తెలుగునాట సినిమాల ప్రవేశానికి ముందు, ప్రవేశించిన తొలిరోజుల్లో నాటకరంగం ఓ వెలుగు వెలిగింది. అనేకమంది నటీనటులు రంగస్థలాన్ని సుసంపన్నం చేసారు. ఆధునిక నాటక ఆవిర్భావానికి నాంది పలికారు. వారిలో పందొమ్మిదవ శతాబ్దం ఉత్తరార్థంలో, ఇరవై వ శతాబ్దం పూర్వార్థంలో నాటక కళామతల్లికి ఎనలేని సేవలందించిన నటరత్నం బళ్ళారి రాఘవ.
ఏ పాత్రలోనైనా ఇమిడిపోయే అంగ సౌష్టవం, ఏ సంభాషణనైనా భావయుక్తంగా పలకగలిగే స్వరం, పాత్రల భావ ప్రకటనను ప్రస్ఫుటంగా ప్రతిఫలించే వదనం ఆయన సొత్తు. సుదీర్ఘమైన సంభాషణలతో, రాగమే ప్రథానంగా గల పద్యాలతో సాగే సాంప్రదాయ నాటకాలను క్లుప్తమైన సంభాషణలతో, రాగం కంటే హావభావ ప్రకటనకు ప్రాథాన్యతను ఇచ్చే విధంగా తీర్చిదిద్దడానికి కృషి చేసారు. స్త్రీ పాత్రలను పురుషులే ధరించే పద్ధతికి స్వస్తి చెప్పి స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించేటట్లు చెయ్యడానికి నాంది పలికారు. ఆయన కాలంలో ఎందఱో నటీమణులు తెలుగు నాటక రంగానికి లభించారు.
తెలుగులోనే కాక కన్నడం, హిందీ భాషలతోబాటు ఆంగ్ల భాషలో కూడా నాటకాలు ప్రదర్శించారు బళ్ళారి రాఘవ.
తన యావజ్జీవితాన్ని కళామతల్లి సేవలకే అంకితం చేసిన కళాకారుడు రాఘవ. వృత్తి రీత్యా న్యాయవాది అయినా నటుడిగానే జీవితంలో ఎక్కువ సంతృప్తి చెందారు. అంతేకాదు సంఘసేవకుడిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆధునిక నాటకరంగాన్ని మలచిన శిల్పి బళ్ళారి రాఘవ.
1880 లో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జన్మించిన తాడిపత్రి రాఘవాచార్యులు గారి జయంతి సందర్భంగా ఆయనకు కళానీరాజనాలు సమర్పిస్తూ.....
బళ్ళారి రాఘవ గారి గురించి గతంలో రాసిన టపాలు.....
నటరత్నం ' బళ్ళారి రాఘవ '
శిధిల శిల్పం
సమయ స్పూర్తి
Vol. No. 02 Pub. No. 302
3 comments:
తెలుగు నాటకాలన్నా పద్యాలన్న నేను చెవి కోసుకుంటాను. నా చిన్నప్పుడు హరిచంద్ర, చింతామణి, రామాంజనేయ యుద్ధం, భక్త ప్రహ్లాద, ఇట్లాంటి నాటకాలెన్నో చూసేవాడిని. బళ్ళారి రాఘువ గారి గురించి చాల గొప్పగా వినటమే కాని ఎప్పుడు చూడలేదు. బహుశా ఆయన శకం ముందు అయిపొయింది. థాంక్స్ ఫర్ పోస్టింగ్ this Ramachandra Rao garu.
బళ్ళారి రాఘవ గురించి వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నేను వ్రాసిన ధర్మవరం - కోలాచలం వ్యాసంలో వీరి ప్రస్తావన కొంత ఉంది.
http://turupumukka.blogspot.com/2011/07/blog-post_25.html
* నరేంద్ర గారూ !
ధన్యవాదాలు
* మురళీమోహన్ గారూ !
రాఘవ గారికి గురువులైన ధర్మవరం, కోలాచలం గార్ల గురించి మీరు రాసిన వ్యాసం చాలా వివరంగా వుంది. అరుదైన వీరి సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు.
Post a Comment