Saturday, August 6, 2011

లిటిల్ బాయ్

మానవుడే మహనీయుడు 
శక్తిపరుడు... యుక్తిపరుడు... మాననీయుడు 

శక్తితో అంతరిక్షాన్ని జయించాడు
గానీ.. తోటి మనుష్యులను గౌరవించలేడు

యుక్తితో అణువును చేధించాడు 
గానీ..తోటి మనుష్యులను వధించాడు

మానవుడు మాననీయుడు కాగలుగుతున్నాడు
గానీ...మహనీయుడు మాత్రం కాలేకపోతున్నాడు

తన మేధతో అనంత సాగరాలను మదిస్తున్నాడు
గానీ... తనలోని ఈర్ష్యాసూయలను  జయించలేకపోతున్నాడు

తన జ్ఞానంతో విశ్వ విజ్ఞానాన్ని  ఔపోశన పట్టేస్తున్నాడు
గానీ... తన అహాన్ని, ద్వేషాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు

మానవుడు మహనీయుడు కాగలిగిన రోజు
దురాలోచనలుండవు..దురాక్రమణలుండవు

అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకుంటే
హిరోషిమా నాగసాకిలాంటి భీభత్సాలుండవు

అదే జరిగితే.....
మానవాళికి మంచిరోజులు వచ్చినట్లే !
సుఖశాంతులు వెల్లివిరిసినట్లే !!

ఈ కల నిజం కావాలని ఆశిద్దాం !!
ఆరోజు రావాలని కోరుకుందాం !!!

 జపాన్ లోని హిరోషిమా నగరం మీద అమెరికా అణుబాంబు వేసి సృష్టించిన విధ్వంసం మానవజాతి మరువలేనిది... మరపురానిది. మరోసారి జరుపరానిది.... జరగకూడనిది. 

1945 ఆగష్టు 6 వ తేదీన సరిగా ఉదయం గం. 8 - 16 ని. లకు హిరోషిమాపై లిటిల్ బాయ్ అని ముద్దు పేరు పెట్టుకున్న ఆ అణు బాంబును అమెరికా వదిలింది. సుమారు 80,000 మందిని పొట్టనబెట్టుకుంది..........




Vol. No. 02 Pub. No. 306

2 comments:

కెక్యూబ్ వర్మ said...

అణ్వస్త్రాలు వద్దు మాకు
అన్నవస్త్రాలు చాలు మాకు..

అణ్వస్త్ర రహిత ప్రపంచం కల కాకూడదు...థాంక్యూ సార్..

SRRao said...

* కెక్యూబ్ వర్మ గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం