Saturday, August 13, 2011

వీరగంధము తెచ్చినారము

  వీరగంధము తెచ్చినారము - వీరుడెవ్వరో తెల్పుడీ 
పూసిపోదుము - మెడను వైతుము - పూలదండలు భక్తితో

తెలుగు బావుట కన్ను చెదరగ - కొండవీటను నెగిరినప్పుడు 
తెలుగు వారల కత్తి దెబ్బలు - గండికోటను గాచినప్పుడు 
తెలుగువారల వేడి నెత్తురు - తుంగభద్రను గలిసినప్పుడు 
దూరమందున్న సహ్యజ - కత్తినెత్తురు కడిగినప్పుడు 

ఇట్టి సందియమెన్నడేనియు - బుట్టలేదు రవంతయున్ 
ఇట్టి ప్రశ్నలు నడుగువారలు - లేకపోయిరి సుంతయున్ 
నడుము గట్టిన తెలుగు బాలుడు - వెనుక తిరుగండెన్నడున్ 
బాస యిచ్చిన తెలుగు బాలుడు - పారిపోవం డెన్నడున్

ఇదిగో యున్నది వీరగంధము - మై నలందుము, మై నలందుము 
శాంతిపర్వము చదువవచ్చును - శాంతి సమరంబైన పిమ్మట 
తెలుగునాటను వీరమాతను - జేసి మాత్రము తిరిగి రమ్మిక 
 పలు తుపాకులు పలు ఫిరంగులు - దారికడ్డము రాక తప్పవు 
  వీరగంధము తెచ్చినాము - వీరుడెవ్వరో తెల్పుడీ !! 

 - కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి 


   సప్త మహాపాతకాలు  - గాంధీజీ
   1 . సిద్ధాంత రహిత రాజకీయాలు 
   2 . శ్రమ రహిత సంపద 
   3 . నీతి రహిత వ్యాపారం 
   4 . నియమ రహిత విద్య 
   5 . హృదయ రహిత ఆనందం 
   6 . మానవత్వ రహిత విజ్ఞానం 
   7 . త్యాగ రహిత పూజలు 
 
Vol. No. 02 Pub. No. 319

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం