Friday, August 19, 2011

తీపి కానుక





మన జీవితమే మధురమైనది
అందులోని జ్ఞాపకాలు మరీ మధురమైనవి
మధురమైన జ్ఞాపకాలు జీవితాంతం పదిలపరచుకోదగ్గవి
అందుకే పూర్వకాలంలో అవకాశమున్న వాళ్ళు తమ చిత్రాలను గీయించుకునేవారు
అవకాశం లేని వాళ్లకి అది అందని పండే !


అందుకే కాబోలు 1727 లో కనుగొన్న సిల్వర్ నైట్రేట్ ద్వారా ఏర్పడ్డ సంయోగాలతో 1826 నుంచి ప్రయోగాలు మొదలుపెట్టారు. ఇవి 1833 లో లూయిస్ దాగరే ప్రయోగాలతో మలుపు తిరిగి 1839 లో  ఆధునిక రూపాన్ని సంతరించుకున్నాయి. దాగరే ప్రతిపాదించిన దాగరేటైపు అనే ప్రక్రియ యొక్క పేటెంట్ ను ఫ్రెంచ్ ప్రభుత్వం కొని ప్రజలపరం చేసిన రోజు 19 ఆగష్టు 1839 . అందని పండు అందరికీ అందినరోజు.

 ఆ విశేషానికి గుర్తుగా ప్రతీసంవత్సరం ప్రపంచ చాయాచిత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆరోజు ఈ పేటెంట్ ప్రపంచానికి తామందించిన మహత్తరమైన కానుకగా ఫ్రెంచి ప్రభుత్వం అభివర్ణించింది.

అప్పటినుంచి ఎన్నెన్నో మలుపులు తిరిగిన, మరెన్నో పోకడలు పోయిన ఈ చాయా చిత్రం మన జీవితాల్లో విడదీయరాని బంధం ఏర్పరచుకుంది. ఇక ఆ రసాయన బంధంలో మన జ్ఞాపకాలను ముద్రించే సాధనంగా వున్న కెమెరా కూడా ఎన్నో రూపాలను ఏర్పరచుకుంది. ఆ  కెమెరా ప్రస్తానం గురించి ప్రముఖ బ్లాగర్, కార్టూనిస్ట్ సురేఖ ( ఎం. వి. అప్పారావు ) గారు రాసిన
కెమెరా కధ
 అనే టపాలో చక్కగా వివరించారు. చదవండి.

అలాగే గతంలో రాసిన టపాల లింకులు............ 

మధుర స్మృతులు
తీపి జ్ఞాపకం ' చాయా చిత్రం '

 మిత్రులందరికీ ప్రపంచ చాయాచిత్ర దినోత్సవ శుభాకాంక్షలు 

Vol. No. 03 Pub. No. 005

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం