష్ట పాత్రలో బాలరాజును బెదిరించింది.
పల్లెటూరి పిల్లగా అమాయకత్వాన్ని ఒలికించింది
అందాల బొమ్మగా అద్వితీయ నటనను పలికించింది
అనార్కలిగా భగ్న ప్రేమికురాలైంది
ఏ రూపంలోనైనా ఆ రూపానికే వన్నె తెచ్చింది... తెలుగు వారి గుండెల్లో కొలువైంది
ఇంకెవరు ?... ఆమె తెలుగు చిత్రసీమలో నటనాంజలి అంజలీదేవి కాక !
ఆమెకు బాలనటిగా యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అవకాశమిస్తే తన ప్రతిభతో హీరోయిన్ దశకు ఎదిగింది.
అక్కడ నిర్వాహకుడు, రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు అయిన ఆదినారాయణరావు సైకిల్ ఎక్కింది.
నాటకం రిహార్సల్స్ తో ప్రారంభించి.. ఆయనతో ఏడడుగులు నడిచి... వైవాహిక జీవిత రంగస్థలమెక్కింది.
స్ట్రీట్ సింగర్ లో నాట్యంతో సినిమా పుల్లయ్య గారి దృష్టిలో పడింది.
గొల్లభామలో వేషానికి అడిగితే అప్పటికే పెళ్లయినందున తిరస్కరించింది.
యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ మిత్రుడు ఎస్వీరంగారావు ప్రోత్సాహంతో ఆదినారాయణరావు గారు వరూధినితో చిత్రసీమలో అడుగుపెట్టారు.
సహచరిగా, ఇద్దరు పిల్లల తల్లిగా ఆయన వెంట నడచిన అంజలిలోని నటిని పుల్లయ్యగారు మాత్రం వదలలేదు.
అప్పట్లో ఆయన ప్రొడక్షన్ మేనేజర్, ఆదినారాయణరావు మిత్రుడు అయిన రేలంగిని ప్రయోగించి అనుకున్నది సాధించారు.
అలా పెళ్ళయి, ఇద్దరు పిల్లలకు తల్లయిన అంజలి తన చలనచిత్ర నటనా జీవితాన్ని 1947 లో 'గొల్లభామ ' గా ప్రారంభించారు. అచిరకాలంలోనే తన ప్రతిభను నిరూపించుకొని అగ్రస్థానానికి చేరారు.
కొన్ని పాత్రల్లో అంజలిని తప్ప మరొకరిని ఊహించుకోలేం. అంతగా ఆయా పాత్రల్లో ఇమిడిపోయారు. తెలుగు హృదయాల్లో అమరిపోయారు.
అప్పటికీ... ఇప్పటికీ... ఎప్పటికీ..... ఆమె నటనాంజలే !
అంజలీదేవి గారి గురించి గతంలో రాసిన టపా.....
అద్వితీయ తారామణి అంజలీదేవి జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ..........
Vol. No. 03 Pub. No. 010
4 comments:
The titles of your posts are captivating.
madhuri.
మాధురి గారూ !
ధన్యవాదాలు
Can't we bring those days again?
వెంకీ గారూ !
కష్టసాధ్యమే ! ధన్యవాదాలు.
Post a Comment