తెలుగు చిత్ర రంగానికి పౌరాణికాలకు విడదీయరాని అనుబంధం. తెలుగు పౌరాణిక చిత్రాలకు ఒక ప్రత్యేకత వుంది. కొన్ని పురాణ పాత్రలు కొంతమంది నటీనటులకోసమే సృష్టించబడ్డాయా అన్నంత అందంగా అమరిపోయాయి.
రాముడు, కృష్ణుడు గా నందమూరిని కాక మరొకరిని ఊహించలేం. రావణ, దుర్యోధన, ముఖ్యంగా కీచక పాత్రలకు ఎస్వీయార్ తప్ప మన మదిలోకి మరెవరైనా వస్తారా ! అలాగే శకుని పాత్ర అనగానే గతంలో అయితే సీయస్సార్, తర్వాత ధూళిపాళ మన కళ్ళముందు మెదులుతారు. నారదుడి పాత్ర కాంతారావు గారికి పేటెంట్ అయిపొయింది. ఇక స్త్రీ పాత్రల విషయంలో కొంత వైవిధ్యం వున్నా సీత పాత్రకు మన మనస్సులో అంజలీదేవి ముద్ర పడినట్లు ఇంకెవరూ పడలేదు.
అసలు తెలుగు రంగస్థలం మీద సత్యభామ పాత్రకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. దానికి కారణం ఆ పాత్ర స్వభావంలోని వైవిధ్యమే ! రుక్మిణి పాత్ర స్వభావం ఎక్కువగా సాత్వికతతో కూడి వుంటుంది. కానీ సత్యభామ అలా కాదు. ఆమెకు ప్రేమ ఎంత వుందో తాను అనుకున్నది సాధించాలన్న పట్టుదల కూడా అంతే వుంది. కృష్ణుడు తనవాడనే అహంకారంలా కనిపించే ఆత్మవిశ్వాసం వుంది. ఓ ప్రక్క ప్రేమ కురిపిస్తుంది. మరో ప్రక్క ఇంత ద్వేషమా అనిపించేలా అలుగుతుంది. అయితే నాథుని సన్నిధిలో ఆమె కోపమంతా మంచులా కరిగిపోతుంది. వైవిధ్యమున్న నటనకు, భావ ప్రకటనకు అవకాశమున్న పాత్ర కాబట్టే సత్యభామ పాత్రపై మన నటీనటులకు అంత మోజు. అటు నాటకాలలో, ఇటు నృత్యాలలో, అటు పిమ్మట సినిమాల్లో ఆ పాత్ర అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకుంది. అసలు కూచిపూడి నాట్యమనగానే ముందుగా గుర్తుకొచ్చేది భామాకలాపం మాత్రమే ! గతంలోని నాటక భామ స్థానం నరసింహారావు, కూచిపూడి భామగా వేదాంతం సత్యనారాయణ శర్మ అయితే ఇప్పటి ఆంద్రనాట్యం భామ కళాకృష్ణ. అలా రంగస్థలం మీద మగవారి నటనలో హొయలొలికించింది .....ఒలికిస్తోంది సత్యభామ.
ఇంతగా ప్రాముఖ్యత సంతరించుకున్న ఆ పాత్రను వెండితెరపైన సజీవం చేసిన నటి జమున. సత్యభామ పాత్ర ఎంతమంది ధరించినా మన మనసులో మెదిలేది జమున మాత్రమే ! హొయలు, లయలు, ధీరత్వం, కించిత్తు అమాయకత్వం....... ఇలా అన్ని రసాలను కలబోసిన సత్యభామను వెండితెరమీద ఆవిష్కరించారు జమున. ఆ పాత్ర స్వభావాన్ని కూలంకషంగా పరిశీలించి, పరిశోధించి, బాగా అర్థం చేసుకుని జీర్ణించుకున్నారేమో జమునకు ఆ పాత్ర అంతగా అమరిపోయింది. ఆ పాత్ర ఆవిడను ఎంతగా ప్రభావితం చేసిందంటే శ్రీకృష్ణ తులాభారం తర్వాత వచ్చిన చిత్రాల్లోని చాలా పాత్రల్లో అక్కడక్కడ ఆ ఛాయలు కనబడతాయి. అలాగని ఆవిడ నటన అక్కడే ఆగిపోలేదు. ఆగిపోతే ఇతర భాషలతో సహా 198 చిత్రాలు వచ్చేవి కాదు. అన్ని రకాల చిత్రాల్లో నటించారు. అన్ని రకాల పాత్రలు ధరించారు. ప్రేక్షకులను మెప్పించారు. అమాయకత్వం, గడుసుతనం, ప్రేమ, అభిమానం కలబోసిన పల్లెటూరి పిల్లగా ఆమె ధరించిన, ప్రేక్షకుల మనస్సులో శాశ్వత ముద్ర వేసుకున్న మరో పాత్ర ' మూగమనసులు ' గౌరి.
గుంటూరు జిల్లాలోని నిడమర్రులో జన్మించి దుగ్గిరాలలో పెరిగిన జమున రంగస్థలం మీద చాలా నాటకాల్లో నటించారు. ఆ రంగస్థలమే ఆవిడను చిత్రరంగంలోకి నడిపించింది. జమున నటన ప్రజానాట్యమండలి చెందిన దర్శకులు డా. గరికిపాటి రాజారావు దృష్టిలో పడడంతో ' పుట్టిల్లు ' చిత్రంలో అవకాశం లభించింది. తెలుగు చిత్ర నటీనటుల సంఘంలో చాలాకాలం చురుకుగా వ్యవహరించిన జమున కొంతకాలం రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యులుగా పనిచేసారు. తర్వాత భాజపా లో చేరి , కొంతకాలం తర్వాత రాజకీయాలనుంచి తప్పుకున్నారు.

ఈరోజు తెలుగు సత్యభామ జమున జన్మదినం సందర్భంగా ఆవిడకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ......
Vol. No. 03 Pub. No. 018
2 comments:
Happy Birthday to Jamuna garu. She's my favourite Satyabhama.
madhuri.
మాధురి గారూ !
ధన్యవాదాలు
Post a Comment